Krishna Mukunda Murari: ఏసీబీ సార్ త్వరగా రండి గౌతమ్ సార్ కాల్ చేశారు. కాలేజీకి వెళ్ళాలి అని కృష్ణ పెద్ద కారవడంతో ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా అక్కడికి వస్తారు. ఏంటి కృష్ణ మురారి కోసం వెయిట్ చేయడం దేనికి నువ్వే ఏదో ఒక క్యాబ్ బుక్ చేసుకొని వెళ్లొచ్చు కదా అని ముకుందా సలహా ఇస్తుంది. అయినా మురారి ఏసీపీ సార్ అనుకుంటున్నావా.. లేదంటే నీ క్యాబ్ డ్రైవర్ అనుకుంటున్నావా.. నిన్ను పికప్ లు డ్రాప్ లు చేసుకుంటా పోతే తన రెస్పాన్స్ ఎవరు చేస్తారు అని ముకుందా అంటుంది ..

నేను వెళ్తున్నాను అంటూ కృష్ణ మురారి కి మెసేజ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ ముకుందా నువ్వు కృష్ణని అలా అనడం కరెక్ట్ కాదు అని ప్రసాద్ అంటాడు. ఎంతైనా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరూ గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు.. ఎవరి బాధ్యతలు నిర్వర్తించుకోవాలి అని ప్రసాద్ అంటాడు. ఇక మురారి నేను రెడీ కృష్ణ అంటూ కిందకు వస్తాడు. ఆలోపే కృష్ణ వెళ్ళిపోయింది అని చెప్పడంతో మురారి దిగాలుగా ఉంటాడు.
ఇక ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత కూడా తనకి ఫోన్ చేస్తూనే ఉంటాడు. కాల్ కట్ చేస్తూనే ఉంటుంది కృష్ణ. బిజీగా ఉండి మురారి ఫోన్ అటెండ్ చేయలేదు. ఇక ఆరోజు రాత్రి ఇంటికి చేరుకోగానే ముకుంద ఏంటి కృష్ణ ఇంత లేట్ అయింది అని అడుగుతుంది. హాస్పిటల్ లో లేట్ అయింది అని చెప్పేలోపే ఈ ఇంటికి టైం కి వచ్చే పని లేదా భవాని ఫైర్ అవుతుంది . అయినా కృష్ణ కాలేజీకే కదా వెళ్ళింది ఇప్పుడు ఈ పంచాయతీ అంతా ఎందుకు అని రేవతి అడుగుతుంది. అదే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మీరు అంతా ఇలాగే మాట్లాడతారా అని ముకుందా ప్రశ్నిస్తుంది.
అయినా నీ మంచి కోసమే కదా కృష్ణ చెప్పింది అని భవాని అంటుంది. అవును అత్తయ్య కృష్ణకి వాళ్ళ అత్తయ్యకి మంచిగా చెబితే అస్సలు అర్థం కాదు తిరిగి నన్నే అంటారు అని ముకుందా అంటుంది. మా అత్తయ్య మీ అత్తయ్య ఏంటి.. పెద్ద అత్తయ్య, రేవతి అత్తయ్య, చిన్న అత్తయ్య అని కదా పిలుస్తున్నాము అని కృష్ణ చెబుతుంది. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఇవన్నీ ఏంటి అని అంటుంది. ముకుంద ను కృష్ణ హద్దుల్లో ఉండమని హెచ్చరిస్తుంది.