Krishna Mukunda Murari: కృష్ణ నీకోసమే ఎదురుచూస్తున్నాను నన్ను క్షమించు అని మురారి అంటాడు. ఇప్పటివరకు మీరు చేసింది చాలు. ఇక మీకు నాకు తెగ తెంపులు తప్ప మరి ఇంకేమీ లేదు అని కృష్ణ అంటుంది. ఒక్కసారి నేను చెప్పేది విని కృష్ణ ప్లీజ్ అని మురారి వేడుకుంటాడు. కానీ మురారి మాటల్లో అస్సలు పట్టించుకోదు. లెక్కచేయదు కృష్ణ. నేను వెళ్ళిపోతున్నాను అంటూ తన లగేజ్ బ్యాగ్ ని తీసుకొని కృష్ణ కిందకి వస్తుంది. ప్లీజ్ కృష్ణ నేను చెప్పేది ఒక్కసారి విను అంటూ.. మురారి తన వెంట పడుతూ వస్తాడు..

కృష్ణ లగేజ్ బ్యాగ్ ని తీసుకొని కిందకు వస్తుంది. రేవతి కాళ్లకు దండం పెట్టి ఎన్ని రోజులు నన్ను సొంత కూతురులా చూసుకున్నారు. నాకు అదే చాలు అత్తయ్య అని కృష్ణ అంటుంది. నేను లేనని వెళ్లిపోయానని మీరు బెంగ పెట్టుకోకండి అని కృష్ణ.. ఇక భవాని దగ్గరికి వచ్చి ఈ ఇంట్లో అందరికంటే మీరంటే నాకు చాలా ఇష్టం. ఈ ఇల్లు ముక్కలు అవ్వకుండా ఉమ్మడి కుటుంబంలో ఉంటుందంటే దానికి ప్రధాన కారణం మీరే అత్తయ్య మీరంటే నాకు ఎప్పటికీ ఇష్టమని కృష్ణ అంటుంది కృష్ణ కి సారే పెట్టి సాగనంపుతుంది.

ఇక కృష్ణ వెళ్ళిపోతుండగా మురారి ఆగు ఉండిపోమని చెబుతాడు. అప్పుడే కృష్ణ కావాలని నందిని విషయంలో తప్పు చేసింది అందుకే వెళ్ళిపోతుంది అని భవాని అంటుంది. కృష్ణ వెనక్కి వచ్చ నేను ఇంట్లో నుంచి వెళ్ళను అత్తయ్య ఇక్కడే ఉంటాను. నేను నిర్దోషిని అని నిరూపించుకున్న తర్వాతే వెళ్తాను అని కృష్ణ వెనక్కి వస్తుంది . దాంతో మురారి, రేవతి ఇద్దరూ సంతోషిస్తారు.
నందిని సిద్దు సిద్దు అని కలవరిస్తుండగా.. కృష్ణ నందిని దగ్గరకు వెళ్తుంది సిద్దు మంచివాడు కాదు చెడ్డవాడు అని నందిని అంటుండగా.. నీకు ఎవరు చెప్పారు.. ఎలా తెలుసు అంటే నాకు తెలుసు అని నందిని అంటుంది. సిద్దు చాలా మంచివాడు అని కృష్ణ చెబుతుంది. నీకు సిద్ధి గురించి తెలుసా అని అడగగానే తెలుసు అని అంటుంది.
ఇక రేపటి ఎపిసోడ్లో నందిని పూర్తి బాధ్యతను నేను చూసుకుంటాను. రోజు రాత్రిపూట నేను తన పక్కనే పడుకుంటాను అని కృష్ణ మురారి గదిలో నుంచి వెళ్ళిపోయి నందిని గదిలో పడుకుంటాను అని చెబుతోంది. ఈ విషయం అమ్మకి తెలిస్తే ఊరుకోదు అంటే ఒకవేళ రేవతి అత్తయ్య కి ఈ విషయం తెలిస్తే మనది అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పేస్తానని కృష్ణ మురారిని బెదిరిస్తుంది.