Krishna Mukunda Murari: ముకుంద కాలుగాలిన పిల్లి లాగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది.. తనని తీసుకువెళ్లడానికి ఆ ఇంటి నుంచి ఎవరైనా వస్తారా ముకుంద ఎదురుచూస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి మురారి తన ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొడతాడు.. ముకుందని తీసుకురావడానికి ఆ ఇంటికి వెళ్తాడు ముకుందా నీతో పాటు నేను అక్కడికి వస్తాను. కానీ నాదొక కండిషన్ నువ్వు కృష్ణతో అన్యోన్యంగా ఉండటానికి వీల్లేదు. నేను నీకోసం నా జీవితాన్ని నా ప్రేమను వదులుకున్నాను నువ్వు ఈ ఒక్క పని చేయలేవా అని ముకుందా అడుగుతుంది..

Krishna Mukunda Murari: కృష్ణ పై రేవతి ఫైర్.. మురారీతో కూడా కాలు పెట్టీ ఇంట్లొకి వచ్చిన ముకుందా..
ఇక మురారి మాత్రం తను అడిగా అన్ని ప్రశ్నలకు మౌనంగా ఉండిపోతాడు. కాసేపటి తరువాత ముకుందా అమ్మానాన్నలు సీన్లోకి వస్తారు. అయితే మురారికి ఏమి ఇవ్వలేదని కాఫీ ఇవ్వమని ముకుందతో చెబుతాడు. వాళ్ళ నాన్న మురారి నువ్వు వచ్చిన తర్వాత ముకుందా నీతో పాటు ఆ ఇంటికి వస్తానంటే నాకు ఏదో తేడాగా ఉంది. గతంలో మీరిద్దరూ ఎలా ఉంటారు ఇప్పుడు అనవసరం కానీ ఇప్పుడు మీరు ఎలా ఉంటున్నారు .అనేది అందరికీ అవసరం. మీ ఇద్దరి ప్రవర్తన బట్టి రెండు కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ముకుందా గతం నుంచి బయటకు రాలేదని నాకు అనిపిస్తుంది. కానీ తను గతం నుంచి బయటపడి ఆదర్శం సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత నీవే. ఆ మాటలకు ముకుందా వాళ్ళ అమ్మ కూడా మురారి కి ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తను తీసుకుని నిర్ణయం మీదే మీ అందరి భవిష్యత్తులతో పాటు కుటుంబాలు కూడా ఆధారపడి ఉన్నాయని గుర్తుంచుకోమని సీరియస్గా చెబుతుంది. సరే అని మురారి అంటాడు.

మురారి కృష్ణుని తీసుకుని ఇంటికి వస్తుండగా.. దారిలో ముకుందా ఆపమని అడుగుతుంది. కాసేపు బయట కబుర్లు చెప్పుకుందాం అని అంటుంది .నాకు అర్జెంట్ వర్క్ ఉంది ముకుందా? వెళ్ళాలి అని అంటాడు. అయితే నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది అంటూ కార్ మధ్యలో ఆపేసి దిగమని చెబుతుంది. ఇక ముకుంద బలవంతం మేరకు మురారి కార్ లో నుంచి దిగుతాడు . సగం తినేసిన తర్వాత వెళ్దామా అని అడగగానే.. నువ్వు నేను తిన్న ఐస్ క్రీం తింటేనే నీతో పాటు ఇంటికి వస్తాను అని ముకుంద మురారితో అంటుంది. ముకుందా ఎంటిది అని చిరాగ్గా మురారి అంటాడు. నా ఎంగిలి నువ్వు తింటేనే నేను వస్తాను అని మురారి నీ అడుగుతుంది ముకుంద . ఇక మురారి ఏం చేస్తాడో చూడాలి తప్పించుకుని ఇంటికి తీసుకెళ్తాడా తప్పక తింటాడా అనేది చూడాలి..

ఇక రేపటి ఎపిసోడ్లో మురారితోపాటు ముకుందా ఇంటికి వస్తుంది రేవతి ఏదైతే జరగకూడదు అని మనసులో అనుకుంటూ భయపడుతుందో ఇక అదే జరుగుతుంది ఇక ఇంట్లోకి కృష్ణ ముకుందా మురారి ముగ్గురు కలిసి కుడి కాలు పెట్టి ఇంట్లోకి వస్తారు ఆ సీన్ చూసి రేవతి కంగారు పడుతుంది మురారి కి ముకుంద దగ్గర అవుతుందేమోనని భయపడుతూ ఉంటుంది.