Krishna Mukunda Murari: ఇక మురారి కి కాఫీ తీసుకెళ్లడం ఇద్దరి మధ్య సంభాషణలు జరుగుతుండగా.. ముకుందా చాటుగా వాళ్ళిద్దర్నీ గమనించడం.. వాళ్ళిద్దరూ దగ్గరవుతుండగా ముకుందా చూసి తట్టుకోలేకపోవటం ఇద్దరు కలిసి బయటకు వెళ్తే వాళ్ళిద్దరి మధ్య ఏకాంతాన్ని చూసి ముకుందా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అసలు మురారి మనసులో తన స్థానం ఏంటో తెలుసుకోవాలని డిసైడ్ అవుతుంది . మురారి కి బాయ్ చెప్పి కృష్ణ హాస్పిటల్ కి వెళ్ళిపోతుంది.. మురారి రెడీ అయ్యి స్టేషన్ కి బయలుదేరుతుండగా తన గారికి అడ్డొస్తుంది ..

ఈరోజు నీ మనసులో నా స్థానం ఏంటో తెలిసిపోవాలి.. అసలు నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు అని మురారిని నిలదీసి అడుగుతుంది ముకుంద . నువ్వేప్పటికీ నాకు ఆదర్శ్ భార్యవే తప్ప.. నా కు నీకు మధ్య ఉన్న ప్రేమను నేను ఎప్పుడో భూస్థాపితం చేశాను. నువ్వు కూడా నన్ను మర్చిపోయా.. ప్రశాంతంగా ఉండమని మురారి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.. నువ్వు నాతో ఎంత కోపంగా మాట్లాడేది నా మీద ఉన్న ప్రేమ తోనే అని నేను అనుకుంటున్నాను. ఇలా మాట్లాడితే నిన్ను మర్చిపోతాను అని అనుకుంటున్నావేమో.. ఎప్పటికీ మర్చిపోను అని ముకుందా అంటుంది. దయచేసి మన ప్రేమను మర్చిపోయి నువ్వు ప్రశాంతంగా ఉండమని మురారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇక కృష్ణ కాలేజ్ కి వెళ్ళిన తర్వాత గౌతమ్ సార్ ని పని చెప్పమని అడుగుతుంది. ఇప్పటివరకు నేను నీకు పనే చెప్పాను నువ్వు చెప్పిన ప్రతి పనిని చక్కగా చేసావు. అందులో నీ ఓపిక పట్టుదల నాకు నచ్చాయి అని గౌతమ్ అంటాడు . అలా మాటల మధ్యలో కృష్ణ నందిని కండిషన్ గురించి చెప్పి తన ప్రిస్క్రిప్షన్ను చూపిస్తుంది. అసలు ఈ మెడిసిన్ ఎవరికీ వాడకూడదు. తన గతాన్ని గుర్తుచేసే తను కోమాలోకి వెళ్లిపోవాలని మీ ఇంట్లో వాళ్లందరూ ప్రయత్నిస్తున్నారేమో .. నేను చెప్పిన విధంగా మందులు వాడు కచ్చితంగా ఆ మెడిసిన్ వాడితే తనలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని గౌతమ్ అంటాడు.
ఇక నందినీకి తగ్గిపోతుంది అని కృష్ణ అనగానే.. నందిని నా తన గురించి గుచ్చి గుచ్చి అడుగుతాడు గౌతమ్ ఒకవేళ ఈ పేషెంట్ నా దగ్గరికి ఎప్పుడైనా వచ్చిందేమోనని అడుగుతున్నాను ..తన ఎక్కడ ఉంటుందో చెప్పమని అడుగుతాడు. ఇక వాళ్ళ ఇంటి అడ్రస్ చెబుతుంది కృష్ణ. గౌతమ్ రోజు ఒక అమ్మాయిని తలుచుకుని బాధపడేది నందిని నే అని మెల్లగా రివీల్ చేస్తున్నారు.. ఇక నందినికి గౌతమ్ కి ఉన్న స్టోరీ ఏంటో తర్వాయి భాగంలో చూద్దాం..