Krishna Mukunda Murari: మురారి కృష్ణ ఇచ్చిన కృష్ణుడు బొమ్మ కనిపిస్తుంది. మురారి ఆ కృష్ణుడు బొమ్మను అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ బొమ్మ తనకు ఎవరో ఇచ్చారని గుర్తుకు వస్తుంది వాళ్లు ఎవరు అనేది గుర్తుకురాదు. మురారి ఏమైంది , ఎందుకు అలా ఉన్నావు అని అంతా అక్కడికి వస్తారు. మురారి నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేలాగా ఉంది అని వాంటింగ్ చేసుకోబోతుండగా ముకుందా తన రెండు చేతులు అడ్డుపడుతుంది. ఆ చేతుల్లోనే మురారి వాంటింగ్ చేసుకుంటాడు. ఇక మురారి నీ రిలాక్స్ అవ్వమని వాళ్ళ పెద్దమ్మ చెబుతుంది. ముకుంద వెళ్లి హాండ్స్ వాష్ చేసుకుని వస్తుండగా.. థాంక్యూ ముకుందని అంటాడు మన ఇద్దరి మధ్య థాంక్యూ సారీ ఇలాంటివి ఉండకూడదు అని ముకుందా అంటుంది. ఏమైంది మురారి ఎందుకు ఆలోచిస్తున్నావు అని అంటే.. ఎవరో ఒక అమ్మాయి లెఫ్ట్ సైడ్ ఫేస్ కనిపిస్తుంది. తను ఎవరో అని ఆలోచిస్తున్నాను అని మురారి అనగానే.. అందుకే కదా నిన్ను ఇలాంటివి ఆలోచించొద్దు అని చెప్పేది అని ముకుందా అంటుంది. నువ్వు అసలు ఒంటరిగా ఎందుకు ఉంటున్నావు. ఇకనుంచి నువ్వు ఒంటరిగా ఉండకుండా చూసుకునే బాధ్యత నాది ఏమంటారు అత్తయ్య అని భవానిని అడుగుతుంది ముకుంద. అవును ముకుందా నువ్వే దగ్గరుండి చూసుకోమని భవాని అంటుంది. దొరికిన అవకాశాన్ని అందు పెంచుకోవడంలో నీకంటే దిట్ట మరొకరు ఉండరు ముకుందా అని మనసులో అనుకుంటాడు మధు.

కృష్ణ భవాని అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మధు అక్కడికి వస్తాడు. ఏంటి నువ్వు కూడా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో మురారి నీకు దక్కడు అని చెప్పడానికి వస్తున్నావా అని అంటే.. అవును ఇంట్లో ఏం జరిగిందో తెలుసా అని మధు కృష్ణకి ముకుందా మురారి వాంటింగ్ చేసుకుంటుంటే ఏం చేసిందో.. భవాని దేవి దగ్గర ఎలా తనతో ఉండటానికి పర్మిషన్ తీసుకుందో అన్నీ వివరంగా చెబుతాడు మధు. ఇలా అయితే నువ్వు లైఫ్ లో ఎప్పటికీ డైరెక్టర్ వి కాలేదు అని కృష్ణ అంటుంది. అదేంటి అలా అన్నావు అని మధు అడుగుతాడు ప్రేమ అనేది మనసులో పుట్టాలి. ఏసిపి సార్ ముకుందని ఫ్రెండ్ అనుకుంటున్నారు అది నేను దగ్గరుండి చూశాను. సో సినిమాలని జీవితాలకు అన్వయించుకోవడం మానేయమని కృష్ణ మధుకి సలహా ఇస్తుంది. ఇక మధు కృష్ణ దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతుండగా ముకుందా కృష్ణ ఇంట్లోకి వస్తుంటుంది. ఏంటి కృష్ణని ఓదారుస్తున్నావా అని ముకుందా అడుగుతుంది లేదు అని కాన్ఫిడెంట్ గా అంటాడు.

