NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: కృష్ణని ఇంట్లో నుంచి గెంటేస్తానన్నా భవాని.! ముకుందా ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా.!?

Krishna Mukunda Murari Serial 8 May 2023 Today 151 Episode Highlights

Krishna Mukunda Murari: భవాని ముకుందా కృష్ణ గురించి చెప్పిన మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగానే మురారి కృష్ణ మాటల వల్ల తనకు దూరం అవుతున్నాడా వాళ్లకి ఎలాంటి శిక్ష వేయాలని భవాని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రేవతి భవాని దగ్గరికి వెళ్తుంది. ఏంటి రేవతి ఇలా వచ్చావు అని భవాని అడుగుతుంది. అక్క మీరు ఎందుకు అంత సీరియస్ గా ఉన్నారు అని రేవతి అడుగుతుంది. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు అని భవాని అంటుంది. మీరు ఇంత సీరియస్ గా ఉంటే నాకు మాట్లాడాలంటే కష్టంగా ఉంది. అక్క అని రేవతి అంటుంది. నువ్వు చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పు నేను నా సమాధానం చెబుతాను అని భవాని అంటుంది. ఇక రేవతి ధైర్యం చేసి మీరు తీసుకునే నిర్ణయం వల్ల కృష్ణ మురారి కి హాని జరగకుండా ఉంటే చాలు అని రేవతి అంటుంది. నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు కదా నేను చేయాలనుకుంది నేను చేస్తాను. నా తుది నిర్ణయమే ఫైనల్ అని భవాని అంటుంది. ఇక నువ్వు వెళ్ళు అని భవాని రేవతిని పంపిస్తుంది. ఆ వెంటనే భవాని తన గదిలోకి వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari Serial 8 May 2023 Today 151 Episode Highlights
Krishna Mukunda Murari Serial 8 May 2023 Today 151 Episode Highlights

Krishna Mukunda Murari: రేవతికి ముద్దు పెట్టి మురారిపై తన ప్రేమను చూపించిన కృష్ణ.. అల్లాడిపోతున్న ముకుంద..

భవాని తన గదిలోకి వెళ్ళగానే ఎదురుగా కృష్ణ కనిపిస్తుంది. ఇక కృష్ణ రెండు చేతులతో భవానికి నమస్కారం చేసి అత్తయ్య ప్లీజ్ నన్ను మాట్లాడనివ్వండి అని కృష్ణ వేడుకుంటుంది. నాకు తెలుసు అత్తయ్య మీరు వేసిన శిక్ష నాకు ఇంకా గుర్తుంది కానీ నేను మీతో మాట్లాడాలి అని కృష్ణ అనగానే వెంటనే భవాని కోపంగా తన గదిలో నుంచి బయటకు వెళ్ళమని చేయి చూపిస్తుంది. అయినా కానీ కృష్ణ మురారి గురించి వాళ్ళ పెద్దమ్మతో చెప్పాలని అనుకుంటుంది. ఈ విషయంలో మురారి తప్పేమీ లేదు అత్తయ్య నేనే తప్పు చేశాను దయచేసి మురారితో మాట్లాడండి అంటూ కృష్ణ భవానీని వేడుకుంటుంది. కృష్ణ మాటలు వింటున్న భవానికి కోపం వచ్చి ముకుందా అని పెద్దగా అరుస్తుంది. పెద్ద అత్తయ్య మీరు మాట్లాడక పోతుంటే ఏసిపి సార్ చాలా బాధపడుతున్నారు మీరు ఏసిపి సార్ తో మాట్లాడండి అత్తయ్య అంటూ కృష్ణ రిక్వెస్ట్ చేస్తుంది.

Krishna Mukunda Murari Serial 8 May 2023 Today 151 Episode Highlights
Krishna Mukunda Murari Serial 8 May 2023 Today 151 Episode Highlights

Nuvvu nenu prema: విక్కీ, పద్మావతి ల ప్రేమను అందరికి చెప్తారా? అరవింద అడ్డు తొలగించుకోవాలని చూస్తున్న కృష్ణ..

