Krishna Mukunda Murari: నిన్నటి ఎపిసోడ్ లో కృష్ణ, మురారి మనసులో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆక్రమంలోనే మురారి ఫ్రెండ్ గీతక ఫ్రెండ్షిప్ చేయాలని నిర్ణయించుకుంటుంది. ముకుందమురారిని ప్రేమిస్తున్న విషయం రేవతికి అర్థం అవుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో, రేవతి,ముకుంద గురించి ఆలోచిస్తూ ఉంటుంది.ముకుంద ప్రేమ కాస్త ఉన్మాదంలో తిరిగేలా ఉంది. ఎలాగైనా ముకుంద ప్రేమకి అడ్డుకట్ట వేయాలి. అక్క తిరిగి వచ్చేలోపే, దీనికి ఒక పరిష్కారం వెతకాలి అని అనుకుంటుంది. ఇక అక్కకి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు. అని ఆలోచిస్తూ ఉంటుంది.

Krishna Mukunda Murari: కృష్ణ మురారిలది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని రేవతితో చెప్పేసిన ముకుంద..
మురారి కంగారు..
కృష్ణ మురారి ఇద్దరు కారులో వస్తూ ఉంటారు. మురారి కి ఫోన్ వస్తుంది. ఫోన్లో మురారి కోపంగా, రేపొద్దున కోర్టులో సబ్మిట్ చేయాల్సిన పల్సర్ కి ఇప్పుడు బెల్ ఏంటి, అలాంటివి ఏమీ కుదరవు అని అరిచి పెట్టేస్తాడు. కృష్ణ వైపు కూడా కోపంగా చూస్తుంటాడు. కృష్ణ ఏంటి అలా చూస్తున్నారు అని అడుగుతుంది. నువ్వేంటి అలా చూస్తున్నావు అని అంటాడు మురారి. నేను చెప్పా అని అంటుంది కృష్ణ. చెప్పమాకు అని అంటాడు మురారి. మీరు బతినాడు ఏసిపి సార్ అంటుంది కృష్ణ. నువ్వు చెప్పకపోయినా పర్లేదులే అని అంటాడు. కారు లెఫ్ట్ కి తిప్పండి. నేను చెప్పను ఎందుకు తిప్పాలో చెప్పు. ముందు మీరు తిప్పండి అన్ని మీకు చెప్పాలా ఏంటి అంటుంది కృష్ణ. సరే అని కార్ ని లెఫ్ట్ తిప్పుతాడు మురారి.

Nuvvu Nenu Prema: విక్కీ ప్రేమని తెలుసుకున్న పద్మావతి.. మనసులో మాట బయట పెట్టనుందా…
నిజం చెప్పిన ముకుంద
పుస్తకంలో ఐ లవ్ యు మురారి అని రాసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రేవతి వస్తుంది. ఏంటి ముకుందా అని రాస్తున్నావ్ అని అడుగుతుంది. ఏమీ లేదు అత్తయ్య ఇది నా జ్ఞాపకం అంటుంది. చిన్న అత్తయ్య అని పిలవమన్నాను కదా అంటుంది రేవతి. ఇది నా, మరుపురాని జ్ఞాపకాలు అని అంటుంది ముకుంద. నీ జ్ఞాపకాలతో ఏంటి పరువు పోయేలా ఉంది ముకుందా? ఆ పుస్తకం ఇవ్వు అని అంటుంది రేవతి. ముకుంద ఇచ్చే లోకే రేవతి లాగేసుకుంటుంది. ఆ పుస్తకంలో ఐ లవ్ యు మురారి అని రాసినది చూసి రేవతి షాక్ అవుతుంది. ఏంటి ముకుందా ఇది అని అడుగుతుంది. మురారి మీద నా ప్రేమ అత్తయ్య చిన్న అత్తయ్య అంటుంది. ఇది ప్రేమ కాదు ఏంటి నువ్వేస్తున్న సమాధి. నీలో, ఈ ప్రేమని తుడిచేసే, నా కొడుకు కోడల్ని చిలకా గోరింక లాగా ఉండనివ్వి, నా కోడలు అమాయకురాలు దాని జీవితంతో ఆడుకోకు దానికి ఆపరాల్లో చిచ్చు పెట్టకు, అని బతిమాలుతుంది రేవతి. మీకు అసలు వాళ్ల గురించి తెలియదు అత్తయ్య అని అంటుంది. నాకన్నా ఎవరికీ తెలుస్తుంది మా మురారి గురించి, నాకు తెలుసు అంటుంది ముకుంద. నాకు తెలియంది నీకు తెలిసింది ఏమిటో చెప్పు అంటుంది రేవతి. ముకుంద ముందు చెప్పాలా వద్దా అని ఆలోచించి తర్వాత నిజం చెప్పేస్తుంది.

