Krishna Mukunda Murari: ముకుంద లాన్ లో కూర్చుని మురారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది తన ఫోన్ ఓపెన్ చేసి అందులో మురారి తో తను కలిసి ఉన్న ఫోటోలను చూస్తూ నా జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటుంది. మురారితో ఏకాంతంగా గడిపిన క్షణాలను, అప్పుడు మురారి తన మీద చూపించిన ప్రేమను ముకుందా ఆస్వాదిస్తూ ఆ క్షణాలు మళ్లీ రావాలని ఈసారి ఆ క్షణాలు శాశ్వతం కావాలని ముకుందా ఆలోచిస్తూ ఉంటుంది.

మురారి తను ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు చూస్తూ నీకు విషయం తెలుసా మురారి. భవాని అత్తయ్య ఈమధ్య నా మాటలకు ప్రభావితం అవుతుంది. మెల్లమెల్లగా నేను మాట్లాడే మాటలకు ఆవిడ కూడా కనెక్ట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. కృష్ణ గురించి నేను చెప్పిన మాటలను విని ఇప్పుడిప్పుడే భవాని అత్తయ్య ప్రభావితం అవుతుంది. భవాని అత్తయ్య నేను చెప్పే మాటలను విని కృష్ణని ఇంట్లో నుంచి పంపిస్తే నాకు అంతే చాలు. కృష్ణ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఆ తర్వాత నిదానంగా నేను టైం చూసుకొని మన ఇద్దరి ప్రేమ సంగతి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి పెద్ద బాంబు పేలుస్తాను. ఆ తర్వాత ఇద్దరం ఒక్కటై పోవచ్చు. దేవుడా ప్లీజ్ ఈ విషయం ఇలాగే జరిగే లాగా చూడు అని ముకుందా అనుకుంటుంది. కృష్ణ ఇంట్లోంచి వెళ్లిపోవాలి మురారి పక్కన తానం పదిలం అవ్వాలి అనే కృష్ణ దేవుడిని మొక్కుకోగానే వెంటనే కరెంటు పోతుంది. ఏంటి దేవుడా ఇలా జరిగింది అని ముకుందా అనుకుంటూ ఉంటుంది.

Nuvvu nenu prema: అరవిందను చంపబోయిన కృష్ణ.. పద్మావతిని కాపాడిన విక్కీ..
మరోవైపు రేవతి నా కోడలు పొద్దున ఎందుకు నన్ను హత్తుకొని మంచి కొడుకును కన్నావు అత్తయ్య అంటూ అంత ప్రేమగా మాట్లాడింది. అసలు కృష్ణ అంత ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి అని రేవతి ఆలోచిస్తూ ఉంటుంది. వెళ్లి వెంటనే కృష్ణను అడిగి తెలుసుకోవాలని అనుకుంటుంది. కానీ భవాని అక్కకు తెలిస్తే మళ్లీ ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుందని అక్కడే కూర్చునే ఆలోచనలో పడుతుంది. ఈ మధ్య భవాని అక్క ఎందుకు ముకుందా మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఛా ఛా భవాని అక్కా ఎప్పటికీ ఉండదు. తను పైకి కోపంగా ఉన్నా కూడా మా అక్క మనసు బంగారం అక్క గురించి నాకు తెలియదా రేవతి తన మనసుకి తానే సర్ది చెప్పుకుంటుంది. ముకుందా నా కోడలు గురించి భవాని అక్కకు ఏమైనా చెప్పుడు మాటలు చెబుతుందా అని రేవతి ఆలోచనలో పడుతుంది.

Brahma Mudi: రాహుల్, స్వప్నల మ్యాటర్ రాజ్ కు తెలిసిపోతుందా? కోపంతో రగిలిపోతున్న రాజ్..
ముకుంద అలాగేనా కృష్ణ ఇంట్లో నుంచి పంపించేసి తను మురారి పక్కన పర్మినెంట్ ప్లేస్ కావాలని చూస్తుంది. మరోవైపు కృష్ణ ఏసీబీ సార్ కి దగ్గరే వాళ్ల పెద్దమ్మను మాట్లాడేలా చేయాలని తన వంతు ప్రయత్నం తను చేస్తుంది. రేవతి కృష్ణ మురారి ఇద్దరు కలిసి ఉండేలాగా భవాని ఒప్పుకోవాలని ఆలోచిస్తుంది. భవాని ఏమో ముకుందా మాటలకు ఇంట్లోనే కృష్ణ గురించి నెగటివ్ గా ఆలోచించడం మొదలు పెట్టింది వీళ్ళ అందరి ఆలోచనల ప్రభావం మురారి మీద పడి కృష్ణ మురారి దూరం అవుతారా అనేది చూడాలి.