Krishna Mukunda Murari: కృష్ణ ముకుందా మురారి ముగ్గురు రెడీ అయ్యి కిందకు దిగుతారు. సౌభాగ్యవ్రతం చేయడానికి ఇంట్లో ఏర్పాట్లు అన్నీ ఘనంగా జరుగుతాయి. కృష్ణ పంతులుగారు ఇచ్చిన చీరను కట్టుకోకుండా మామూలు చీర కట్టుకొని వస్తుంది. అప్పుడే పంతులుగారు నేను నిన్న అమ్మవారికి కట్టిన చీర ఇచ్చాను కదా.. అది కట్టుకొని రమ్మని చెబుతారు. కానీ ఆ చీర ఏమైందో తెలియదు అని ఇంట్లో వాళ్ళందరూ అంటారు.. అప్పుడే ముకుందా బాధపడుతూ ఆదర్శ్ తిరిగిరావడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేనట్టుంది నా తలరాత ఇంతే అని ముకుందా అన్న మాటలకు అందరూ షాక్ అవుతా అందరూ తన వైపు చూస్తారు.

ఆ చీర ఏమైంది అని అంతా అనుకుంటుండగా నందిని ఆ చీర నాకు దొరికింది అని కిందకు తీసుకొస్తుంది ఈ చీర ఎవరు రూమ్ లో ఉందో తెలుసా మన ముకుందా రూమ్ లోనే ఉంది అని నందిని అంటుంది లేదు నా రూమ్ లో లేదు అని ముకుందా అంటుంది ఇక ఈ పూజ జరగాలని రాసి పెట్టింది అందుకే ఆ అమ్మవారు ఆ చీర ఎక్కడ ఉందో ఈ అమ్మాయి రూపంలో తీసుకువచ్చారు త్వరగా రెడీ అయ్యి రండి పూజ చేద్దాం అని అంటారు మురారి ముకుందా అలా చేస్తుందని కలలో కూడా ఊహించలేదు తనే చీర దాచి పెట్టిందని తెలుసుకున్న మురారి ముకుందను నీచంగా చూస్తారు ఇంట్లో వాళ్ళందరూ కూడా ముకుందని అదేవిధంగా ఛీ కొట్టిన విధంగా చూస్తారు.

Krishna Mukunda Murari: రేపటికి సూపర్ ట్విస్ట్ ఇచ్చిన ముకుంద.! సౌభాగ్యవ్రతంలో అపశృతి..!
మురారి కృష్ణ వారి గదిలోకి వెళ్లి రెడీ అవుతారు. కృష్ణ అమ్మవారి చీరలు చక్కగా కట్టుకుంటుంది. మురారి కూడా పంచలో రెడీ అవుతారు. ఇక గదిలో కృష్ణ చీర మురారి పంచులు మురారి పంచెను కృష్ణ తొక్కడం లాంటి చిలిపి సంఘటనలు జరుగుతాయి.. ఇక ఇద్దరు రెడీ అయి కిందకి వస్తారు. పంతులుగారు వాళ్ళు రావడంతోనే కృష్ణ నీ మురారి కి బొట్టు పెట్టమని మురారిని కృష్ణకు బొట్టు పెట్టమని చెబుతారు. అలా ఒకరికొకరు బొట్టు పెట్టుకుంటుండగా ముకుందా వారిద్దరిని చూసి కోపంతో రగిలిపోతుంది .

ఇక రేపటి ఎపిసోడ్లో ముకుందా దగ్గరికి మురారి వెళ్లి నా ప్రేమ నీతో స్వప్నం. ఆదర్శ్ తో నీ పెళ్లి నేటి జీవితం. ఇక నన్ను మర్చిపో అని మురారి ముకుంద కి స్ట్రైట్ గా వార్నింగ్ ఇస్తాడు. నువ్వు నన్ను ప్రేమించావు అన్న సంగతి కృష్ణకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అని కూడా అంటాడు. మురారి దగ్గరికి కృష్ణ వచ్చి ముకుందా ఎవరినో ప్రేమిస్తుందని పెళ్లికి ముందే ఎవరినో ముకుందా ప్రేమించింది. అందుకే తన జీవితంలో ఆదర్శ్ లేకపోయినా తను ప్రశాంతంగా ఉండలేక పోతుంది. నాకు తన ప్రేమ విషయం తెలిసిపోయింది అని కృష్ణ అంటున్న మాటలకు మురారి షాక్ అవుతాడు. ఈ కథ ఎటువైపు మలుపు తిప్పుతారో చూడాలి.