షాక్ లో రేవతి..
మీ అబ్బాయి మురారి కృష్ణ లది నిజం పెళ్లి కాదు, వాళ్ళిద్దరికీ ఈ పెళ్లి ఇష్టం లేదు. వాళ్లు ఒక అగ్రిమెంట్ మీద పెళ్లి చేసుకున్నారు. రేవతి షాక్ అవుతుంది. అవునా అత్తయ్య వాళ్ళు ఒకరికి ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు, కొన్ని పరిస్థితుల వల్ల అగ్రిమెంట్ మీద పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చారు.వాళ్లు బయటికి వచ్చినప్పుడు మాత్రమే భార్యాభర్తల నటిస్తున్నారు. వలసలు కలిసి కాపురం చేయట్లేదు. అందరి ముందు అలా నటిస్తున్నారు అంతే.రేవతి నేను నమ్మను నువ్వు చెప్పేది అబద్ధం, వాళ్లు నటిస్తున్నారా అదంతా నిజం కాదా అని అంటుంది. వాళ్ళు అసలు కాపరమే చేయట్లేద, నిజం చెప్పు ముకుంద నీకెలా తెలుసు అని అడుగుతుంది రేవతి. నాకు మీ అబ్బాయి మురారి ఏ చెప్పాడు అని చెప్తుంది ముకుంద. గతంలో మురారి ముకుంద కి కృష్ణది అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్తాడు. ఆ విషయాన్ని రేవతికి చెప్తుంది ముకుంద.అది విని రేవతికి, చాలా బాధేస్తుంది. ఏడుస్తూ ముకుందా రూమ్ నుంచి బయటకు వస్తుంది. గతంలో కృష్ణ మురారిలు ఒకరికొకరు, సర్ది చెప్పుకునేటటువంటి, విషయాలన్నీ రేవతీకి గుర్తొస్తూ ఉంటాయి. అవన్నీ తలుచుకుంటూ రేవతి బాధపడుతూ ఉంటుంది.

కృష్ణ,మురారి ల సర్ప్రైజ్
కృష్ణ మురారి ఇద్దరూ ఒక ప్లేస్ కి వెళ్తారు. అక్కడ చిన్న పిల్లలు చాలామంది ఉంటారు. మాతృ మందిర్ అనాధ శరణాలయం. కృష్ణుని చూసి పిల్లలంతా, పలకరిస్తూ ఉంటారు కృష్ణ కూడా వాళ్ళని పలకరిస్తూ ఉంటుంది. అదే టైం కి మురారి లోపలికి వస్తాడు. మురారిని చూసి పిల్లలందరూ వెళ్లి అన్నయ్య ఆయన దగ్గరికి వెళతారు. అది చూసి నువ్వు కృష్ణ షాక్ అవుతుంది. మీ మూడు మారుద్దాం అని నేను మీకు చెప్పకుండా ఇక్కడికి తీసుకు వస్తే మీకు ఇక్కడ అంతా తెలుసా, అనగానే అందులో ఒక పిల్లాడు అన్న ఇదే ఈ ఆర్గనైజేషన్ అని చెప్తాడు. నిజమా ఏ సి పి సార్, ఈ ఆర్గనైజేషన్ మీరు నడుపుతున్నారా అంటుంది కృష్ణ. ఇది ఆర్గనైజేషన్ కాదు కృష్ణ మాతృ మందిర్ అమ్మ లాంటిది, మనం దీన్ని దేవాలయంలో చూడాలి అని అంటాడు మురారి. మీరు చాలా గ్రేట్ ఏసిపి సార్ అని దండం పెడుతుంది. నీకెలా తెలుసు కృష్ణ ఇక్కడ అని అంటాడు మురారి. నేను వారం వారం ఒకసారి ఇక్కడికి వచ్చి వీళ్ళ హెల్త్ చెక్ చేస్తూ ఉంటాను. చూశారా ఏసిపి సర్ మనం ఒకరికొకరు ఇక్కడ, తెలియకుండానే సర్వీస్ చేస్తున్నాము అని అంటుంది కృష్ణ. మురారి మనసులో, మన అభిరుచులు కలిసిన అంటే ఇది ప్రేమే అని అనొచ్చు కదా కృష్ణ అని అనుకుంటాడు. కృష్ణ కూడా మనసులో, అభిరుచులు కలిస్తే ఏం లాభం మనుషులు మనుషులు కలవాలి కానీ, నేనే మీ భార్యను కానీ మీ మనసులో నాకు ప్లేస్ ఉంటే, ఎంత సంతోషించేదాన్ని ఏ సీపీ సార్ అని అనుకుంటుంది.ఇద్దరు అక్కడ సంతోషంగా గడుపుతూ ఉంటారు.

