Krishna Mukunda Murari: నిన్నటి ఎపిసోడ్ లో ఆదర్శప్పడికి తిరిగి రాడని భవానీ దేవికి అబద్దం చెప్పి నమ్మిస్తుంది ముకుందా, మురారి ఇంట్లో లేని సమయం చూసి, కృష్ణకు కూడా బుద్ధి చెప్పినట్టు ఉంటుందని,ముకుంద కావాలని భవానీ దేవికి అబద్ధం చెప్తుంది. అబద్దాన్ని నిజమని ఇంట్లో అందరూ నమ్ముతారు. కానీ కృష్ణా రేవతి మాత్రం కొద్దిగా ఆలోచిస్తారు. భవానీ దేవి మాత్రం చాలా బాధపడుతుంది. ఆదర్శ్ గురించి ఆలోచిస్తూ ఒంటరిగా తన రూమ్ లోనే ఉంటుంది.

ఈరోజు 286 వ ఎపిసోడ్ లో, ఆదర్శప్పడికి తిరిగి రాడని ముకుంద చెప్పిన అబద్ధాన్ని భవానీ దేవి నమ్ముతుంది. ఆదర్శ కోసం ఏడుస్తూ తన రూమ్లో ఒంటరిగా కూర్చుని ఉంటుంది. భోజనం కూడా చేయలేదని తెలుసుకుంటుంది కృష్ణ. ఆమెకు భోజనం తీసుకుని వెళుతుంది. భవానీ దేవి రూమ్ లో లైట్ కూడా వేసుకోకుండా చీకట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. కృష్ణ భవానీ దేవికి భోజనం తీసుకుని వెళ్లి, తనని బాధపడవద్దని, అన్నం తినమని చెప్తుంది కృష్ణ. కృష్ణుని వెళ్లిపొమ్మని కోపంగా అరుస్తుంది భవాని దేవి ఆదర్శ రాడు అన్న నిజం విన్న తర్వాత, నేను ఎంత బాధ పడుతున్నానో నీకేం తెలుసు కృష్ణ అని అంటుంది. కృష్ణ భవానీ దేవికి నచ్చి చెప్పాలని చూస్తుంది ఆదర్శ్ బతికే ఉన్నాడని అర్థమైంది కదా అత్తయ్య దాంతో మనసుని కుదుట పరుచుకోండి అని అంటుంది. బతికి ఉన్నా నన్ను మాత్రం జీవచ్ఛవాన్ని చేశాడు అని అంటుంది భవాని దేవి. చిన్నతనం నుండి ఆదర్శ చేసిన పనులను గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతుంది భవాని దేవి.
Krishna Mukunda Murari: ముకుందని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా భవానీ దేవి.. రేపటికి సూపర్ ట్విస్ట్..

చిచ్చు పెట్టాలని చూసిన ముకుందా..
భవానీ దేవి దగ్గరికి మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా వస్తారు. ముకుంద వస్తూ వస్తూనే కృష్ణ పై కోప్పడుతూ ఉంటుంది.అత్తయ్యకు అసలే మనసు బాగ లేకపోతే నువ్వు ఇంకా ఎక్కువ ఏడిపిస్తున్నావా కృష్ణ అని అంటుంది. ఆదర్శ గురించి ఆమె బాధ పడుతుంటే ఆదర్శ గురించి నువ్వు మాట్లాడి తన బాధను పెంచుతున్నావా అని అంటుంది. భవాని అత్తయ్యకు అన్నం నేను తినిపిస్తాను అని చెప్పి కృష్ణ దగ్గర ఉన్న పల్లెమ తను తీసుకుంటుంది. దుఃఖంలో ఉన్న మా అత్తయ్యను ఇంకా ఏడిపించకు, కావాలని తన మీద ఉన్న ద్వేషాన్ని బయటపెడుతుంది. భవానీ దేవి ముకుందని చూసి బాధపడుతుంది నిన్ను మీ నాన్నను నేను ఆదర్శ వస్తాడని నమ్మించాను. నాకంటే నా కొడుకు అంటే నీ జీవితం బాగుండాలని నేను ఎక్కువ తాపత్రయపడ్డాను. ఇప్పుడు ఆదర్శ్ తిరిగి రాడు అని తెలిసి నేను నీకేమీ సహాయం చేయలేకపోతున్నాను అని భవానీ దేవి ముకుందతో అంటూ ఉంటుంది.

ముకుందని పుట్టింటికి వెళ్ళి పొమ్మన్న అత్తగారు..
ఇక భవానీ దేవి ముకుందని చూస్తూ, బాధపడుతూ ఆదర్శవస్తాడని ఇక నిన్ను ఎంతో కాలం నేను నమ్మించలేను. ఆదర్శ్ తిరిగిరాడని తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు పుట్టింటికి వెళ్ళిపోమని ముకుందతో అంటుంది భవాని దేవి. అది విని ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ముకుందా కదా అడ్డం తిరిగేలా ఉందే అని అనుకుంటుంది.దాని పుట్టింటికి వెళ్ళక తప్పదని భయపడుతుంది. భవాని మాటలతో రేవతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ముకుంద అటు ఈ విధంగా అయినా తొలగిపోతుందని సంతోషిస్తుంది. కానీ భవాని దేవి మాటలకు కృష్ణ అడ్డుపడుతుంది. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని ఇలా మాట్లాడటం నేను చూడలేకపోతున్నాను అత్తయ్య ఈరోజు రానని చెప్పిన ఆదర్శం మనసు మార్చుకుని తిరిగి రావచ్చు కదా అని భవాని దేవితో అంటుంది. రెండు వారాల్లో ఆదర్శ్ ని తిరిగి ఇంటికి తీసుకొస్తానని అప్పటివరకు ముకుందని ఇక్కడే ఉంచండి అని అంటుంది కృష్ణ. కానీ భవానీ దేవి కృష్ణ మాటల్ని పట్టించుకోదు. నిజం చెప్తున్నాను అత్తయ్య ఇప్పుడు మీరు ముకుందని ఇంటికి పంపించొద్దు నా మాట వినండి రెండు వారాలు నాకు టైం ఇవ్వండి అని భవానీ దేవుని వేడుకుంటుంది. ఇన్ని రోజులు చూసాం కదా ఇంక రెండు వారాలే కదా అని ఇష్టం లేకపోయినా చెప్పిన మాటని భవానీ దేవి ఒప్పుకుంటుంది. ఇక కృష్ణ చేసిన పనికి ముకుంద హ్యాపీగా ఫీల్ అవుతుంది, ప్రస్తుతానికైతే ఇక నుంచి వెళ్లట్లేదు ఇంకో రెండు వారాల్లో ఏదో ఒకటి చేయాలి అని ముకుంద డిసైడ్ అవుతుంది.

కోడల్ని చూసి మురిసిపోయిన రేవతి..
ముకుందని ఇంటికి పంపించే మంచి ఛాన్స్ ని కృష్ణ చేయి జార్జిందని రేవతి తట్టుకోలేక కృష్ణకు క్లాస్ పీకడానికి వెళుతుంది.కృష్ణ నువ్వు చేసిన పని నీకైనా అర్థమవుతుందా, అసలు ముకుంద ఇక్కడ ఉండకుండా వెళ్తేనే మనకు మంచిది అని అంటుంది రేవతి. మురారిపై ఉన్న ప్రేమతోనే ముకుందా ఇలాంటి పనులు చేస్తుంది అత్తయ్య అని నిజం చెప్తుంది కృష్ణ. రేవతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. కృష్ణకు నిజం తెలిసిపోయింది మురారిని ముకుంద ప్రేమిస్తున్న విషయం కృష్ణకు తెలిసినందుకు రేవతి భయపడుతుంది. కానీ కృష్ణ చాలా కూల్ గా ఇవన్నీ ముకుందా కావాలనే చేస్తుంది ఆదర్శ్ రాడ్ అన్న విషయం ముకుందా అబద్ధం చెప్తుంది. ఎలాగైనా తను చెప్పేది అబద్ధమని మనం నిరూపించి ఆదర్శనీ ఇంటికి తిరిగి తీసుకురావాలి అని కృష్ణ రేవతితో అంటుంది. మీరేం భయపడకండి అత్తయ్య ముకుందను సెట్ చేసి తన కాపురాన్ని తాను ఎలా సరిదిద్దుకోవాలో రేవతికి చెప్తుంది కృష్ణ. కోడలు తెలివితేటలు చూసి రేవతి మురిసిపోతుంది. కోడల్ని ఆకాశానికి ఎత్తేస్తుంది. ముకుంద గుణపాఠం చెప్పడానికి కృష్ణా రెడీ అయిందని రేవతి మురిసిపోతుంది.

మధు తో కలిసి కృష్ణ ప్లాన్..
ఇక మధు అసలు ముకుందని వెళ్ళిపోమని భవానీ దేవి అత్తయ్య చెప్తే ఈ కృష్ణ ఎందుకు అడ్డుపడింది ఈ కృష్ణకి ఏం చేస్తుందో తనకైనా తెలుస్తుందా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి కృష్ణ వస్తుంది. నువ్వు అసలు ఏం చేసావో నీకైనా అర్థమవుతుందా అని అంటాడు మధుకర్. సరేలే ఇప్పుడు నేను చెబుదామని వచ్చాను అది చెప్పనివ్వు అని, ఇందాక పెద్ద అత్తయ్య ఆదర్శ రావడం తెలిసి చాలా బాధపడింది కదా అని అంటుంది. అవును పెద్దమ్మలా బాధపడ్డ నేనెప్పుడూ చూడలేదు కృష్ణ అంటాడు మధు.కానీ ఏం చేద్దాం ఆదర్శ రాడు కదా అని అంటాడు. వస్తాడు మధు అని అంటుంది కృష్ణ. అవును నువ్వు విన్నది నిజమే ముకుంద చెప్పింది అబద్ధం. ముకుంద కళ్ళే ఆ విషయాన్ని చెప్తున్నాయి ముకుందా అబద్ధం చెప్పింది అన్న విషయం బాగా అర్థమవుతుంది ముకుందని చూస్తే అని అంటుంది. అవును కృష్ణ నువ్వు చెప్తుంటే నాకు డౌట్ వస్తుంది అని అంటాడు మధు. నిజమని నిరూపించాలి అని అంటుంది.సీతకి హనుమంతుడులాగా నేను నీకు అలానే కృష్ణ నీకోసం ఏదైనా చేస్తాను అంటాడు మధు మనం ఇద్దరం కలిసి ఎలాగైనా ముకుంద చెప్పింది అబద్ధమని నిరూపించి ఆదర్శనీ తిరిగి తీసుకురావడానికి సహాయం చేయాలి అని అంటుంది. సరే అంటాడు మధు

