Krishna Mukunda Murari: అయినా నీ మంచి కోసమే కదా కృష్ణ చెప్పింది అని భవాని అంటుంది. అవును అత్తయ్య కృష్ణకి వాళ్ళ అత్తయ్యకి మంచిగా చెబితే అస్సలు అర్థం కాదు తిరిగి నన్నే అంటారు అని ముకుందా అంటుంది. మా అత్తయ్య మీ అత్తయ్య ఏంటి.. పెద్ద అత్తయ్య, రేవతి అత్తయ్య, చిన్న అత్తయ్య అని కదా పిలుస్తున్నాము అని కృష్ణ చెబుతుంది. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఇవన్నీ ఏంటి అని అంటుంది. ముకుంద ను కృష్ణ హద్దుల్లో ఉండమని హెచ్చరిస్తుంది.

ఆ మాటలకు కృష్ణ బాధపడుతుంది అసలు నేను చదువుకోను అనుకుంటా ఏడ్చుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది . ఏమైంది కృష్ణ అని మురారి అంతగా పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా కృష్ణ తన గదిలోకి వెళ్ళిపోతుంది. కృష్ణ ఏడుస్తూ ఉండడం చూసి అసలు ఏం జరిగింది అని మురారి అడుగుతాడు. అసలు ఈ గొడవ అంతా జరగడానికి కారణం ముకుందా అని జరిగిన గొడవ అంతా కృష్ణ మురారి కి చెబుతుంది.

మురారి ముకుందని తన గదికి రమ్మని పిలుస్తాడు. తనతో ఏమైనా ప్రేమగా మాట్లాడుతాడు. ప్రేమగా కబుర్లు చెబుతాడని ముకుందా ఆశగా మురారి దగ్గరకు వెళ్తుంది. కానీ మురారి ఏంటి నన్ను రమ్మని పిలిచావని ముకుందా అడగగానే .. కృష్ణ నా భార్య అని తన ప్రతి మాటలోను కృష్ణ తన భార్యని పలకడం గమనించిన ముకుందా తను కాదు నాన్న కావాల్సిన అంత బంగారం చేయించాడు. తన దగ్గర సరస్వతి దేవి ఉంది. గౌరవప్రదమైన డాక్టర్ వృత్తిలో ఉంది.

ఇంకోసారి తన జోలికి వస్తే ఊరుకోను అని మురారి స్ట్రాంగ్ గా ముకుందటి వార్నింగ్ ఇస్తాడు. ఇక రేపటి ఎపిసోడ్లో కృష్ణ అన్నం తినకుండా అలిగి నిద్రపోతుంది. మురారి తన దగ్గరకు వెళ్లి నేను అన్ని చూసుకుంటాను. నామీద భారం వదిలే కృష్ణ అని మురారి కృష్ణ కి మాటే ఇస్తాడు. మురారి కృష్ణ దగ్గరవడం చూసి ముకుంద ఫీల్ అవుతుంది.