Krishna Mukunda Murari: కృష్ణ నన్ను క్షమించు ప్లీజ్ నేను నిన్ను బాధ పెట్టాలని ఏమీ చేయలేదు. ఇప్పటికైనా క్షమించు అని మురారి వేడుకుంటాడు. కానీ కృష్ణ ససే మీరా ఒప్పుకోను అని చెబుతుంది. కృష్ణ తన గదిలో నుంచి వెళ్ళిపోబోతుండగా నన్ను క్షమించాలి అంటే నేనేం చేయాలి చెప్పు అని మురారి అడుగుతాడు. అయినా కానీ పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతున్నా కృష్ణని నేను చచ్చిపోతే అయినా నువ్వు నన్ను క్షమిస్తావని అడుగుతాడు. ఆ మాటలకు కృష్ణ బాధపడుతుంది.

ఇక తన గదిలోనే ఆ రాత్రంతా గతంలో మురారితో జరిగిన మధురమైన క్షణాలను నెమరు వేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. మురారి కిందకు వచ్చి సోఫాలో నిద్రపోతాడు. ఏమైంది ఇక్కడ పడుకున్నావు అని అడుగుతుంది. ఏం లేదు అంటూ మురారి మళ్ళీ తన గదిలోకి వెళ్తాడు కృష్ణ తన బెడ్ మీద పడుకుని నిద్రపోవడం చూసి తన పక్కన కూర్చుంటాడు.
ఇక నిద్రలో చేయి అనుకోకుండా మురారి కి తగలగానే లేచి కూర్చుంటుంది. కృష్ణ ఇప్పటికైనా నన్ను క్షమించావు థాంక్యూ అని మురారి అంటాడు. లేదు నేను క్షమించలేదు అని కృష్ణ అంటుంది. నేను మిమ్మల్ని క్షమించాలి అంటే మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. ఇద్దరు మేజర్స్ ని కి మీరు పెళ్లి చేయాలి అని కృష్ణ అడుగుతుంది మురారి. తప్పకుండా చేస్తాను అని మాట ఇస్తారు. వాళ్ళిద్దరూ ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

ఏమైంది అక్క రాత్రి అంతా నిద్ర పోలేదా నన్ను అడిగితే కాఫీ పెట్టి ఇచ్చేదాన్ని కదా అని రేవతి అంటుంది. లేదు వచ్చి నా పక్కన కూర్చొని నీతో మాట్లాడాలి అని భవాని రేవతితో అంటుంది. నందిని ఇక్కడి నుంచి పంపించేస్తున్నాను. అమెరికాలో మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటుంది అని భవాని రేవతితో అంటుంది. ఎందుకు అక్క ఇక్కడ నందిని కృష్ణ బాగా చూసుకుంటుంది కదా అని రేవతి అంటుంది. ఈ విషయంలో మా వదినకి చెప్పే అంతా పెద్దదానివి అయిపోయావా నువ్వు అని రేవతిని అరుస్తాడు ఈశ్వర్.. అక్క నేను ఒక విషయం చెబుతాను. ఎప్పటికైనా మంచే గెలుస్తుంది అని చెప్పి రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

ఇక రేపటి ఎపిసోడ్లో మురారి కృష్ణా వెళుతున్న కారులోనే ముకుంద కూడా ఉంటుంది. ఏసీ పెంచనా అని అంటే నాకు ఇక్కడ మండిపోతుంది అని ముకుందా అంటుంది. ఏసీబీ సార్ కారు ఆపండి అని.. ముకుందని కారులో నుంచి దిగమని చెబుతుంది కృష్ణ. ఈ మాట మీ ఆయన్ని చెప్పమను అని అనగానే కృష్ణ మురారి వైపు చూస్తుంది..