Krishna Mukunda Murari:ముకుంద వాళ్ళ అన్నయ్య తనతో ఈరోజు నుంచి ఈ అన్నయ్య నీకు తోడుగా ఉంటాడు. ఈరోజు సాయంత్రం లోపు నువ్వు ఒక గుడ్ న్యూస్ వింటావు. నెల రోజుల్లో నువ్వు కోరుకున్న వ్యక్తితో నీ పెళ్లి ఈ అన్నయ్య దగ్గరుండి చేస్తాడు అని మాట ఇస్తాడు ముకుందకు. నీకోసం మీ అన్నయ్య ఏదైనా చేస్తాడు నువ్వు అడిగితే ప్రాణమైనా ఇస్తాడు. అని ముకుందకు భరోసా ఇస్తాడు వాళ్ళ అన్నయ్య.

ఇక ముకుంద వాళ్ళ అన్నయ్య అక్కడి నుంచి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ కి వెళ్తాడు. మురారి ఎలా ఉన్నాడు అని తన చెయ్యి పట్టుకుని చూడగానే.. మురారి కి ఊపిరి ఉంటుంది ఆ తరువాత తన స్నేహితుల దగ్గరికి వచ్చి నాకు తెలుసు నువ్వు ఒకే కారులో ప్రయాణం చేస్తున్న ఇద్దరినీ ఒకరిని ప్రాణాలతో లేకుండా.. మరొకరిని ప్రాణంతో ఉండేలాగా చంపడం నీకు నువ్వే సాటి. అందుకే ఈ యాక్సిడెంట్ కి నిన్నే ఎంచుకున్నాను అని యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని ముకుంద వాళ్ళ అన్నయ్య మెచ్చుకుంటాడు. ఇప్పుడు అంబులెన్స్ రావాలి అని చెప్పి అంబులెన్స్ లో మురారిని హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత వెంటనే తన చెల్లి ముకుంద కి ఫోన్ చేసి మురారి గురించి నీకు ఒక విషయం చెప్పాలి త్వరగా హాస్పిటల్ కి రమ్మని చెబుతాడు.

ఇక విషయం తెలుసుకున్న ముకుందా పరుగు పరుగున హాస్పటల్ కి వస్తుంది. మురారి గురించి చెబుతానని హాస్పిటల్ కి ఎందుకు రమ్మన్నాడా అని తను ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైంది అన్నయ్య మురారి గురించి చెబుతాను అన్నావు ఇక్కడికి రమ్మన్నావ్ ఏంటి అని అడుగుతుంది. నేను నీకు ఒక విషయం చెబుతాను. కంగారు పడకు అని అతను అంటాడు. నేను కారులో వెళ్తూ ఉండగా ఎవరికో యాక్సిడెంట్ జరిగింది. సరే ఎవరా అని చూడగా అందులో మురారి ఉన్నాడు. ఇప్పుడు మురారి కి ఎలా ఉంది, నేను తనని చూడాలి అంటూ ముకుందా కంగారుపడుతూ ఉంటుంది. హాస్పిటల్ బెడ్డు పైన ఉన్న మురారిని చూసి ముకుందా ఇంకాస్త కంగారు పడుతుంది. మురారి కి యాక్సిడెంట్ జరిగిందంటేనే ఇంత కంగారు పడుతుంది అదే నేనే యాక్సిడెంట్ చేయించాను అంటే ఇంక ఏమైపోతుందో అని ముకుందా వాళ్ళ అన్నయ్య మనసులో అనుకుంటాడు.

మురారి కి ఏమీ కాలేదు అని ముఖానికి మాత్రమే దెబ్బలు తగిలాయని.. అంతకుమించినా డేంజర్ ఏమీ లేదు అని డాక్టర్ చెబుతుంది. అయితే ఇక వెంటనే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పాలని ఫోన్ చేస్తుండగా ముకుందని వాళ్ళ అన్నయ్య అపుతాడు. ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని అడుగుతాడు. ఏమి జరిగినా నేను మంచిదే జరిగిందని అనుకో అని చెబుతాడు. మురారి గురించి ఇప్పుడు ఎవరితో చెప్పొద్దు. నీకు కావాల్సింది మురారితో పెళ్లి జరగడమే కదా.. నెల రోజుల్లో మీ పెళ్లి కచ్చితంగా జరుగుతుంది. ఇక నువ్వు ఇంటికి వెళ్ళమని ముకుంద తో వాళ్ళ అన్నయ్య చెబుతాడు.

