Krishna Mukunda Murari: నన్ను కాల్చేటప్పుడు మీరు ఎందుకు అడ్డం వచ్చారు అని కృష్ణ అడుగుతుంది. అదేంటి కృష్ణ చూస్తూ చూస్తూ నా ముందు నీ ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకుంటానా అని మురారి అంటాడు. ఒకవేళ నిజంగానే నన్ను మీ పెద్దమ్మ కాల్చి ఉంటే అనే కృష్ణ అనగానే తన పెదాల మీద చేయి అడ్డు పెడతాడు మురారి. ప్లీజ్ కృష్ణ అలా మాట్లాడకు అని మురారి అంటాడు. నువ్వు చేసింది మంచి పని కృష్ణ. అందుకే నేను నీకు సపోర్ట్ చేశాను ఆఖరి నిమిషంలో నేను ఏ నిర్ణయం తీసుకున్నాను అంటే నాది కూడా తప్పుంది కదా అని మురారి అంటాడు. మన ఇద్దరం కలిసి చేసిన ఈ మంచి పని వలన నందిని సంతోషంగా ఉంటుంది. గౌతమ్ సార్ త్వరలోనే నందిని మామూలు మనిషిని చేసి మనం ముందుకు తీసుకువస్తాడు అని కృష్ణ అంటుంది. అప్పటివరకు ఈ ఇంట్లో ఈ గొడవలు తప్పవా ఎన్నాళ్ళు ఈ మౌన పోరాటం చేయాలి. మా పెద్దమ్మకి నా మీద ఎప్పుడు ఇంత కోపం రాలేదు. మొదటిసారి నన్ను మా పెద్దమ్మ ఈ విషయంలో ద్వేషిస్తుంది. ఆ బాధ నాకు చాలా నరకంగా ఉంది కృష్ణ అంటూ మురారి బాధపడతాడు.

Krishna Mukunda Murari: కృష్ణ తలకి గన్ గురి పెట్టిన భవాని.. మళ్ళీ ఏం చేసింది.!?
ఏసిబీ సార్ మీరు స్నానానికి వెళుతూ వెళుతూ టవల్ తీసుకు వెళ్ళడం మర్చిపోయారు. ఇదిగోండి ఈ టవల్ తీసుకోండి అని కృష్ణ ఇస్తుంది ఇది నాది కాదు కదా కృష్ణ అని మురారి అంటాడు. సరే భోజనానికి వెళ్దాం రమ్మని మురారి ని కృష్ణ పిలుస్తుంది వద్దు నేను రాను అని మురారి అంటాడు. నేను రామకృష్ణ మనం ఇప్పుడు కిందకి వెళ్తే మళ్లీ ఏం జరుగుతుందో ఏమో అని భయంగా ఉంది. ముందు మా పెద్దమ్మ ఏమనుకుంటుందో తను మారుతుందో లేదో కూడా నాకు భయంగా ఉంది అని మురారి అంటాడు. అందుకు బదులుగా కృష్ణ.. ప్రకృతి ప్రతినిత్యం మారుతూనే ఉంటుంది అలాగే మీ పెద్దమ్మ కూడా మారుతుంది. భోజనానికీ రమ్మని చెబుతుంది. కృష్ణ ఇక కృష్ణ మాట కోసం మురారి కిందకు వస్తాడు. వాళ్ళ పెద్దమ్మ భోజనం చేస్తుండగా మురారి కృష్ణ వచ్చి కూర్చుంటారు. ఆ వెంటనే భవానీ లేచి నిలబడుతుంది. భవాని లెగవటంతోనే ఇక ఇంట్లో వాళ్ళందరూ లేచి నిలబడతారు వాళ్లతో పాటు కృష్ణా మురారి కూడా లేచి నిలబడతారు పదా కృష్ణ మనం మన గదిలోకి వెళ్ళిపోదాం, నా ఆకలి చచ్చిపోయింది అని మురారి అంటాడు. నాకు కూడా ఆకలిగా లేదు ఏసీబీ సార్ పదండి అని కృష్ణ అంటుంది. ఇక వాళ్లు వెళ్లిపోతుంటే రేవతి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని చూస్తూ నిలబడిపోయి ఉంటుంది.

