Krishna Mukunda Murari May 25: కృష్ణ వాళ్ళ నాన్న ఫోటో ముందు నిలబడి ఏసీబీ సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ గడువు అయిపోయిన తర్వాత ఆయన నన్ను వెళ్లిపోమంటే.. ఏం చేయాలి అని అంటుండగా.. మురారి అక్కడికి వస్తాడు. నేను ఏం మాట్లాడారు అని కృష్ణ అడుగుతుంది లేదు కృష్ణ నాకు అర్జెంటుగా కాఫీ కావాలి తీసుకొస్తావా అని మురారి అడుగుతాడు మీరు ఇలా భార్యకు చెప్పునట్టు స్లోగా చెప్పకండి ఏసీబీ సార్ మీ ఆఫీస్ లో టీ తీసుకురమ్మని ఎలా చెప్తారో అలా చెప్పండి అని కృష్ణ అంటుంది ఆఫీసులో కూడా నేను ఇలాగే చెప్తాను కృష్ణ మురారి అంటాడు మీరు మరీ ఇంత సాఫ్ట్ గా ఉంటే ఎలా ఎసిపి సార్ అని కృష్ణ అంటుంది.

కృష్ణ ముకుంద కీచులాట..
కృష్ణ నీలో నాకు నీ తింగరితనం నచ్చింది. అలా నాలో నీకేం నచ్చింది అని మురారి ప్రశ్నిస్తాడు. కృష్ణ మురారి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ మీలో నాకు మీ అమాయకత్వం నచ్చింది. ఏసీబీ సార్ అని కృష్ణ. కృష్ణ బయటకు వస్తుండగా.. కృష్ణకి ఎదురుగా ముకుందా వస్తుంది ముకుందని చూసి కృష్ణ కళ్ళు ఎగరేస్తుంది ఏంటి నన్ను చూసి కళ్ళు ఎగరేస్తున్నారు ఒళ్ళు పిచ్చిపిచ్చిగా ఉందా అని ముకుందా అంటుంది ఆ మాటకి మాట పెరిగి ఇద్దరి మధ్యన గొడవ పెరుగుతుంది వాళ్ళిద్దరూ గొడవ పడడం చూసిన మధు వాళ్ళని వీడియో షూట్ చేస్తారు. ఆ వీడియో చూసిన వాళ్ళిద్దరూ చి చి మనిద్దరం ఇంత దారుణంగా గొడవపడ్డామా కృష్ణ అయినా చదువుకున్న మన ఇద్దరం ఇలా గొడవ పడడం ఏం బాగోలేదు అర్జెంటుగా ఆ వీడియో తీసేయమని అంటారు. అందులో అలేఖ్య వచ్చి వెంటనే డిలీట్ చేస్తుంది..
Krishna Mukunda Murari: మురారి తనతో మాట్లాడిందంతా పథకం ప్రకారమే అని ముకుందా తెలుసుకుంటుందా.!?
అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కృష్ణ
మధు ఆ తర్వాత కృష్ణ దగ్గరకు వచ్చి వదిన వదిన మొన్న మీ ఇద్దరు ప్రపోజ్ చేస్తున్న వీడియో చాలా బాగా వైరల్ అయింది. బోలెడన్ని వ్యూస్ వచ్చాయి. పైగా నాకు అలా డబ్బులు వచ్చాయి. అందుకే నేను ఈరోజు సాయంత్రం మళ్ళీ ఇంకొక వీడియో కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు చేసే వీడియోలో నువ్వు మురారి కి ప్రపోజ్ చేయాలి అని మధు అంటాడు .మళ్ళీ ప్రపోజ్ చేయాలా అయినా మురారి ఏసీబీ సార్, నేను డాక్టర్ మా ఇద్దరికీ ఇలాంటివి సెట్ కావాలి కృష్ణ 2 ప్లీజ్ ప్లీజ్ వదిన నాకోసం ఒప్పుకో అని మధు ఈ అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని తన మనసులో ఉన్న ప్రేమను మురారి కి చెప్పాలి అని కృష్ణ అనుకుంటుంది. ఇంకా ఆ తరువాత మురారి కూడా అక్కడికి రాగానే మురారిని ఒప్పించమని మధు అడుగుతాడు. ఇక కృష్ణ అడిగేసరికి తను గోవుముగా ప్లీజ్ ఎసిపిశారని ఏసీబీ సార్ అని అనేసరికి ఒప్పుకుంటాడు. మధు మురారిని ఎత్తుకొని గబగబా తిప్పేస్తాడు.

Brahmamudi: రాహుల్ నిజస్వరూపాన్ని స్వప్న కి చూపించడానికి అదిరిపోయే ప్లాన్ వేసిన కావ్య
తన మనసును మురారి ముందు ఆవిష్కరించిన కృష్ణ
కృష్ణ బుట్ట బొమ్మ లాగా రెడీ అయ్యి మురారి కి తన మనసుని, తన మనసులో ఉన్న ప్రేమని ఓ అందమైన కావ్యంగా మరిచి ప్రతి అక్షరాన్ని నోటితో కాకుండా మనసుతో పలుకుతూ వేల భావనలు కలలో పలుకుతూ తన మనసుని మురారి ముందు ఆవిష్కరిస్తుంది. అంతే కాకుండా మోకాళ్ళ మీద నిలబడి మురారిని ప్రేమిస్తున్నానని చెబుతుంది. ఇదంతా నిజమని ఒకప్పటి కృష్ణను కాదని మురారికి అర్థమయ్యేలాగా కృష్ణయ్యను ఇష్టపడుతున్న రాదలా కనిపిస్తుంది.

ఆ క్షణం కృష్ణ ఇక మురారి కృష్ణ ప్రేమను యాక్సెప్ట్ చేసి తనని హత్తుకుంటాడు దాంతో అందరూ క్లాప్స్ కొడతారు నేను ఏసీబీ సరికి ప్రపోజ్ చేశాను. మరి ఏసిపి సార్ నాకు ప్రపోజ్ చేయరా అంటూ కృష్ణ అడిగేసరికి కృష్ణ మనసులో ఉన్నది ఏంటో నాకు అర్థం అయింది. ఇంక నేను ప్రపోజ్ చేయాల్సిన అవసరం లేదు అని మురారి అంటాడు. ఆ మాటకి కృష్ణ మనసు నోచ్చుకున్న పైకి మాత్రం నవ్వుతూ ఉండిపోతుంది.

మౌనమేలనోయి ముకుంద..
కృష్ణ మురారి మధు ఇంటికి రాగానే పెద్దమ్మ నీ కోడలు నా అన్నయ్య మురారికి ప్రేమ ప్రపోజ్ చేసింది. ఆ వీడియో చాలా అద్భుతంగా వచ్చింది. ఒక్కసారి మీరు ఆ వీడిని వేళ లైక్స్ వస్తాయి, వీడియో కి సంబంధించిన విషయాలు చెబుతాడు మధు. ఇక కృష్ణని అందరూ ఆకాశంలోకి ఎత్తేస్తూ ఉండగా ముకుంద మురారి వైపు చూస్తూ ఉండిపోతుంది. తనలో బాధ తనకు తప్ప ఇంకెవరికి కనిపించలేదు. ముకుంద బాధపడుతూ కృష్ణ ను మురారి అన్న మాటలను తలచుకుంటూ ఏకాంతంగా కూర్చుని ఉండిపోతుంది.

ఇక రేపటి ఎపిసోడ్ లో కృష్ణ వాళ్ళ నాన్న ఫోటోని చూస్తూ నాన్న నేను మీ అల్లుడు మురారితో ప్రేమలో పడ్డాను అని అంటుంది ఇక మంచం ఎక్కి డాన్స్ చేస్తుండగా మురారి అక్కడికి వస్తాడు. తను పడుబోతుండగా తనని గట్టిగా పట్టుకుంటాడు. కృష్ణ మురారిపై ఉన్న ప్రేమను ఇన్ డైరెక్ట్ గా వ్యక్తపరుస్తూ తన చుట్టూ తిరుగుతూ డాన్స్ చేస్తుంది. ఇక తన మనసులో ఉన్నది నిజమైన ప్రేమ అని మురారితో చెబుతుందో లేదో చూడాలి.