Krishna Mukunda Murari: స్టార్ మా ఛానల్ లో అత్యధిక TRP రేటింగ్స్ ని సొంతం చేసుకుంటున్న టాప్ 3 డైలీ సీరియల్స్ లో ఒకటి కృష్ణ ముకుంద మురారి. ఈ సీరియల్ ఇప్పటి వరకు 175 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని 176 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ లో ఏమి జరగబోతుందో ఒకసారి చూద్దాము.

అనాధాశ్రమం లో కాసేపు పిల్లలతో గడిపిన కృష్ణ – మురారి:
మురారి కృష్ణని తాను నడుపుతున్న అనాధాశ్రమం కి తీసుకొచ్చి, అక్కడి పిల్లలతో కాసేపు సరదాగా ఆడుకోవడాన్ని చూసి కృష్ణ ఇలాంటి గొప్పోడి మనసులో స్థానం సంపాదించుకోలేక పొయ్యినందుకు నేను ఎంతో దురదృష్టవంతురాలిని, ఆయన మనసు లో వేరే అమ్మాయి ఉంది. ఆ స్థానం లో నేను ఉండి ఉంటే గుడిలో ఉన్నట్టుగానే ఉండేది అని అనుకుంటుంది కృష్ణ. మరో పక్క మురారి కూడా నువ్వు ఇప్పటికే నన్ను ప్రేమిస్తున్నావు, నీకే ఆ విషయం అర్థం కావడం లేదని మనసులో అనుకుంటూ ఉంటాడు. అలా కాసేపు అనాధ పిల్లలతో కాలక్షేపం చేసిన తర్వాత అక్కడి నుండి బయలుదేరుతారు కృష్ణ మరియు మురారి.

మనసు విప్పి మాట్లాడుకున్న కృష్ణ – మురారి :
కారు లో వెళ్తున్నప్పుడు మురారి కృష్ణ ని అడుగుతూ నీకు అక్కడ అనాధ పిల్లలకు సహాయం చెయ్యాలని ఎందుకు అనిపించింది అని అంటాడు. అప్పుడు కృష్ణ నాకు కూడా తల్లితండ్రులు లేరు కాబట్టి, వాళ్లకి నాకు పెద్దగా తేడా లేదు ACP సార్, వాళ్ళను మీరు అనాధాశ్రమం లో పెట్టి పోషిస్తున్నారు, నన్ను మీరు మీ ఇంట్లో పెట్టుకొని పోషిస్తున్నారు, నేను కూడా అనాదనే కదా ACP సార్ అని అంటుంది కృష్ణ. అప్పుడు మురారి అలా నాకు కృష్ణ ఎదో లా ఉంది అనగా, కృష్ణ మాట్లాడుతూ ఈరోజు అనాధ పిల్లలతో సమయం గడిపినందుకు చాలా సంతోషం గా ఉంది ACP సార్, కానీ ఆ పిల్లలకు ఆ స్థలం సరిపోదు, మరింత విశాలమైన స్థలం కావాలి అని అంటుంది కృష్ణ. అప్పుడు మురారి, నాకు అది తెలుసు కృష్ణ, అందుకే ఒక మంచి విశాలమైన స్థలం లో అనాధాశ్రమం కట్టిస్తున్నాను. త్వరలోనే వీళ్లందరినీ అక్కడకి తీసుకెళ్తాను, ఇప్పుడు మనం వెళ్లే దారిలో ఆ స్థలం వస్తుంది, పనులు ఎంత వరకు అయ్యాయో చూసి వెళ్దాం అని అంటాడు మురారి.

Nuvvu Nenu Prema: విక్కీ ప్రేమని తెలుసుకున్న పద్మావతి.. మనసులో మాట బయట పెట్టనుందా…
సంవత్సరం లోపు బిడ్డని చేతిలో పెట్టాలి అంటూ కృష్ణ – మురారి ని డిమాండ్ చేసిన భవాని:
కృష్ణ కి ఇష్టమని మురారి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఐస్ క్రీం బండి దగ్గర ఆరెంజ్ ఐస్ ని కొనిస్తాడు. అప్పుడు కృష్ణ ఆ ఆరెంజ్ ఐస్ ని ఆరు ప్లాస్టిక్ గ్లాసులలో నింపి ఇది కరిగిపోయిన తర్వాత తాగితే ఆ టేస్ట్ వేరే లెవెల్ లో ఉంటుంది అని చెప్తుంది. అలా కరిగిపోయిన ఆరెంజ్ ఐస్ క్రీం గ్లాసులతో ఇంటికి వచ్చి, డల్ గా ఉన్న తన అత్తయ్య భవాని కి త్రాగమని ఇస్తుంది. భవాని వీళ్ళిద్దరిది నిజమైన పెళ్లి కాదు, అగ్రిమెంట్ పెళ్లి అనే నిజాన్ని తెలుసుకొని బాధపడుతూ ఉంటుంది.

డిన్నర్ కి కూర్చున్నప్పుడు భవాని కృష్ణ మరియు మురారి ని నిలదీస్తుంది. మీరిద్దరూ కాపురం చెయ్యడం లేదు, ఎప్పుడూ ఎదో ఒకటి చెప్తున్నారు కానీ, మీరు కలిసి సంసారం చేస్తున్నట్టు ఒక్కసారి కూడా నాకు అనిపించలేదు. ఏడాది తిరిగే లోపు నా చేతిలో ఒక పాప కానీ బాబు కానీ ఉండాలి, నేను రేపే గైనకాలజిస్ట్ ని పిలిపిస్తాను. డాక్టర్ ఇచ్చే మందులను సరిగ్గా వాడు అని చాలా సీరియస్ గా కృష్ణ తో చెప్తుంది భవాని. మరో పక్క ముకుంద ఇదేంటి కథ మొత్తం అడ్డం తిరిగింది అని మనసులో భయపడుతూ ఉంటుంది. తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.