కృష్ణ దేవుడా నాకు ఎందుకు ఇన్ని సమస్యలు ఇచ్చారని దేవుడికి దండం పెట్టుకుంటుండగా.. అక్కడికి వస్తుంది నువ్వే ఒకప్పుడు చెప్పావు కదా పెళ్లి బంధాన్ని ఆ దేవుడు కూడా విడదీయలేడని.. చూడు కృష్ణ ఇంకా ఇక్కడెందుకు అన్ని సర్దేసుకొ అని ముకుందా చెబుతుంది. స్వయంగా ఏసీబీ సారి నన్ను ఆ ఇంటికి తీసుకువచ్చేలా చేస్తాను. ఈలోపు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటావో చేసుకో అని ముకుందతో కృష్ణ అంటుంది. అది ఎప్పటికీ జరగదు అని ముకుంద అంటుంది.

కృష్ణ తన ఇంటి బయట కూర్చుని వాసనలు అదిరిపోయేలా బిర్యాని చేస్తూ ఉంటుంది. అది చూసి రేవతి సంతోషిస్తుంది భవాని మాత్రం కోపం తెచ్చుకుంటుంది. నేను మురారి గురించి నీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది. భవాని అప్పుడు చెప్పండి అక్క అని అంటే మురారిని బెటర్ ట్రీట్మెంట్ కోసం నేను అమెరికా పంపించాలని అనుకుంటున్నాను. అమెరికాలో నా ఫ్రెండ్ ఉంది కదా తను మిగతా విషయాలన్నీ చూసుకుంటుంది అని చెబుతుంది. మురారి కి గతం గుర్తొస్తుంది అంటే నాకు సంతోషంగానే ఉంటుంది కదా కానీ రేవతి అంటుంది కానీ, మురారిని ఒక్కడినే పంపించడం అని అనగానే.. ఒక్కరినే పంపిస్తానని ఎలా అనుకున్నావు తోడుగా పంపిస్తాను కదా ఇంకొకరిని అని అంటే.. మీరే వెళ్తున్నారా అక్క మీరు వెళ్తే నాకు చాలా సంతోషం అని రేవతి అనగానే.. లేదు రేవతి మురారితో పాటు ముకుందని కూడా అమెరికా పంపించాలని అనుకుంటున్నాను అని అనగానే అందరూ ఆ మాట విని షాక్ అవుతారు.

అమ్మ ఈరోజు మన ఇంట్లో వంటలు ఏంటి అని మురారి అడగగా.. బీరకాయ, పప్పు సాంబారు, వడియాలు అని చెప్పగానే ఇప్పుడు వచ్చే వాసనలు ఇవ్వే బిర్యాని లాగా స్మైల్ వస్తుంది అని అనగానే.. అవి ఇక్కడి నుంచి కాదు మురారి బయట వేణి డాక్టర్ చేస్తున్నా వంటల స్మెల్ అని మధు అంటాడు అయితే మనం కూడా అక్కడికి వెళ్దాం పద అని మురారి అంటాడు. డాక్టర్ వంటలు మాత్రం సూపర్ ఉన్నాయి. స్మెల్ అదిరిపోయింది అని మురారి అనగానే.. మురారి ఎందుకు కృష్ణకు కనెక్ట్ అవుతున్నాడు అని భవాని మనసులో అనుకుంటుంది. నేనేమైనా నీకు హెల్ప్ చేయనా కృష్ణని రేవతి అడగగానే అప్పుడు మీరు నాకు సొంతవాళ్లు అవుతారు. అలా అనుకుంటే ఏమైనా నష్టమా అని మురారి అంటాడు. వేణి బిర్యానీ చాలా బాగుంది అనే భవాని అంటుంది. అయినా తను మనందరికీ చేసిందో చేయలేదు అని అంటే మీ అందరికీ కలిపే చేస్తున్నాను అని కృష్ణ అంటుంది.

ఇక రేపటి ఎపిసోడ్లో కృష్ణ సొమ్మసిల్లి పడిపోయి ఉంటుంది. మురారి కృష్ణను హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. కృష్ణ మురారిని ఎత్తుకుపోతుండగా ముకుందా వద్దులే డాక్టర్స్ తీసుకెళ్తారు అని అంటే.. ఈ వేణి డాక్టర్ కి నాకు గతంలో చాలా దగ్గర పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది అని అనుకుంటాడు. ఇక మురారినే కృష్ణను ఎత్తుకొని హాస్పటల్లోకి తీసుకువెళ్తాడు. మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం.