Krishna Mukunda Murari: మురారితోపాటు ముకుందా ఇంటికి వస్తుంది. రేవతి ఏదైతే జరగకూడదు అని మనసులో అనుకుంటూ భయపడుతుందో.. ఇక అదే జరుగుతుంది. ఇక ఇంట్లోకి కృష్ణ ముకుందా మురారి ముగ్గురు కలిసి కుడి కాలు పెట్టి ఇంట్లోకి వస్తారు. ఆ సీన్ చూసి రేవతి కంగారు పడుతుంది. మురారి కి ముకుంద దగ్గర అవుతుందేమోనని భయపడుతూ ఉంటుంది.
ముకుంద ఇంట్లోకి రాగానే కృష్ణ అసలు మ్యాటర్ రివీల్ చేస్తుంది. ఏసీపీ సార్ నేను అడిగినందుకు ముకుందని తీసుకురావడానికి వాళ్ళ ఇంటికి వెళ్లినందుకు థాంక్యూ అని కృష్ణ అందరి ముందు థాంక్యూ చెబుతుంది. ఆ మాటకి మురారి ముకుంద వైపు చూస్తూ.. కృష్ణ అడిగిందని మురారి నా దగ్గరకు వచ్చాడా.. నామీద ఇష్టం కొద్ది రాలేదా అని ముకుందా అసలు విషయాన్నీ తెలుసుకుంటుంది. మురారిపై ఇంకాస్త కోపాన్ని పెంచుకుంటుంది ముకుంద.
మురారి తన గదిలోకి రాగానే కృష్ణ అద్దంలోకి చూసుకుంటూ ఏసీపీ సార్ మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు అంటూ కృష్ణ అంటుంది. మీరు ఏం చెప్పి ముకుందని ఇంటికి తీసుకువచ్చారు అని అడుగుతుంది. ముకుందా అంత తేలిగ్గా ఈ ఇంటికి రాదన్న విషయం నాకు తెలుసు. నేను వెళ్ళినా రేవతి అత్తయ్య వెళ్ళినా రాని ముకుంద.. మీరు వెళ్ళాక వచ్చింది అంటే కచ్చితంగా ఏదో మ్యాటర్ ఉంది అని కృష్ణ గుచ్చి గుచ్చి మురారిని అడుగుతుంది. మురారి ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అవ్వాలని అనుకుంటాడు.
ఇక రేపటి ఎపిసోడ్లో మురారిని బాల్కనీలోకి రమ్మని ముకుంద మెసేజ్ చేస్తుంది. మీరు తెలివైన వారు అని అనుకుంటే నేను ఒక టెస్టు పెడతాను అని కృష్ణ అంటుంది. అయితే ఆ టెస్ట్ ఏంటో చెప్పమని మురారి కృష్ణను అడుగుతారు. ఈ దువ్వెనను దాటండి అని కృష్ణ అంటుంది.