Krishna Mukunda Murari: కృష్ణ తను డాక్టర్ చదవాలని.. పేద వాళ్లకు వైద్యం ఉచితంగా చేయాలని వాళ్ళ అమ్మ చిన్నప్పుడే తన నుంచి ప్రమాణం తీసుకుంటుంది.. వాళ్ళ అమ్మ ఆరోగ్య కారణాల కారణాలు చిన్నప్పుడే చనిపోతుంది. కృష్ణ కి అమ్మ దూరం అవుతుంది. తను చనిపోవడంతో కృష్ణకి అమ్మానాన్న రెండు తానే అయ్యి వాళ్ళ తనని పెంచుతాడు. అందుకని కృష్ణకు తన తండ్రిపై ఎనలేని ప్రేమ.. రేపు తనని పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లేటప్పుడు కూడా తనతో పాటు తన తండ్రి కూడా రావాలనేది కృష్ణ కోరిక.. కండిషన్ కూడా.. అయితే తనని పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన అతను మాత్రం తన కోరికను అంగీకరించడు..
కృష్ణని శివ టార్చర్ పెడుతున్నాడని తెలుసుకున్న కృష్ణ తండ్రి కోపంతో సలసల మరిగిపోతాడు. ఇన్ని రోజులు నుంచి నిన్ను ఆ శివ టార్చర్ పెడుతున్న సంగతి నాకు ఎందుకు చెప్పలేదు అని కృష్ణని నిలదీస్తాడు.. తన ఇంటిలోకి వచ్చి కృష్ణ రూమ్ లో ఉన్న అద్దంపై పెళ్లి ముహూర్తంతో పాటు కృష్ణ వెడ్స్ శివ అని రాసి ఉండటం చూసి.. వాడి అంతు చూస్తాను అని కృష్ణ వాళ్ళ నాన్న అంటాడు.. కృష్ణ చేత వాళ్ళ నాన్న పోలీస్ కంప్లైంట్ రాయించి శివాని అరెస్ట్ చేస్తాడు. శివ వాళ్ళ చెల్లి కృష్ణ కు వార్నింగ్ ఇవ్వడం.. కృష్ణ భయపడి ఆ కంప్లైంట్ వెనక్కు తీసుకోవడం చక చక జరిగిపోతాయి. అప్పుడే శివన్న కృష్ణ ఫాదర్ కి స్పాట్ ఫిక్స్ చేస్తాడు..
మురారి ఉంటున్న కాటేజ్ కి ముకుందా కూడా వస్తుంది. ముకుందా పడిపోతుండగా మురారి పట్టుకుంటాడు.. ఆ చూపులోనే ఇద్దరు ఒకరికి ఒకరు కనెక్ట్ అవుతారు..
ఆదర్శ్ మురారి పెద్దమ్మ కొడుకు కానీ కొడుకు.. విల్లీదరికి ఒకరంటే ఒకరు ప్రాణం.. కానీ ముకుందా విషయంలో వీళ్ళు ఎటువైపు పయనిస్తారో చూడాలి.. ఆదర్శ్ మురారి తో ఆ అమ్మాయి ఫోటో చూడగానే.. ప్రేమలో పడిపోయాను రా అని ఆదర్శ్ మురారి కి ఫోన్ చేసి చెబుతాడు వావ్ సూపర్ రా .. అంటూ త్రిల్ అవుతాడు మురారి.. పెద్దమ్మ వాళ్ళు పెళ్లి ఏర్పాట్ల వరకు వచ్చేశారు నువ్వేమో ఇంతవరకు ఈ అమ్మాయిని కూడా చూడలేదు అని ఆదర్శ అంటాడు అయితే సరదాగా ఫోటో పంపించు.. మీ జోడి ఎలా ఉందో నేను చెబుతాను అని మురారి అంటాడు..
ఆదర్శ్ మురారి కి ముకుందా ఫోటో పంపించినట్టే పంపించి వెంటనే డిలీట్ చేస్తాడు. అదేంటిరా డిలీట్ చేసేసావు అని అంటే నువ్వు ఇక్కడికి వచ్చి నేరుగా ఆ అమ్మాయిని చూడాలి అని ఆదర్శ్ అంటాడు. రేయ్ నీ వెనుక ఎవరో అమ్మాయి ఉన్నారు చూపించు అని ఆదర్శ్ అంటాడు. నాకు తెలియదు అని మురారి అంటాడు. సరే త్వరగా వచ్చేయ్ అని ఆదర్శ్ కాల్ కట్ చేస్తాడు ..
ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో శివన్న చంద్రశేఖర్ని టార్గెట్ చేసి మరీ చంపడానికి ప్లాన్ చేశాడు. ఆల్మోస్ట్ చంపేసినట్లే చూపించారు . ఇక ఏం జరుగుతుందో అనేది చూడాలి. మరోవైపు ఆదర్శ్ వెళ్లి ముకుందాను కలుస్తాడు. మీ ఫోటో చూసిన వెంటనే మిమ్మల్ని ప్రేమించాను అని చెబుతాడు. ముకుంద ఏడుస్తూ ఉంటుంది .మురారి కి ఈ విషయం తెలుసా తెలీదా అనేది ఇక తరువాయి భాగంలో చూడాలి.