Krishna Mukunda Murari: అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేయడానికి కూర్చుంటారు. ఇక ముకుందా వంటలు బాగా చేసినట్టు ఉంది అని భవాని అంటుంది. ఈ మధ్య ముకుందా అందరితో కలిసి పోవడానికి ప్రయత్నిస్తుంది అని అనగానే.. అవునక్కా ఈ మధ్య ముకుందా దూకుడు పెంచింది అని రేవతి అంటుంది. అదేంటి అలా అన్నావు అని అడగగానే హుషారుగా చేస్తుంది అని అనబోయే అలా అనేసాను అక్క అని రేవతి కవర్ చేస్తుంది. అప్పుడే మధు ఎవరు ఎన్ని వంటలు చేసినా కానీ రేవతి పెద్దమ్మ లాగా చేయలేరు అని అంటాడు. ఏ మధు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదా అని భవాని ఖండిస్తుంది.

ఇక అప్పుడే కృష్ణ ఏం వంటలు ఉన్నాయో చూద్దాం అని డిషెస్ ఓపెన్ చేయబోతుండగా.. ముకుందా కృష్ణతో చూసి ఎవ్వరైనా చెప్తారు. చూడకుండా చెప్పడమే కదా గ్రేట్ అని ముకుందా అనగానే.. సరే చాలెంజ్ యాక్సెప్టెడ్ అని కృష్ణ అంటుంది. ఇక ముకుందా ఒక్కొక్క డిష్ ఓపెన్ చేస్తుండగా కృష్ణ కళ్ళు మూసుకొని ఆ డిష్ వాసన చూసి ఐటెం ఏంటో చెబుతుంది. ముకుందా చేసిన ప్రతి ఒక్క ఐటమ్ కళ్ళు మూసుకొని కరెక్ట్ గా చెప్పింది. కృష్ణ ఇక కృష్ణ చెప్పడంతో అందరూ ఫిదా అవుతారు. అందరూ కూర్చోండి ఈరోజు నేనే వడ్డిస్తాను అని ముకుందా అంటుంది.

మురారి నీకు ఇష్టమని గుత్తొంకాయ కూర వండాను అని ముకుందా అనగానే.. అదేంటి ముకుందా ఇక్కడ ఉన్న వంటలన్నీ మురారి కి ఇష్టమైనవే కదా అని సెటైర్ వేస్తుంది కృష్ణ. ఎవరెవరికి ఏమి ఇష్టమో నాకు చెప్పండి అవి నేను చేసి పెడతాను అని రేవతి కస్తూ మంటుంది ఆ మాటకి. చిన్న మావయ్య మీకు రేపటికి ఏం వంటకాలు ఇష్టమో చెప్పండి అదే రేపటి లంచ్ లో చేస్తాను అని ముకుందా అంటుంది. ఆ తర్వాత ముకుందా మురారి కి వడ్డించడం కోసం అక్కడే నిలబడి ఉంటుందే తప్ప పక్కకి జరగదు. కృష్ణ ముకుందా ఇద్దరు ఒకేసారి వాటర్ గ్లాస్ ఇవ్వబోతుండగా ఆ వాటర్ మొత్తం ఒలికి మురారి మీద పడతాయి. కృష్ణ మాటలు ప్రవర్తన చూసిన తర్వాత రేవతికి కృష్ణకి నిజం తెలిసిపోయిందేమోనన్న అనుమానం వస్తుంది.

కృష్ణ తన గదిలోకి వెళ్లి బాధపడుతూ ఉంటుంది అది గమనించిన మధు ఏమైంది కృష్ణ ఎందుకు అలా ఉన్నావు అని అడగగా ఏసీబీ సార్ మనసులో నేను ఉన్నానా లేదా అన్న అనుమానం ఉంది అని అనగానే.. ఆ మాటకి మధు ఆ ముకుందా వచ్చి నిన్నేమైనా బెదిరించిందా అని అడుగుతాడు నువ్వు నిజం చెప్పు అని అడుగుతాడు. నువ్వు నిజం చెప్తే నేను కూడా నీకు నిజం చెప్తాను అని మధు అంటాడు. ఇక అలాంటిది ఏమీ లేదు ఏసీబీ సార్ మనసులో నేను ఉన్నానా లేదా అనేదే నా డౌట్ అని అనగానే.. మధు గతంలో ముకుందా చేసినవి అన్నీ కూడా పూసగుచ్చినట్టు ఒక్కొక్కటిగా విడమరిచి కృష్ణకి చెబుతాడు. థాంక్యూ మధు ఎప్పటికైనా నిజం చెప్పావు అని అక్కడి నుంచి కృష్ణ వెళ్ళిపోతుంది. ఈ మాటలన్నింటినీ కూడా మురారి చాటుగా వింటాడు. ఇంతకీ కృష్ణకి నేను నిజం చెప్పానని నమ్మిందా లేదా అని మధు అనుకుంటాడు.

ముకుంద మురారి కి ఫోన్ చేస్తూ ఉంటుంది. కోపం వచ్చిన మురారి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అని అడుగుతాడు త్వరగా మేడ పైకి రా నీతో మాట్లాడాలి అని అంటాడు. నువ్వు కూడా రా నీతో తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయని మురారి అంటాడు. మరోవైపు కృష్ణ మురారి ఎక్కడున్నాడని వాళ్ళ చిన్నత్తయ్యాను అడగగా మేడ పైకి వెళ్ళినట్టు ఉన్నాడు అని చెబుతుంది. ముకుందా మురారి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కృష్ణ చాటు నుంచి చూస్తుంది.

మురారి నువ్వు ఏమన్నా నీ జీవితంలో నాకు తప్ప ఇంకెవరికీ స్థానం ఉండదు అని అన్నావు. నువ్వు ఈ జన్మలో మారవు. నిన్ను మార్చాలి అనుకోవడం కన్నా బుద్ధి తక్కువ పని ఇంకొకటి ఉండదు అని మురారి అంటాడు. ప్లీజ్ ముకుంద నేను నిన్ను ఒకప్పుడు ప్రేమించిన మాట వాస్తవమే. కానీ నా ప్రాణ స్నేహితుడి భార్యను నేను ఎప్పటికీ అలా చూడలేను. నీకు రెండు చేతులు జోడించి దండం పెడుతున్నాను. చావనైనా చేస్తాను కానీ నేను నిన్ను ప్రేమించను. కృష్ణ ఎప్పటికీ నా మనసులో ఉంటుంది అని మురారి చెబుతాడు. ఆ మాటలు విన్న కృష్ణ సంతోషిస్తుంది. మిగతావి తరువాయ భాగంలో చూద్దాం.