Krishna Mukunda Murari: మురారి అసలు నువ్వేనా.. నీ ప్రవర్తన ఏంటి ఇలా మారింది అని కృష్ణ విషయంలో నువ్వు చేసింది తప్పు అని రేవతి మురారికి చివాట్లు పెడుతుంది. ఇక అప్పుడే ముకుంద కూడా అక్కడికి వచ్చి ఏది ఏమైనా కానీ.. నువ్వు కృష్ణ విషయంలో చేసింది చాలా తప్పు మురారి అని ముకుందా అంటుంది. అనండి అందరూ నన్నే అనండి అని మురారి అంటాడు. వాళ్లంటున్న మాటలకు కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు మురారి.

కృష్ణ ఇంట్లోకి వస్తుంది. మరో యుద్ధం మొదలవుతుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావా ఉంటున్నావా అని కృష్ణని భవాని నిలదీస్తుంది వెళ్ళిపోతున్నాను అని కృష్ణ సమాధానం చెబుతుంది నీకేమైనా పిచ్చి పట్టిందా కృష్ణ నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అంటూ రేవతి కృష్ణ కి చివాట్లు పెడుతుంది అయినా కానీ కృష్ణ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది.
ఈ ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోతే ఎవరూ బాధపడరు అని అనుకుంటున్నావేమో.. మురారి మాత్రం చాలా బాధపడతాడు. మురారి కోసమైనా నిన్ను ఇంట్లో ఉంచుతాను అని భవాని అంటుంది. అందుకే నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను అని భవాని అంటుంది నాకు తెలిసి వస్తాయా మీరు ఏం అవకాశం ఇస్తారో .. ఏం కండిషన్ పెడతారు. ఇకనుంచి నందిని జోలికి వెళ్ళకూడదు అంటారు. కానీ నేను అస్సలు ఊరుకోను. నేను ఇప్పుడే వెళ్లి లగేజ్ తెచ్చుకుంటాను. నేను ఇంట్లో లేకపోయినా సరే బయటి నుంచి అయినా సరే నందిని బాగోగులను చూసుకుంటాను. అది నా బాధ్యత అని కృష్ణ తన గదిలోకి వెళ్తుంది.
వచ్చావా కృష్ణ నీకోసమే ఎదురుచూస్తున్నాను నన్ను క్షమించు అని మురారి అంటాడు. ఇప్పటివరకు మీరు చేసింది చాలు. ఇక మీకు నాకు తెగ తెంపులు తప్ప మరి ఇంకేమీ లేదు అని కృష్ణ అంటుంది. ఒక్కసారి నేను చెప్పేది విని కృష్ణ ప్లీజ్ అని మురారి వేడుకుంటాడు. కానీ మురారి మాటల్లో అస్సలు పట్టించుకోదు. లెక్కచేయదు కృష్ణ.
ఇక రేపటి ఎపిసోడ్లో కృష్ణ లగేజ్ బ్యాగ్ ని తీసుకొని కిందకు వస్తుంది. సారే పెట్టి సాగనంపాలని అనుకుంటుంది భవాని. కృష్ణ నాలుగడుగులు ముందుకు వేసినట్టే వేసి నేను ఇంట్లో నుంచి వెళ్ళను అత్తయ్య ఇక్కడే ఉంటాను. నేను నిర్దోషిని అని నిరూపించుకున్న తర్వాతే వెళ్తాను అని కృష్ణ వెనక్కి వస్తుంది . దాంతో మురారి, రేవతి ఇద్దరూ సంతోషిస్తారు.