Krishna Mukunda Murari: కృష్ణ గౌతమ్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ టాబ్లెట్స్ తీసుకుని ఆ టాబ్లెట్స్ ఎందుకు వేసి తనని నయం చేయాలని అనుకుంటుంది. ఇక కృష్ణ మురారి కి ఫోన్ చేస్తుంది .. ఎక్కడున్నారు అంటే నువ్వు ఆనుకుంది మన కారుకే అని డోర్ దింపుతాడు మురారి.. ఇక్కడే ఉన్నారు. ఎప్పుడు వచ్చారు అని కృష్ణ అడగగా.. నేను ఎప్పుడో వచ్చాను అని మురారి అంటాడు ..

అయితే నాకు ఫోన్ చేయొచ్చుగా అని కృష్ణ అంటుంది ..నేను ఫ్రీ గా ఉన్నానని నువ్వు ఫ్రీగా ఉండాలనీ రూల్ ఏం లేదు కదా రా వచ్చి కార్లో కూర్చొని మురారి అంటాడు.. మురారి ఎందుకు కృష్ణకి దగ్గరవుతున్నాడు.. కావాలనే దగ్గరవుతున్నాడా లేదంటే మురారి మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకున్న ముకుందా.. మురారి స్టేషన్ కి ఫోన్ చేసి మురారి కి ఫోన్ ఇవ్వమని అంటుంది .సార్ ఈరోజు రాలేదు మేడం. ఈరోజు సార్ లీవ్ లో ఉన్నారు అని స్టేషన్లో వాళ్ళు చెబుతారు.
మురారి ఆఫీస్ కి వెళ్ళాడు కదా.. స్టేషన్ కి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్లాడు అని ముకుందా ఆలోచిస్తుంది. మురారి ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికి ఫాలో అవ్వాలని అనుకుంటుంది. ముకుంద ఇక మురారి వాళ్ళు వెళ్తున్న కారు ఆగిపోవడంతో పక్కనే ఉన్న బండి దగ్గర పానీ పూరి తింటుంటారు. మురారి కృష్ణ పానిపురి పెడుతుండగా.. ముకుందా వెళ్లి అడ్డుపడుతుంది . మీ ప్రైవేసి కి నేను భంగం కలిగించానా అని అంటుంది. అదేమీ లేదు బయటికి వస్తే కారు ఆగిపోయింది అని కృష్ణ చెబుతుంది.
ఇక రేపటి ఎపిసోడ్లో కృష్ణ గౌతమ్ ఇచ్చిన ప్రెస్క్రిప్షన్ ప్రకారమే టాబ్లెట్స్ వాడుతున్నానని చెబుతుంది. ఆ టాబ్లెట్స్ వేయడానికి వీల్లేదని భవాని అంటుంది. అయితే ఆ టాబ్లెట్స్ రాసిచ్చిన డాక్టర్ మీద కంప్లైంట్ చేస్తాను ఏసీబీ సార్ ఆఫీస్ లో అని కృష్ణ అంటుంది. ఆ మాటలకు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు.