Krishna Mukunda Murari: ముకుందా కాఫీ కప్పుతో మురారి దగ్గరకు వస్తుంది.. అదేంటి నువ్వు లోపలికి వస్తున్నావు అని మురారి అడుగుతాడు. నాకు నీ మీద ఏకాంతంగా గడపడమే కావాలి అని ముకుందా అంటుంది. అంతలో కృష్ణ అక్కడికి వస్తుంది నువ్వేంటి కాఫీ కప్పు తీసుకొని వచ్చావు అన్నట్టుగా కృష్ణ ముకుంద వైపు చూస్తుంది. చిన్నత్తయ్య కు బాగోలేదు అందుకే నేను కాఫీ తీసుకువచ్చాను అని ముకుందా అంటుంది.

అవునా నేను వెళ్లి పలకరించి వస్తాను అని కృష్ణ వెళ్ళబోతుండగా లేదు.. నేను అత్తయ్యకి టాబ్లెట్ ఇచ్చాను. తను టాబ్లెట్ వేసుకొని రెస్టు తీసుకుంటుంది. నువ్వు త్వరగా రెడీ అవ్వు కాలేజ్ కి వెళ్ళాలి కదా అని ముకుందా అంటుంది. ఇక కృష్ణ రెడీ అయ్యి కిందకు రాగానే ముకుందా నీకోసం నేనే లంచ్ ప్రిపేర్ చేశాను అని కృష్ణ చేతిలో పెడుతుంది. బాక్స్ థాంక్యూ అని చెప్పి ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుండగా ..ఏసిపి సార్ మీరు మధ్యాహ్నం భోజనానికి వస్తారా అంటే..మురారి సంగతి నీకు ఎందుకు .. నువ్వు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయి ..నేను మురారి సంగతి చూస్తుంటాను అని చెబుతుంది ముకుంద.

కృష్ణ మీ కాలేజీలో దింపి డాక్టర్ కొట్ కృష్ణ కి వేసి మెడలో సతస్కోప్ కూడా వేస్తాడు. మురారి ఒక్క సీన్ తో మురారి తన మనసుకు దగ్గర అయిపోతాడు కృష్ణకి. కృష్ణ మురారి మైకంలో పడిపోయి తను వెళ్తున్న అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇక బాయ్ చెప్పి అక్కడ నుంచి మురారి వెళ్ళిపోతాడు. కృష్ణ తన మేడం దగ్గరికి వెళ్లి వర్క్ లో జాయిన్ అవుతుంది.

ఇక రేపటి ఎపిసోడ్లో కృష్ణ ఇంట్లో పని చేయడం లేదని రేవతి ఒక్కతే ఎంతసేపని ఇంట్లో పనులు చేసుకుంటుంది. అని భవాని అడుగుతుంది ఇక అప్పుడే అందరు చూపు కృష్ణ పై పడుతుంది. కృష్ణ చదువుకోవాలంటే ఇంట్లో పనులు కూడా చక్కబట్టాల్సిందే అని భవాని ఫైనల్ డెసిషన్ చెబుతుంది. అప్పుడే ముకుందా మనసులో ఇంట్లో పనులు చేయలేక కృష్ణ హాస్టల్ కి వెళ్ళిపోవాలి. నాకు కావాల్సింది అదే కదా అని తను కూడా కృష్ణ పై నాలుగు మాటలు అంటుంది.