రేవతి ప్రార్థన..
ఇక రేవతి జరిగిన అంతా తలుచుకొని బాధపడుతూ దేవుని ముందుకు వచ్చి నిలబడుతుంది. దేవునితో స్వామి ఇప్పుడు నేనేం చేయాలి, ఒక అత్తగా నేను ఓడిపోయాను ఒక అమ్మగా కూడా ఓడిపోయాను, ఇప్పుడు నేను ఎలా స్పందించాలి, ముకుందతో మురారి నిజం చెప్పాడు అంటే, ఎట్లాగైనా కృష్ణతో కలవాలనుకుంటున్నాడా, నా రక్తం పంచుకు పుట్టిన కొడుకు కృష్ణ కి అన్యాయం చేస్తాడా, వాళ్లకి సమాధానం చెప్పాలి, వాళ్ళిద్దరిని ఎలా కలపాలి, అక్క తిరిగి వచ్చేలోపే ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపు. వాళ్ళిద్దర్నీ కలిపేలా చేయి అని దండం పెట్టుకుంటూ ఉంటుంది.అప్పుడే అక్కడికి ప్రసాదు వచ్చి ఏంటి వదిన ఈ టైంలో దండం పెట్టుకుంటున్నావ్ అని అడుగుతాడు. పొద్దున్నుంచి పెట్టుకోవడానికి సమయం కుదరలేదు ప్రసాద్ అని అంటుంది రేవతి. ఇప్పుడే పెద్ద వదిన ఫోన్ చేసింది అని అంటాడు. అవునా ఏమని చెప్పింది వస్తుంది అక్క అని కంగారు పడుతుంది రేవతి. ఏంటది నా మీరు అంత కంగారు పడుతున్నారు అని అంటాడు ప్రసాద్. ఏమీ లేదు అక్క గది బాగు చేయించలేదు అందుకని అంటుంది రేవతి. ఆ వదిన రావడం లేదు నీకు తోడుగా సుమని ఉండమని చెప్పింది అని అంటాడు ప్రసాద్.

కృష్ణ మురారి ఇద్దరూ ఆర్గనైజేషన్ లో సరదాగా గడుపుతూ ఆడుతూ ఉంటారు. మురారి కళ్ళకు గంతలు కట్టి పిల్లలతో ఆడుతూ ఉంటాడు. కృష్ణ మనసులో, అనాధ పిల్లల్ని చేర తీసి, వాళ్లని అనాధల్లా కాకుండా మాతృ మందిర్ అని పేరు పెట్టి, అమ్మలా ఆదరిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే, ఇంత మంచి వ్యక్తికి భార్యకి స్థానంలో, ఉండలేని దౌర్భాగ్య పరిస్థితిని తలుచుకొని, మీ మనసులో, నేనున్నానని తెలిస్తే గుడిలో ఉన్నట్టుగానే భావించేదాన్ని, అంత అదృష్టం నాకు లేదు అని బాధపడుతూ ఉంటుంది..
రేపటి ఎపిసోడ్ లో, రేవతి డైనింగ్ టేబుల్ దగ్గర చాలా కోపంగా ఉంటుంది. అది చూసి కృష్ణ ఇక్కడ ఎవరో ఎందుకో కోపంగా ఉన్నారు అని అంటుంది. దాని కారణం నువ్వే అంటుంది రేవతి. అందరూ షాక్ అవుతారు. ముకుందా అమ్మో ఇప్పుడు అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి చెప్పేస్తుందా అడిగేస్తుందా అనుకుంటుంది. రేవతి కృష్ణ ని చూసి, మీరిద్దరూ కాపురం చేయట్లేదు, నాకు ఇప్పుడు, మనవడు మనవరాలు కావాల్సిందే అని చెప్తుంది… చూడాలి రేవతి కృష్ణ మురారి అని కలపడానికి, ఏం చేస్తుందో…