Krishna Mukunda Murari: మురారి ముకుందని తన గదికి రమ్మని పిలుస్తాడు. తనతో ఏమైనా ప్రేమగా మాట్లాడుతాడు. ప్రేమగా కబుర్లు చెబుతాడని ముకుందా ఆశగా మురారి దగ్గరకు వెళ్తుంది. కానీ మురారి ఏంటి నన్ను రమ్మని పిలిచావని ముకుందా అడగగానే .. కృష్ణ నా భార్య అని తన ప్రతి మాటలోను కృష్ణ తన భార్యని పలకడం గమనించిన ముకుందా తను కాదు నాన్న కావాల్సిన అంత బంగారం చేయించాడు. తన దగ్గర సరస్వతి దేవి ఉంది. గౌరవప్రదమైన డాక్టర్ వృత్తిలో ఉంది. ఇంకోసారి తన జోలికి వస్తే ఊరుకోను అని మురారి స్ట్రాంగ్ గా ముకుందటి వార్నింగ్ ఇస్తాడు.

కృష్ణ అన్నం తినకుండా అలిగి నిద్రపోతుంది. మురారి తన దగ్గరకు వెళ్లి నేను అన్ని చూసుకుంటాను. నామీద భారం వదిలే కృష్ణ అని మురారి కృష్ణ కి మాటే ఇస్తాడు. గబ గబా కిందకు వెళ్లి కృష్ణ కోసం టిఫిన్ ప్లేట్ లో పెట్టుకొని తన గదుకు తీసుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే ముకుందా మెట్లు మీద ఎదురొస్తుంది.. ఏంటి మురారి నీ భార్యకు టిఫిన్ తీసుకెళ్తున్నావా? ఏ తను కిందకు రాలేకపోతుందా ఇప్పటినుంచే తనకు సేవలు చేస్తున్నావా అని మురారిని ముకుంద ప్రశ్నిస్తుంది..

అసలు తను నన్ను టిఫిన్ తీసుకురమ్మని కూడా అడగలేదు. నేనే తీసుకు వెళ్తున్నాను అని మురారి అంటాడు. తను అడగకుండానే చేస్తున్నావా అని ముకుందా పుల్లవిరుపుగా మాట్లాడుతుంది. ఏ ముకుందా నువ్వు చూడలేకపోతున్నావా అని మురారి అడుగుతున్నాడు. అవును నా ముందే నువ్వు కృష్ణని ఇంతలాగా ప్రేమించడం సేవలు చేయడం చూసి నేను తట్టుకోలేక పోతున్నాను అని ముకుందా అంటుంది. నాకు అన్యాయం చేసి నువ్వు సంతోషంగా ఉండడం ఎక్కడి న్యాయం అని ముకుందా మురారిని ప్రశ్నిస్తుంది.
నేను నిన్ను ఆదర్శ్ ని పెళ్లి చేసుకో మరణం అందుకు నిన్ను ఒప్పించడం ఇక జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని నీకు మాటే ఇవ్వడం మాట తప్పే కృష్ణను పెళ్లి చేసుకొని రావడం ఇవన్నీ తప్పు అని అంటున్నావు కదా నేను నిన్ను ఒక్క ప్రశ్న అడగనా ముకుందా నేను పెళ్లి చేసుకోమని చెబితే నువ్వు ఆదర్శ్ ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు పెళ్లి చేసుకోకుండా ఉండిపోవచ్చు కదా అని మురారి అడుగుతాడు

ఆ ప్రశ్నకు ముకుందా దగ్గర సమాధానం ఉండదు. సరిగ్గా అదే సమయానికి రేవతి అక్కడికి వస్తుంది ఏం మాట్లాడుకుంటున్నారు. మీరు ఇద్దరు అని రేవతి మురారిని అడుగుతుంది. అదేం లేదమ్మా కృష్ణకి కాస్త నీరసంగా ఉంది టిఫిన్ తీసుకెళ్తున్నాను అని చెబుతాడు. మురారి ఆ టిఫిన్ నేనే పెట్టించాను అత్తయ్య అని ముకుందా కవర్ చేస్తుంది.

ఇక రేపటి ఎపిసోడ్ లో ఇంట్రెస్టింగ్ చూస్తుంటుంది నందిని టాబ్లెట్స్ వేసుకోకపోవడంతో ఇంట్లో అందరూ కలిసి బలవంతంగా టాబ్లెట్స్ వేస్తారు నందిని పెద్దపెద్దగా కృష్ణ మురారి రండి అంటూ అరుస్తుంది ఆ మాటలకు మురారి కృష్ణ కి ఎందుకు వస్తారు అత్తయ్య ఈ టాబ్లెట్ వేయకూడదు తనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని కృష్ణ చెబుతుంది నందిని కూడా నాకు ఈ టాబ్లెట్ వేసుకుంటే తల పగిలిపోతున్నట్టు త్వరలో నరాలు చిట్లిపోతున్నట్లు ఉంటాయి అని చెబుతుంది ఈ టాబ్లెట్ వేయడం వల్ల నందిని కి మీరందరూ స్లో పాయిజన్ ఇస్తున్నట్లే నాకు ఒక్క అవకాశం ఇవ్వండి పది రోజుల్లో తనని నేను మామూలు మనిషిని చేస్తాను అని కృష్ణ అంటుంది..