Krishna Mukunda Murari: కృష్ణ కోసమే ఎదురు చూస్తున్నా మురారి ముకుందా కనిపించగానే కృష్ణ ఎక్కడ అని అడుగుతాడు. ఆ మాటకి ముకుంద సమాధానం చెప్పకుండా నేను నీతో మాట్లాడాలి పైకి రా అని చెబుతుంది. ఇక తప్పని పరిస్థితుల్లో మురారి మేడ పైకి వెళ్తాడు ముకుందా కృష్ణ ఎక్కడ త్వరగా చెప్పు అడుగుతాడు. కానీ ముకుందా తన ప్రేమ విషయం మాట్లాడుతుండగా.. నువ్వు కృష్ణ ఎక్కడ ఉందో చెప్పకపోయినా పర్లేదు నేను వెళ్లి కృష్ణను వెతుకుతాను అని మురారి అంటాడు. అంటే నేను ఏమైపోయినా నీకు పర్వాలేదా అని ముకుందా అంటుంది. అప్పుడే కృష్ణ కూడా ఇంటికి వస్తుంది ఇక తన గదిలోకి వెళ్లి మురారి ఎక్కడ అని వెతుకుతూ ఉంటుంది.

ముకుందా ను దగ్గరకు తీసుకుని గట్టిగా హత్తుకుని నేను కృష్ణకు మన ప్రేమ విషయం చెప్పేసాను అని చెబుతుంది. నువ్వు నాకు కావాలి మురారి. నువ్వు లేకుండా నేను ఉండలేను అని మురారిని గట్టిగా హత్తుకుంటుంది ముకుంద. ఇక మురారి కోసం వెతుకుతున్న కృష్ణ ముకుంద గట్టిగా హత్తుకొని మురారితో మాట్లాడటం చూస్తోంది ముకుందా మురారితో నువ్వు లేకుండా నేను ఉండలేను మురారి. నువ్వు నేను కలిసి పెళ్లి చేసుకుందాం. కృష్ణని నువ్వు ఇంట్లో నుంచి పంపించేసాయి మనిద్దరం పెళ్లి చేసుకుందాము. పెద్ద అత్తయ్యతో ఈ విషయాన్ని చెప్పేద్దాము అని ముకుందా అంటున్న మాటల్ని కృష్ణ విని తల బద్దలయ్యేలాగా ఏడుస్తుంది.

కృష్ణ అప్పుడు అంటే ఉదయం ముకుందా చెప్పిన ఆ రాధ ఎవరో కాదు తన గురించే అని ఇప్పుడు కృష్ణకి అర్థం అవుతుంది.. అంటే ముకుందా మురారిని ప్రేమిస్తుందని కృష్ణ కి క్లారిటీ వచ్చింది. కానీ మురారి మాత్రం ముకుందని హత్తుకోలేదు తన రెండు చేతులు పైకి ఎత్తి నిలబడి ఉంటాడు. ముకుందా చెప్పే మాటలను మౌనంగా వింటూ ఉంటాడు నువ్వు లేకపోతే నేను ఉండలేను మురారి ప్లీజ్ నా ప్రేమని అర్థం చేసుకో నేను ప్రేమించినంతగా నిన్ను ఎవరు ప్రేమించలేరు కృష్ణని వదిలేసేయ్ మనం ఒక్కటావుదం అన్న మాటలను కృష్ణ విని అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతుంది. ఆ తరువాత మురారి కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

ఇక కృష్ణ తన గదిలోకి వచ్చి గతంలో మురారి ముకుంద మధ్య జరిగిన సంభాషణ, సన్నివేశాలను గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. వీళ్ళందరూ కలిసి నన్ను మోసం చేశారా కాదు నేనే ఇవన్నీ తెలుసుకోకుండా మోసపోయాను అని కృష్ణ అనుకుంటుంది ముకుందా నా వెనకాలే ఉంటూ నన్ను వెన్నుపోటు పొడిచావ ఇంత మోసం చేస్తావని కృష్ణ బాధపడుతుంది. ఇది మోసం కాదు దగా, వంచన, కుట్ర అని నేను నీకు ఏం ద్రోహం చేశాను అని నేల మీద పడి గుండెలు అవిసేలా ఏడుస్తుంది.

అలేఖ్య మధు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా.. మాటల మధ్యలో పుట్టినరోజు అనే టాపిక్ వస్తుంది అప్పుడు ఏ హీరోయిన్ పుట్టినరోజు ఎప్పుడో మధు టకటక చెప్పేస్తూ ఉంటాడు. వీళ్లే కాదు ఇంకా ఏ హీరోయిన్ పుట్టినరోజు అయినా అడిగితే నేను వెంటనే చెప్పేస్తాను అని మధు అలేఖ్య ముందు ఫోజ్ కొడతాడు. అవునా బేబీ అయితే నా పుట్టినరోజు ఎప్పుడో చెప్పు అని అలేఖ్య అడుగుతుంది. ఇప్పుడు ఇంత సడన్గా ఎందుకు.. అయినా నువ్వు ఎప్పుడు పుట్టావు అని మధు సరదాగా అలేఖ్యను అడుగుతాడు. ఇక అంతే కోపం వచ్చినా అలేఖ్య మధుని చితక్కొట్టుడు కొడుతుంది.

మురారి ముకుందా మాట్లాడిన మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు లేకపోతే నేను ఉండలేను మన ప్రేమ విషయం అత్తయ్యతో చెప్పి పెళ్లి చేసుకుందాం అని అన్న మాటలను గుర్తు చేసుకుని మురారి ఆలోచిస్తూ ఉంటాడు.

ఇక రేపటి ఎపిసోడ్ లో మురారి తన బెడ్ మీద కూర్చుని ఉంటాడు. కృష్ణ కింద చాప వేసుకుని పడుకుని ఉంటుంది. ఎందుకు కృష్ణ కింద పడుకుంటున్నావు అని మురారి అడుగుతాడు. నువ్వు ఎందుకు అంతలా బాధపడుతున్నావు.. నేను నీకు ఏమీ కానా అసలు ఏమైందో నాతో చెప్పు అని మురారి అడుగుతాడు. ఆ మాటలకి కోపం వచ్చిన కృష్ణ మురారి కి చేతులు జోడించి నమస్తే పెట్టి నీకు నీ చేతిలో నేను పడుకోవడం ఇష్టం లేకపోతే చెప్పు వెళ్లి బయట పడుకుంటాను అని కృష్ణ అంటుంది. ఇక ఏం జరుగుతుందో చూడాలి..