Brahmamudi: కావ్యను అపర్ణ కోడలుగా ఒప్పుకుందా.. అప్పు, కళ్యాణ్ రాహుల్ గుట్టు బయట పెడతారా..
ఆ తర్వాత భవాని కూర్చుని ఆకలిగా లేని వాళ్ళకి ఆకలి చచ్చిపోయిన వాళ్ళ గురించి మీకు ఎందుకు.. అందర్నీ తినమని ఆదేశిస్తుంది. నాకు వాళ్లతో కలిసి కూర్చొని తినడం ఇష్టం లేదు అందుకే లేచి నిలబడ్డాను అని రేవతి తో అంటుంది. ముకుంద మనందరం భోజనం చేసిన తరువాత మిగిలిపోయిన ఫుడ్ అంతా తీసుకెళ్లి వాచ్మెన్ కి ఇచ్చేసేయ్ అని భవాని అంటుంది ఏంటి ఏం సమాధానం రావట్లేదు అని అంటే సరే అని తల ఊపుతుంది ముకుందా.

ఆ తర్వాత ముకుందా దేని మురారి గురించి ఆలోచిస్తూ నో అని పెద్దగా అరుస్తుంది. ఏమైంది ముకుందా అని భవాని అడుగుతుంది. మురారి వాళ్ల గురించి తెలుసుకొని బాధపడుతున్నాను అని ముకుందా అంటుంది అత్తయ్య నేను మీతో ఒక విషయం చెప్పాలి మురారి చేసింది కరెక్టే అత్తయ్య మిమ్మల్ని ఎదిరించినా కూడా నందిని కి మంచి జీవితం ఇచ్చాడు కదా అత్తయ్య తనను క్షమించవచ్చు కదా అన్నట్టుగా ముకుందా మాట్లాడుతుంది. ఆ మాటలకు భవాని నువ్వు నాకు సలహా ఇచ్చేంత పెద్దదానివి అయిపోయావా? అయినా నీ చేత సలహాలు చెప్పించుకునే పరిస్థితిలో నేను లేను అని భవాని అంటుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి అత్తయ్య మీరిద్దరూ వాళ్ళిద్దరిని దూరం చేస్తున్నారు అని అనుకుంటున్నారేమో కానీ, కృష్ణ మురారి మాత్రం ఇద్దరూ ఆ గదిలోనే ఉంటూ మరింత దగ్గర అవుతున్నారు. వాళ్ళకి కావాల్సినంత ఫ్రీడమ్ వచ్చింది అంటూ ముకుందా తన మనసులో ఉన్న అక్కసు మొత్తాన్ని భవాని ముందు వెళ్ళగక్కుతుంది.

కాసేపటి తర్వాత మురారి కృష్ణ ఇద్దరూ భోజనం చేయడానికి ఎందుకు వస్తారు. ఈ రోజు డిన్నర్ నేను మీకు గుర్తుండిపోయేలాగా వడ్డిస్తాను మీరు కూర్చోండి అంటూ కృష్ణ ప్లేట్ ఓపెన్ చేస్తుంది. ఆ తర్వాత వర్తిద్దామని చూస్తే ఒక్క దాంట్లో కూడా ఫుడ్ ఉండదు అది చూసి కృష్ణ బాధపడుతుంది వెంటనే మంచినీళ్లు గ్లాసులో పోసి ఇచ్చి మురారి కి ఇస్తుంది తాగమని ఆ తరువాత డిన్నర్ చాలా బాగుంది కదా ఏసీబీ సర్ మునక్కాడ పులుసు సాంబారు రసం మజ్జిగ చారు అంటూ కవర్ చేస్తుంది ఆ మాటలకు మురారి కృష్ణను చూస్తూ ఉండిపోతాడు. ఇక రేపటి ఎపిసోడ్లో మురారి నిద్రలేచేసరికి కృష్ణ రెడీ అయి తల తుడుచుకుంటూ ఉంటుంది . ఏంటి కృష్ణ ఇవాళ కొత్తగా కనిపిస్తున్నావు అని మురారి అడగగానే నేను ఇంకా జడేసుకోలేదు ఏసీబీ సార్. మీరు నాకు జడేస్తారా అంటూ కృష్ణ మురారిని ఆట పట్టిస్తుంది. నేను నీకు ఇద్దరు గిల్లికజ్జాలు ఆడుకుంటూ ఉండగా కృష్ణ వచ్చి మురారి మీద పడుతుంది. దాంతో ఇద్దరూ ఓ డ్యూయెట్ వేసుకుంటారు. మిగతా విశేషాలు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.