కృష్ణ మురారి ఇద్దరు యాక్సిడెంట్ అయ్యి వేరువేరు చోట్ల పడి ఉంటారు. ఇక అదే దారిలో వస్తున్న ప్రభాకర్ కృష్ణ గురించి ఆలోచించుకుంటూ వచ్చి అక్కడ జనాలందరూ గుమిగుడి ఉండడం చూసి ఏమైందా అని అక్కడికి వెళ్లి చూస్తే.. అక్కడ కృష్ణ ప్రాణాలతో కొట్టుకుంటూ ఉంటుంది. వెంటనే ప్రభాకర్ బాధతో కిట్టమ్మ అని అరుస్తాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళు కదా సహాయం తీసుకుని కృష్ణుని హాస్పిటల్ కి తీసుకు వెళ్తాడు. కృష్ణకి యాక్సిడెంట్ జరిగిందని తన భార్యకు ఫోన్ చేసి చెబుతాడు ఇక శకుంతలా పరుగు పరుగున హాస్పిటల్ కి వస్తుంది. అంతలో డాక్టర్ కృష్ణని చెక్ చేసి లోపలి నుంచి బయటకు వస్తుండగా.. కృష్ణమ్మకి ఎలా ఉంది అని అడగగా తనకి పెద్ద ప్రమాదం ఏమీ లేదు షాక్ కి గురైంది. తను స్పృహలోకి వస్తుంది అని చెబుతుంది. ఇక వెంటనే శకుంతల కృష్ణ తరుపు అత్తగారు వాళ్ళందరూ ఏరి అని అడుగుతుంది. వాళ్ళు అసలు మనుషులే కాదు రాక్షసులు అని ప్రభాకర్ అంటాడు. అసలు ఏమైంది అంటే అంతకు ముందు జరిగిన గొడవ గురించి ప్రభాకర్ శకుంతలకి మొత్తం వివరించి చెబుతాడు.

ముకుంద వాళ్ళ అన్నయ్య డాక్టర్ దగ్గరకు వెళ్లి తను చెప్పింది చెయ్యమని చెబుతాడు. ఆ డాక్టర్ ససేమిరా కాదని అంటాడు. ముకుంద వాళ్ళ అన్నయ్య ఆ డాక్టర్ని డబ్బులతో మేనేజ్ చేయాలని అనుకుంటాడు. కానీ ఆ డైరెక్టర్ డబ్బులకు కూడా లొంగడు ఇక ఆ తరువాత గన్ తీసి బెదిరిస్తాడు . ఇక్కడ చేయడం కుదరదు అని ఆ డాక్టర్ చెప్పడంతో నీకు కుదిరినచోట చెయ్యి నేను అనుకున్న పని అవ్వాలి. లేకపోతే ఈ గన్ లో మూడే బుల్లెట్లు ఉన్నాయి. అవి నీకు భార్యకి నీ ముద్దుల కొడుకుకి సరిపోతాయి అనుకుంటా అని ముకుంద వాళ్ళ అన్నయ్య బెదిరిస్తాడు.
ఇక రేపటి ఎపిసోడ్లో మురారి డెడ్ బాడీని ఇంటికి తీసుకువస్తారు. మురారి చనిపోయాడని చెబుతారు. అయితే మురారి నిజంగా చనిపోయాడా లేదంటే ముకుంద వాళ్ళ అన్నయ్య ఇదంతా కావాలని చేశాడా అనేది చూడాలి ఎందుకంటే డాక్టర్ కి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి చేపిచ్చింది ముకుంద సంతోషంగా ఉండాలని కాబట్టి ముకుందా మురారిని దూరంగా పంపించి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి సంతోషంగా ఉండేలాగా చేయాలని ముకుంద వాళ్ళ అన్నయ్య ప్లాన్ అయి ఉండొచ్చు.