Krishna Mukunda Murari June 7 2023: కృష్ణ ముకుంద మురారి డైలీ సీరియల్ స్టార్ మా లో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ ని దక్కించుకుంటున్న టాప్ 3 సీరియల్స్ లో ఒకటి అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సీరియల్ ఇప్పుడు 177 వ ఎపిసోడ్ లోకి అడుగుపెడుతుంది. ముకుంద కృష్ణ మరియు మురారి మధ్య జరిగిన పెళ్లి కేవలం అగ్రిమెంట్ మీదనే అని కృష్ణ తల్లి భవాని చెప్తుంది.

అగ్రిమెంట్ పూర్తి అవ్వగానే మురారి ఇంటిని వదిలి వెళ్ళిపోవాలి అనే నిజాన్ని మొత్తం భవాని కి చెప్పగా ఆమె ఎంతో బాధపడుతుంది. మరుసటి రోజు డిన్నర్ చేస్తున్న సమయం లో భవాని కృష్ణ , మురారి ని మీరిద్దరూ అసలు కాపురం చెయ్యడం లేదని నిలదీస్తుంది. దానికి కృష్ణ మరియు మురారి చాలా కంగారు పడిపోతుంటారు. ఆమె మనసులో నేనుంటే ఈపాటికి కాపురం చేస్తూ ఉండేవాళ్ళం, ఒక బిడ్డకి కూడా జన్మని ఇచ్చేవాళ్ళం అని మనసులో అనుకుంటాడు మురారి.

మరో పక్క కృష్ణ కూడా ఇలాగే మనసులో అనుకుంటూ ఉండగా, మురారి మాకు కొంచెం సమయం కావాలమ్మా అని అంటాడు, కృష్ణ కూడా భవాని తో అదే అంటుంది. సమయమా? అదేమీ లేదు, సంవత్సరం తిరిగే లోపు నా చేతిలో పాపని కానీ బాబు ని కానీ పెట్టాలి, లేదంటే ఊరుకునే సమస్యే లేదు, రేపే గైనకాలజిస్ట్ ని పిలిపించి నీకు కావాల్సిన మందులు ఇప్పిస్తాను అంటూ కృష్ణతో చెప్తుంది భవాని. ఇప్పుడు ఎలా చెయ్యాలి అని కృష్ణ మరియు మురారి కంగారు పడుతూ ఉంటారు.

వీళ్లిద్దరు ఎక్కడ కలిసిపోతారో అని ముకుంద కూడా కంగారు పడిపోతూ ఉంటుంది. వీళ్ళని విడదీయాలని చూస్తే ఇంకా కలిసి పోతున్నారు, ఇలా అయితే నేను మురారి ని ఎప్పటికి పెళ్లి చేసుకోవాలి?, వీళ్ళిద్దరినీ కలవకుండా చూస్తోసుకోవాలి అని బలంగా అనుకుంటుంది ముకుంద, మరో పక్క కృష్ణ మరియు మురారి తమ మనసులోని మాటలను ఒకరికి ఒకరు చెప్పుకోవడానికి సంకోచిస్తూ ఉంటారు. వీళ్లిద్దరు తమ మనసులోని మాటలను చెప్పుకుంటారా? , కలిసి కాపురం చేస్తారా అనేది తదుపరి ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకోవాల్సిందే.