Krishna Mukunda Murari నిన్నటి ఎపిసోడ్ లో మురారి డైరీ ని కృష్ణ చదవడం, మురారి ఎవరినో ప్రేమించాడు అని కృష్ణకు అర్థం అవుతుంది. నేను మురారి గారిని తొందరపడి ప్రేమించాను అనిఅనుకుంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో కృష్ణ, డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు.కృష్ణ ఎదో ఆలోచిస్తూ ఉండగా, ఏమైంది కృష్ణ అని అడుగుతారు.కృష్ణ వాళ్ళ అమ్మ కృష్ణు ను పైకి వెళ్లినాప్కిన్స్ తీసుకు రమ్మంటుంది. మురారి నువ్వు వద్దులే కృష్ణ నేను వెళ్తాను అంటాడు. నేను వెళ్తాను ఏసీపి సార్ అని పైకి వెళ్తుంది.పైకి వెళ్ళిన కృష్ణ బాధపడుతూ ఉంటుంది. ఆ డైరీలో రాసినవి, గుర్తుకొచ్చి. ఆ డైరీ మళ్ళీ తీసి చదవాలి అని అనుకుంటుంది. చాల సేపు ఆలోచించి, డైరీ ని తీసుకుంటుంది. కానీ చదవడానికి కూడా ఎంతో బాధపడుతూ, చదవాలా, వద్ద అని ఆలోచిస్తూ, దానికి ధైర్యం ఓపెన్ చేస్తుంది.
డైరీ లో మురారి ప్రేమ మాటలు
నా జీవితంలోనికి నువ్వు ప్రవేశించిన తర్వాత నాకు ఈ ప్రపంచం కొంచెం కొత్తగా అనిపిస్తుంది. లడక్ మనిద్దరినీ కలిపిన ఊరు, జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను ఏ ప్రపంచ సుందరి, నన్ను చేసుకుంటానని చెప్పినా నేను చెల్లించను. నాకు వాళ్ళు ఎవరు అవసరం లేదు నువ్వే కావాలి. ఈ మాటలు చదివి కృష్ణ చాలా బాధపడుతూ,ఏడుస్తూ ఉంటుంది. డైరీని బాధతో కింద పడేస్తుంది. మళ్లీ డైరీ తీసుకొని అవే మాటలు చూస్తూ ఉంటుంది. ఇక తర్వాత డైరీలో ఎక్కడ ఏవి కనిపించదు. అంటే సెప్టెంబర్ 16 మా పెళ్లయింది అప్పటి నుంచి డైలీ రాయడం మానేశారు. నీ కృష్ణ బాధపడుతూ ఉంటుంది. బ్యాగ్రౌండ్ లో ఒక సాడ్ సాంగ్ ప్లే అవుతుంది.
మురారి కి భయం ఎక్కువ అవుతుంది.
చాలాసేపు బాధపడి కృష్ణా డైరి ని అక్కడే పెట్టేసి, ఏడుస్తూ వాళ్ళ నాన్న ఫోటో వైపు చూసి, నన్ను బాగా చూసుకుంటున్నా, ఆయన మనసులో ఇంకెవరు ఉన్నారు అని తెలియక నేనే ప్రేమించాను. తొందర పడ్డాను అని అనుకోని ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ, ఏడుస్తూ ఉంటుంది. కృష్ణ మురారి ఫోటో చూసి, బాధపడుతూ ఉంటుంది.కృష్ణ ఏంటి ఇంకా కిందికి రాలేదు ఆ డైలీ కానీ చూసిందా అనుకుంటూ ఉంటాడు. కృష్ణ ఆ డైరీ చూసిందంటే అంతే సంగతులు, ముకుంద గురించి తెలిసిపోతుంది ఏమో అని భయపడుతూ ఉంటాడు. ఇప్పుడేం చేయాలి నేను ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కృష్ణ మెట్లు దిగుతూ, బాధగా కిందకి దిగి వస్తుంది. మురారి వెళ్లేటప్పుడు బానే ఉంది కదా ఇప్పుడు ఏంటి ఇలా ఉంది అని అనుకుంటున్నాడు. డవుట్ లేదు కచ్చితంగా డైరీ చదివింది. అని అనుకుంటాడు. పైకి వెళ్లి డైరీ వుందా లేదా అని చూస్తాడు. డైరీ అక్కడే ఉంటుంది.మురారి డైరీ చూసి, ఎవరి పేజీలో రాసి ఉన్న దాన్ని చూసి చదువుతూ ఉంటాడు. ఇన్నాళ్లు డైరి రాసే అవసరం, అవకాశం రాలేదు. ఈ కాళీ పేజీ ఇలాగే నా జీవితం శూన్యమైపోయింది అనుకున్న, కానీ నా జీవితం లోకి కృష్ణ ఆ శూన్యాన్ని పోగొట్టడానికి వచ్చింది అని, ఆలస్యంగా తెలుసుకున్న, గురువు గారి మీద గౌరవంతో పెళ్లి చేసుకున్న, కృష్ణ లేని జీవితం ఈ కాళీ పేజీలు లాగా, మిగిలిపోతాయి అని భయం వేస్తుంది అని రాసి ఉండటంచదువుకుంటాడు. కృష్ణ అందరూ తింగరి పిల్ల అనుకుంటా రు, అది స్వచ్ఛమైన మనసు అని ఎవరికీ తెలీదు, కృష్ణ ఇంకా చిన్న పిల్ల, అని అనుకుంటాడు… అందుకే కృష్ణ మీద రోజు రోజుకి ఇష్టం పెరిగిపోతుంది… కానీ కృష్ణ మాత్రం డైరీలో చివరి పేజీని చదవదు…
రేపటి ఎపిసోడ్ లో..
కృష్ణ ఏడుస్తూ,జీవితంలో మొట్టమొదటసారి నా మనసులో ప్రేమ పుట్టింది. ఆ ప్రేమకు ఆయుష్షు లేదని, అనుకుంటూ ఉండగా, వర్షంలో తడుస్తోన్న ఆమె దగ్గరకు ఎమైందని అడుగుతూ మురారి వస్తాడు.. ఏంటి కృష్ణ ఇక్కడ వున్నావ్ అంటాడు.. నాదెగ్గర చాల ప్రశ్న లు వున్నాయి సార్, వాటికీ మీరు సమాధానం చెప్పాలి..అని,మీరు పోలీస్ కాదు పెద్ద దొంగ అని కృష్ణ అంటుంది.చూడాలి ఇక ముందు కృష్ణ ఏమి చేయనుందో….
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!