Krishna Mukunda Murari: కృష్ణ ఏడుస్తూ తన రూమ్ లోకి వెళ్లి తన బట్టలు సర్దుకుంటూ ఉంటుంది.. కృష్ణ ఎక్కడికి కృష్ణా బట్టలు సర్దుకుంటున్నావ్ అని మురారి అడుగుతాడు. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. మా నాన్నల ఆశయం నెరవేర్చుతాను. నా జీవితాన్ని కూడా నెరవేర్చుకుంటాను. హౌస్ సర్జన్ చేస్తాను అని కృష్ణ అంటుంది.. ఆ మాటలు విన్న మురారి నాకోసం కూడా ఇంట్లో ఉండగా కృష్ణ అని అడుగుతాడు.. కృష్ణ అక్కడ నుంచి వెళ్ళిపోతుండగా గట్టిగా తనని హత్తుకుంటాడు..

నా కోసమైనా ఇంట్లో ఉండు కృష్ణ అని మురారి కృష్ణను అడగగానే సరే అని ఒప్పుకుంటుంది. నేను నీకు మాటిస్తున్నాను నిన్ను చదివించే పూర్తి బాధ్యత నాది అని మురారి మాట ఇస్తాడు.. కానీ నా చదువు అయిపోయిన తర్వాత నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని కృష్ణ అంటుంది.. అది నీ ఇష్టం అని మురారి అంటాడు.. మురారి బయటకు వచ్చి వాళ్ళ అమ్మను ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తూ ఉండడు.. కృష్ణ విషయంలో ఎప్పుడూ సపోర్ట్ గా నిలిచి అమ్మ ఈరోజు ఎందుకు కాదండి అని ఆలోచనలో పడతాడు..

ఇంట్లో జరిగే ఒక విషయం నాకు నచ్చలేదు మురారి.. డిస్ప్లేనీ గురించి ఎంతో గొప్పగా చెప్పుకునే మీరు.. ఒక ఆడపిల్ల చదువుకోవడానికి ఒప్పుకోను అని అనడం నాకు ఏమాత్రం నచ్చలేదు.. ఈ విషయాన్ని ఖచ్చితంగా నేను వ్యతిరేకిస్తాను అని ముకుందా అంటుంది.. కృష్ణ చదువుకోవాలి అందుకోసం నేను ఎవరినైనా ఎదిరిస్తాను… తనకి సపోర్ట్ గా అండగా నిలుస్తాను అని ముకుంద మురారితో చెబుతుంది.. తను లైఫ్ లో బిజీ అవ్వాలి తను డాక్టర్ అయితే నీకు కూడా మంచి గుర్తింపు ఉంటుంది కదా..

గౌరవప్రదమైన వృత్తిని కాదని అనకూడదు.. డాక్టర్ అయితే మర్యాద దక్కుతుందో మనందరికీ తెలిసిన విషయమే.. ఈ విషయంలో నేను కృష్ణకి ఫుల్ సపోర్టుగా ఉంటాను.. నువ్వు కూడా తనకి సపోర్ట్ చెయ్యి నీకు కూడా నేను కృష్ణ విషయంలో సపోర్ట్ చేస్తాను అని ముకుందా అంటుంది.. కృష్ణ విషయంలో ఇంత సపోర్ట్ గా మాట్లాడుతుంది అని మురారి అనుకుంటాడు.. నాకు నీ మీద కోపం ఉంది. కృష్ణను పెళ్లి చేసుకుందామని కానీ కృష్ణ మీద కోపం లేదు.. అందుకే తనకి సపోర్ట్ చేస్తున్నాను అని ముకుందా మురారి కి అనుమానం రాకుండా కవర్ చేస్తుంది..

కృష్ణ రేవతి దగ్గరికి వెళ్లి అత్తయ్య ఇంట్లో ప్రతి విషయంలోనూ మీరే నాకు అండగా నిలబడతారు. ఈ విషయాన్ని అయినా సరే నేను మీతో పంచుకుంటాను. అలాంటిది మీరే నా చదువు విషయంలో నన్ను వ్యతిరేకిస్తే నేను నా బాధను ఎవరికీ చెప్పుకోవాలి అని కృష్ణ రేవతిని అడుగుతుంది. నేను కనుక్కున్న రెండు సంవత్సరాల తర్వాత కూడా నువ్వు చదువుకోవచ్చు.

నీకు కొత్తగా పెళ్లయింది.. నీ భర్తతో నువ్వు అన్యోన్యంగా ఉండాలి .తనకి దూరంగా అసలు ఉండకూడదు.. ఆ ఎడబాటు మీ ఇద్దరికీ మంచిది కాదు అని రేవతి కృష్ణతో చెబుతుంది. కానీ కృష్ణ మాత్రం మనసులో అయ్యో అత్తయ్య మురారి కి నాకు మధ్యన ఏ బంధం లేదని మీకు ఎలా చెప్పాలి అని కృష్ణ సతమతమవుతుంది. ముకుందా తన గదిలో కృష్ణ ఈ ఇంటి నుంచి కాస్త దూరంగా వెళ్తే మురారి కి నాకు మధ్యన ఏకాంతం పెరుగుతుంది. కృష్ణ తన చదువులో పడి బిజీగా ఉంటే మురారి కి నేను దగ్గర అవచ్చు అని ముకుందా ప్లాన్ చేస్తుంది.

అలేఖ్య ముకుందా దగ్గరకు వచ్చి ఆదర్శ్ తిరిగి వచ్చాడని చెబుతుంది ఇంట్లో వాళ్ళందరూ ఆదర్శ తిరిగి వచ్చాడని తెలిసి పరిగెత్తుకుంటూ ఉంటారు అందరూ ఆనందంగా ఉన్నా కానీ ముకుందా మనసులో మాత్రం కాస్తైనా ఆనందం కనిపించదు..