Krishna Mukunda Murari: మురారి కోసం ముకుందా హాల్లో ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక మురారి ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఏసీబీ సార్ అంటూ కృష్ణ తన దగ్గరకు వచ్చి పలకరిస్తుంది. వస్తూ వస్తూనే వాటర్ బాటిల్ని తీసుకువచ్చి మురారికు ఇస్తుంది. ముకుందా ఆత్రంగా మురారితో మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉంటుంది. మురారి డాడీ తో మాట్లాడాడా లేదా మాట్లాడితే ఏం చెప్పుకుంటాడు అంత సులువుగా మురారి ఒప్పుకోడు కదా.. ఒప్పుకున్నాడా లేదా అంటూ తన మనసు సంధించే ప్రశ్నలకు సమాధానం దొరకగా ముకుందా ఉక్కిరిబిక్కిరి అవుతూ మురారి మురారి అంటూ.. తనతో మాట్లాడాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ మురారి తనతో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. మురారి మౌనాన్ని భరించలేక ముకుందా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari: మాస్టర్ ప్లాన్ వేసిన మురారి.. ముకుందకి శాశ్వతంగా దూరం.!?
కాసేపటి తరువాత కృష్ణ మురారి కోసం కాఫీ తీసుకొచ్చి తనకు ఇవ్వాలని చూస్తుండగా మురారి ఏదో ఆలోచనలో పడి ఉన్నాడని అర్థం చేసుకుంటుంది కృష్ణ. ఏమైంది ఏసీబీ సార్ ఎవరి గురించి ఆలోచిస్తున్నారు అని కృష్ణ అడుగుతుంది ముకుందా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు అంటే మురారి మౌనంగా ఉండిపోతాడు. ఇక మురారి తన గదిలోకి వెళ్ళగానే కృష్ణ ఎవరికో పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంది. అలా మాటల మధ్యలో మీ పుట్టినరోజు ఎప్పుడు కృష్ణ అనగానే సెప్టెంబర్ 12 అని అంటుంది. అయితే చాలా రోజులు ఉంది గాని మురారి అంటాడు. ఆరోజు నా పుట్టినరోజు మాత్రమే కాదు ఏసిపి సర్ ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. ఆ రోజుతో మన అగ్రిమెంట్ ముగుస్తుంది అని కృష్ణ అంటుంది. మాటకి ఇద్దరి మధ్యలో మౌనం ఆవహిస్తుంది. కృష్ణను వెళ్ళద్దు అని మురారి చెప్పలేడు ఉంటాను అని కృష్ణ చెప్పలేదు.

మురారిని ముకుందకి మెసేజ్ చేసి మాట్లాడడానికి రమ్మంటాడు నిజంగా నువ్వేనా మురారి నీతో మాట్లాడడానికి నన్ను పిలిచావా అంటూ ముకుందా ఆనందంగా మురారి దగ్గరకు వచ్చి అడుగుతుంది. నువ్వు నాతో మాట్లాడటం కాదు. నేనే నీతో మాట్లాడాలని పిలిచాను కారు ఎక్కు అని మురారి అంటాడు.

కృష్ణకు నాకు మధ్య ఉన్న అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి మీ నాన్నకు ఎందుకు చెప్పావు. కృష్ణ వెళ్ళిపోతుంది అని ఆయన నన్ను నేరుగా అడుగుతున్నారు అని మురారి సూటిగా ముకుందను ప్రశ్నిస్తాడు. కృష్ణ వెళ్లిపోయేది నిజమే కదా అని ముకుందా తనని తాను సమర్ధించుకుంటుంది . షట్ అప్ అని మురారి పెద్దగా అరుస్తాడు. దట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్.. నీకేంటి సంబంధం మీ నాన్నకి ఏంటి సంబంధం మీ ఇద్దరి మధ్య ఈ వ్యక్తిగత విషయం ఎందుకు అని మురారి అడుగుతాడు. ఎందుకంటే ఇది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. కృష్ణ వెళ్లిపోతేనే నా జీవితానికి ఒక దారి దొరుకుతుంది కాబట్టి. సాటి ఆడిదాని కాపురం కూలిపోతే అక్కడ కూడా నువ్వు నీ సంతోషాన్ని వెతుక్కుంటున్నావా అని మురారి ప్రశ్నిస్తాడు. నేను కృష్ణ వెళ్లిపోయిన నీతో రాకపోతే అని మురారి అడుగుతాడు.

రేపు ఆదర్శ తిరిగి వస్తే నేను తనని కూడా మోసం చేసినట్టే కదా.. అందుకే నేను నీకు విడాకులు ఇప్పిస్తాను. ఆ తర్వాత నువ్వు విడాకులు తీసుకొని నీ పుట్టింటికి వెళితే నీ నిర్ణయాలు నీవి.. అర్థమైందా అని మురారి ముకుందకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు మురారి అంత సులువుగా నువ్వు నీ జీవితంలో నుంచి నన్ను వెళ్ళగొడతావా అంటూ ముకుందా కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతుంది. నేను నీ ప్రేమను కోరుకుంటే నువ్వు నన్ను ఒంటరి దాన్ని చేసుకొని చేసి నన్ను వెళ్ళగొడతాను అంటావా అప్పుడు ఈ ముకుందా ప్రాణాలతో ఉంటుంది అనుకుంటున్నావా.. బ్రతికున్న సవమవుతుంది మురారి నిజం నేను జీవిత వాళ్ళ మారిపోతాను. నీ ప్రేమ లేని జీవితం ప్రాణం లేని శరీరం ఒక్కటే అంటూ ముకుందా అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతుంది. ఇక మురారి తన చేయి పట్టుకుని వెనక్కి లాగుతాడు కానీ ముకుందా తనతో పాటు రాదు. ఇక మురారి కాసేపటి తరువాత తనని తీసుకొచ్చి కార్లో కూర్చోబెడతాడు. ఇప్పటివరకు మురారి అంటే ప్రేమగా ఉన్న ముకుందా మనసులో మురారి తన మనసు విరిగేలా చేస్తున్నాడు. నిన్న వాళ్ళ నాన్న ఇచ్చిన సలహా ప్రకారం ముకుంద మనసులో తన ప్రేమను శాశ్వతంగా తుడిచేయాలని మురారి పథకం ప్రకారం ఇదంతా చేస్తున్నాడని ముకుందా తెలుసుకుంటుందో లేదో చూడాలి.

ఇక రేపటి ఎపిసోడ్లో కృష్ణ వాళ్ళ నాన్న ఫోటో ముందు నిలబడి ఏసీబీ సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ గడువు అయిపోయిన తర్వాత ఆయన నన్ను వెళ్లిపోమంటే.. ఏం చేయాలి అని అంటుండగా.. మురారి అక్కడికి వస్తాడు. కృష్ణ నీలో నాకు నీ తింగరితనం నచ్చింది. అలా నాలో నీకేం నచ్చింది అని మురారి ప్రశ్నిస్తాడు. ఇక కృష్ణ అప్పుడే మురారి కి ప్రపోజ్ చేస్తూందేమో చూడాలి.