అలేఖ్యని బెదిరించిన మధు..
వెంటనే మధు అలేఖ్య దగ్గరికి వెళ్లి, ముకుంద పాన్ ఇండియా లెవెల్ లో పర్ఫామెన్స్ చేసింది కదా, అని అంటూ ఉంటే కష్టాల్లో ఉన్న మనిషిని అలా మాట్లాడుకో అంటుంది అలేఖ్య. ఎహే ఆపు ఆమె ఏంటి కష్టాల్లో ఉండేదేంటి నాకు తెలియదు అనుకుంటున్నావా అంటాడు మధు విషయం ఏంటో చెప్పు అంటుందా అలేఖ్య. ముకుంద చెప్పింది అబద్ధం అని నిరూపించాలనుకుంటున్నాము అని అంటాడ. షాక్ అవుతుంది అలేఖ్య నీకు అంత సీన్ లేదు అంటుంది. ఇవి నేను చెప్పిన మాటలు కాదు బేబీ కృష్ణ చెప్పిన మాటలు అని అనంగానే ఇంకా షాక్ అవుతుంది.నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా, ఆదర్శం రెండు వారాల్లో తిరిగి తీసుకువచ్చి ఇద్దరినీ కలిసి బార్డర్లో పడేస్తుంది కృష్ణ అని చెప్తాడు. అలేఖ్య ఇప్పుడే వెళ్లి ఈ విషయాన్ని ముకుందతో చెప్తాను అని అంటుంది ఒక్క నిమిషం బేబీ అని అలేఖ్య చెవిలో మధు ఏదో చెప్తాడు. ధైర్యం అంటే ఇప్పుడు వెళ్లి చెప్పు అని అంటాడు. సచ్చినోడా నన్నే బెదిరిస్తావా అని అనుకుంటుంది మనసులో అలేఖ్య.
కృష్ణ మీద నమ్మకం..
కృష్ణ చెప్పిన మాటలన్నీ భవానీ దేవి ఆలోచిస్తూ, కృష్ణ అచ్చం నాలానే ఆలోచిస్తుంది, ఇంటి కోడలిగా తన బాధ్యతలని నెరవేరుస్తుంది. తొందరపాటులో నేను తీసుకున్న నిర్ణయాన్ని, ఇంటి కోడలిగా గుర్తించి ఆదర్శ తిరిగి తీసుకురావడానికి, తన వంతు ప్రయత్నం చేస్తుంది. తను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంటుంది. ఇంక నేను ఎందుకు భయపడాలి తను అనుకున్నది అంటే కచ్చితంగా చేస్తుంది. ఆదర్శం తిరిగి ఇంటికి వస్తాడు కాదు ఇంటికి కృష్ణ ఆదర్శ్ ని తిరిగి తీసుకొస్తుంది ఆ నమ్మకం నాకుంది కృష్ణ మీద ఉన్న నమ్మకాన్ని నేను వదులుకోకూడదు. ఒక వారం రోజులు ఎదురు చూస్తే తప్పేముంది అని అనుకుంటుంది.
రేపటి ఎపిసోడ్ లో కృష్ణ, తులసి కోటకు పూజ చేసి లోపలికి వస్తుండగా ముకుందా ఎదురవుతుంది. ఏంటి కృష్ణ చాలా నమ్మకంతో ఉన్నావు అని అంటుంది. నీ మనస్సాక్షిని అడుగు నువ్వు చెప్పింది అబద్ధం అని నాకు తెలుసు దాని నిరూపిస్తాను అని అంటుంది. నా మనసు నిండా మురారి ఉన్నాడు అని అతడు తన సొంతమని కృష్ణతో అంటుంది ముకుంద. అది చూద్దామని కృష్ణ ముకుందా ఇద్దరు సవాల్ చేసుకొనుగా, ముకుంద కృష్ణకు నీకు దమ్ముంటే నా ప్రేమ సంగతి భవానీ దేవికి చెప్పు అని అంటుంది.