Krishna Mukunda Murari: పెద్ద అత్తయ్య నేను నందిని విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి.. మా సీనియర్ డాక్టర్ గౌతమ్ ఇక్కడికి వస్తానన్నారు అని చెప్పి గౌతమ్ ని తనని తీసుకొని వస్తాను అంటుంది. ఇక కృష్ణ బయటకు వెళ్లి గౌతమ్ ను ఇంటికి వస్తుంది. ఇక గౌతమ్ ఇంట్లో రావడం చూసి బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ బద్దలయ్యే మ్యూజిక్ వస్తుంది. దానికి తగ్గట్టుగానే ఇంట్లో మెయిన్ ముగ్గురికి దిమ్మతిరిగే షాక్ తగులుతుంది..

ఇక ఒక్కసారిగా గౌతమ్ ని చూడగానే భవాని లేచి నిలబడుతుంది. ఇక ఈశ్వర్, ప్రసాద్ ఇద్దరు గౌతమ్ ని పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని చూస్తూ ఉంటారు. గౌతమ్ ఇంట్లోకి రాగానే కృష్ణ ఎవరిని పరిచయం లేకుండా తనే ఇంట్లో ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంటూ. వాళ్ల గురించి చెబుతాడు. ఇక మురారి దగ్గరకు వచ్చేసరికి బావగారు అంటూ ఆప్యాయంగా పిలుస్తాడు. కృష్ణమ్మ నా సొంత చెల్లెలు కంటే ఎక్కువ. అలాంటప్పుడు మీరు నాకు బావగారే కదా అని అనడం నే మురారి మనసులో తప్పు చేశానన్న భావన కలుగుతుంది.
ఆ మాటలు వినగానే.. అనవసరంగా కృష్ణని అనుమానించాను ఆరోజు చెయ్యి పట్టుకుని తప్పుగా బిహేవ్ చేశాను అని అనుకుంటాడు. ఇక అప్పుడే రేవతి గురించి కూడా మంచిగా చెప్పి మాట్లాడుతుండగా రేవతి గౌతమ్ ని అల్లుడు అని పిలుస్తుంది. అంటే కృష్ణకి నువ్వు అన్నయ్య కదా అలాంటప్పుడు నువ్వు నాకు వరసకి అల్లుడు అవుతావు కదా అని రేవతి అంటుంది. థాంక్యూ అత్తయ్య అంటూ గౌతమ్ లోలోపల మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. ఆమె పిలిచినప్పుడు సంతోషంతో ఒక్కరి బిక్కిరి అవుతాడు.
మరోవైపు భవాని మిగతా వాళ్ళందరూ కోపంతో రగిలిపోతూ ఉంటారు. రండి భోజనం చేద్దురుగాని అల్లుడుగారు అంటూ రేవతి డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్తుంది. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మెడిసిన్ విషయంలో తప్పంతా నాదే. నందిని కి మెడిసిన్ ఇచ్చింది నేనే ఇలా ఎప్పుడో కొంతమందికి మాత్రమే జరుగుతుంది. వెయ్యి మందిలో ఒకరికి నందినికే రియాక్షన్ కలిగింది. రియాక్షన్ కలగడం వల్ల కూడా నందిని కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే తనకి మెల్లమెల్లగా గతం గుర్తుకు వస్తుంది అంటూ గౌతమ్ మరో బాంబు బ్లాస్ట్ చేస్తాడు. బావగారు అంటూ మురారి పక్కన కూర్చుని భోజనం చేస్తాడు. కృష్ణ విషయంలో మీరు తన చేయి గట్టిగా పట్టుకున్నారని నాతో చెప్పి బాధపడింది అని అంటాడు ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు అల్లుడుగారు భోజనం చేయండి అంటూ రేవతి కొసరి కొసరి వడ్డిస్తుంది.
ఇక అంతలోనే నందిని కిందకు దిగివస్తుంది. ఇక నందిని గౌతమ్ చూసినా గౌతమ్ ని నందిని చూసినా ఇద్దరికీ ఇబ్బంది కలుగుతుందని.. భవాని అక్కడి నుంచి తీసుకు వెళ్ళమని ప్రసాద్ ని పంపిస్తుంది. ప్రసాద్ గౌతమి నందిని గౌతమ్ చూడకుండా గౌతమ్ ని ముఖ్యంగా నందిని చూడకుండా అక్కడ నుంచి పైకి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక భోజనం చేసిన తరువాత గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ అందరికీ సెండ్ ఆఫ ఇస్తాడు. అత్తయ్య మీ చేతి వంట చాలా బాగుంది అని రేవతిని పొగడగాని తప్పకుండా మళ్ళీ ఇంటికి రండి అని రేవతి అంటుంది. మీ భోజనం కోసమైనా మళ్ళీ మళ్ళీ వస్తాను అని గౌతమ్ అంటాడు. ఇక నందిని ట్రీట్మెంట్ చేసే విషయంలో పూర్తి బాధ్యత నాదే అని గౌతమ్ అంటాడు. వద్దు కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు అని భవాని కఠినంగా చెబుతుంది.
ఇక గౌతమ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోగానే భవాని కోపంగా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోబోతుండగా అత్తయ్య నందిని మెడిసిన్ విషయంలో నా తప్పు ఏమీలేదని మీకు అర్థం అయింది అని అనుకుంటారని కృష్ణ అంటుంది. అలాగే ఏసీబీ సార్ కి కూడా ఈ విషయంతో ఓ విషయంపై క్లారిటీ వచ్చింది అని నేను అనుకుంటున్నాను. అని కృష్ణ అంటుంది. ఇక కృష్ణ గదిలోకి వెళ్ళగానే మురారి కృష్ణ కి సారీ చెబుతాడు నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడే అర్థమైంది. కృష్ణ నీ ముందు నిలబడాలన్నా మొహం చూపించాలన్న నాకు మొహం చాటేయాలనిపిస్తుంది అని అంటాడు.
ఇక రేపటి ఎపిసోడ్లో మురారి కృష్ణ కోసం ఎదురు చూస్తూ ఉండగా.. ముకుందా అక్కడికి వస్తుంది మీరిద్దరూ మాట్లాడుకోండి అని కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుండగా కృష్ణ చేయని గట్టిగా పట్టుకుంటాడు..