Krishna Mukunda Murari: కృష్ణ నేను కూడా మీతో పాటే ఈ కారులో వస్తాను అని ముకుందా అడుగుతుంది. ఏసీబీ సార్ తో మాట్లాడాలి అని అనుకుంటే మధ్యలో ముకుందా వచ్చింది అని కృష్ణ అనుకుంటుంది. మురారి కూడా అదే ఆలోచనలో ఫీలవుతూ ఉంటాడు.. ఇక కృష్ణ ఆ కారులో తనతో పాటు ముకుందా రావడానికి ఒప్పుకుంటుంది. మురారి డ్రైవర్ లాగా కార్ డోర్ ఓపెన్ చేసి కృష్ణని కూర్చొమని చెబుతాడు.. మురారి కృష్ణ ఇద్దరు క్లోజ్ గా దగ్గర అవడం చూసినా ముకుందా లో లోపల రగిలిపోతూ ఉంటుంది..

మురారి కృష్ణా వెళుతున్న కారులోనే ముకుంద కూడా ఉంటుంది. ఏసీ పెంచనా అని అంటే నాకు ఇక్కడ మండిపోతుంది అని ముకుందా అంటుంది. ఏసీబీ సార్ కారు ఆపండి అని.. ముకుందని కారులో నుంచి దిగమని చెబుతుంది కృష్ణ. ఈ మాట మీ ఆయన్ని చెప్పమను అని అనగానే కృష్ణ మురారి వైపు చూస్తుంది.. మురారి కూడా సైలెంట్ గా ఉండేసరికి ఇక ముకుందా కారులో నుంచి దిగిపోయి ఇంటికి వెళుతుంది..

అత్తయ్య ఆ కృష్ణుని త్వరగా ఇంట్లో నుంచి పంపించేయండి అని ముకుంద ఇంట్లోకి రావడంతోనే అరుస్తుంది.. అసలు ఏమైంది ముకుందా ఎందుకు అని భవాని అడగగా మురారి వాళ్లతో పాటు నేను కూడా షాపింగ్ చేయాలని వాళ్ళ కారులో వెళ్ళను.. కానీ ఆ కృష్ణ నన్ను దారి మధ్యలోనే ఆపేసి దిగిపోమని చెప్పింది అంతేకాదు మురారిని తను ఎక్కడికో తీసుకు వెళుతుంది ఏదో ప్లాన్ చేసింది అత్తయ్య అంటూ ముకుందా లేనిపోనివన్నీ కల్పించి కృష్ణపై చెబుతుంది. కృష్ణ ఏదో గట్టిగా ప్లాన్ చేసింది అత్తయ్య తనని హాస్పిటల్కి తీసుకువెళ్లే అక్కడ ఏదో చెప్పాలని అనుకుంటుంది. అది ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అనడంతోనే అందరూ షాక్ అవుతుంది.
కొంచెం దూరం వెళ్లిన తర్వాత కార్ ట్రబుల్ ఇచ్చింది అని చెప్పి.. మురారి ఆకార్ ను పక్కన ఆపేస్తాడు.. ఇది మన గెస్ట్ హౌస్ కృష్ణ పద లోపలికి వెళ్దామని మురారి ఆ గెస్ట్ హౌస్ లోపలికి తీసుకువెళ్తాడు కృష్ణని..