మరో మారు ముకుందానే పెద్దగా భవాని అరవడంతో ముకుందా భవాని గదిలోకి వస్తుంది ఎదురుగా ఉన్న కృష్ణను చూసి అసలు విషయం అర్థమై కృష్ణ మర్యాదగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో , అసలే పెద్ద అత్తయ్య ఆరోగ్యం బాగోలేదు అని ముకుందా అంటుంది. మీరు ఏ సి పి సార్ తో మాట్లాడాలంటే నేను ఏం చేయాలో చెప్పండి అత్తయ్య అని కృష్ణ అడుగుతుంది. ఇది నా ఇల్లు ఇక్కడ నేను చెప్పిన విషయాలు అమలు అవుతాయని భవాని అంటుంది. నువ్వైనా చెప్పు ముకుందా ఏ సి పి సార్ ఆ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు అని కృష్ణ అంటుంది. పెద్ద అత్తయ్య పొజిషన్లో ఇంకెవరైనా ఉండి ఉంటే నిన్ను ఇంట్లో నుంచి గెంటేసేవారు అని ముకుందా అంటుంది. ఇప్పుడు కృష్ణ ఇక్కడి నుంచి వెళ్లకపోతే నేను నెక్స్ట్ చేసే పని అదే అని భవాని అంటుంది లేదు లేదు లేదు అత్తయ్య అలా చేయకండి . ఒకవైపు మీరు కూడా ఏసీపీ సార్ తో మాట్లాడకుండా ఉన్నారు నేను కూడా మురారి సార్ గదిలో నుంచి వెళ్ళిపోతే ఇంకా ఆయనతో మాట్లాడే వాళ్లే ఉండరు. నన్ను ఈ ఇంట్లో ఉండనివ్వండి అత్తయ్య అంటూ కృష్ణ అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari Serial 8 May 2023 Today 151 Episode Highlights
Krishna Mukunda Murari Serial 8 May 2023 Today 151 Episode Highlights

అత్తయ్య కృష్ణ మీద మీకు చాడీలు చెబుతున్నాను అని అనుకోకపోతే మీకు ఒక విషయం చెబుతాను అత్తయ్య. కృష్ణ ఎంత తెలివైందో చూశారా తను మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేస్తున్నట్లే చేసి ఏసీబీ సార్ దగ్గర మార్కులు కొట్టేయాలని అనుకుంటుంది అని ముకుందా కృష్ణ పై లేనిపోయినవన్ని భవానికి నూరీపోస్తూ ఉంటుంది. ఇప్పటివరకు నేను ఎంత లోతుగా ఈ విషయం గురించి ఆలోచించలేదు. ఇకనుంచి ఈ విషయం గురించి కూడా ఆలోచిస్తాను అంటూ ముకుందా చెప్పిన మాటలకు ప్రభావితం అవుతుంది భవాని.

Brahmamudi: రాజ్ దెబ్బకు భయపడ్డ కావ్య.. కావ్యకు సారె తెచ్చిన అపర్ణ..

Krishna Mukunda Murari Serial 8 May 2023 Today 151 Episode Highlights
Krishna Mukunda Murari Serial 8 May 2023 Today 151 Episode Highlights

కృష్ణ కంటి నిండా నీళ్లు పెట్టుకుని చేతిలో భోజనం ప్లేట్ తీసుకొని గదికి వెళ్తుంది. ఏమైంది కృష్ణ నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయని మురారి అడుగుతాడు. ఇది బాధతో వచ్చినా కన్నీళ్లు కాదు ఏసీబీ సార్ అని కృష్ణ అంటుంది. ఈరోజు మీకు ఇష్టమని పప్పు చేపల వేపుడు చేశాను అని కృష్ణ అంటుంది. అవును నీకు చేపలంటే ఇష్టం ఉండదు కదా అని మురారి అడగగానే మీకు ఇష్టం కదా ఏసీబీ సార్ అందుకే చేశాను . మర్చిపోయాను అమ్మగారు నా కొడుకుకి ఇష్టమని చేపల పులుసు చేశావు సరే తనకి చేపలు ముళ్ళు తీసుకోవడం రాదు ఆ చేప ముల్లు నా కొడుకు గొంతులో ఇరుక్కుంటే నీ వీపు విమానం మోత మోయిస్తా అని చెప్పారు అంటూ కృష్ణ చేప ముల్లులు తీసి మురారిటీ ప్రేమగా తినిపిస్తుంది. కృష్ణ ప్రేమ ఇలాగే తనతో శాశ్వతంగా ఉండాలి అని మురారి అనుకుంటాడు.

Krishna Mukunda Murari Serial 8 May 2023 Today 151 Episode Highlights
Krishna Mukunda Murari Serial 8 May 2023 Today 151 Episode Highlights

మరోవైపు రేవతి నా కోడలు పొద్దున ఎందుకు నన్ను హత్తుకొని మంచి కొడుకును కన్నావు అత్తయ్య అంటూ అంత ప్రేమగా మాట్లాడింది. అసలు కృష్ణ అంత ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి అని రేవతి ఆలోచిస్తూ ఉంటుంది. వెళ్లి వెంటనే కృష్ణను అడిగి తెలుసుకోవాలని అనుకుంటుంది కానీ భవాని అక్కకు తెలిస్తే మళ్లీ ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుందని అక్కడే కూర్చునే ఆలోచనలో పడుతుంది. ఈ మధ్య భవాని అక్క ఎందుకు ముకుందా మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ముకుందా నా కోడలు గురించి భవాని అక్కకు ఏమైనా చెప్పుడు మాటలు చెబుతుందా అని రేవతి ఆలోచనలో పడుతుంది. మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం.

author avatar
bharani jella

Related posts

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri