Krishna Mukunda Murari: కృష్ణ స్పృహలోకి వచ్చేసరికి జరిగిన యాక్సిడెంట్ అంతా గుర్తు వస్తుంది. కృష్ణ ఒక్కసారిగా ఉలిక్కిపడి లెగుస్తుంది. కృష్ణ ఏసీబీ సార్ ఎక్కడున్నారు అని ఎదురుగా ఉన్న వాళ్ళ చిన్నాన్నని అడుగుతుంది. ఏసిపి సార్ మీతో పాటు ఉండడం ఏంటమ్మా అని అడగగా.. ఏసీబీ సార్ నాతో పాటే ఉన్నారు. మేమిద్దరం కలిసి కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగిందని కృష్ణ చెబుతుంది.

నేను రోడ్డు మీద వెళ్తుంటే జనాలందరూ గుమ్మిగుడి ఉన్నారు. అక్కడ నీకు యాక్సిడెంట్ అయ్యి పడిపోయి ఉన్నావు. నేను నిన్ను మాత్రమే తీసుకోవచ్చాను అని ప్రభాకర్ చెబుతాడు. నీ పక్కన ఏసిపి సార్ లేరు అని ప్రభాకర్ అంటాడు. అయితే వెంటనే నేను ఏసీబీ సార్ ని చూడాలి అని తన చేతికి ఉన్న సెలైన్ బాటిల్ని తీసేస్తుంది కృష్ణ. అప్పుడే డాక్టర్ వచ్చి మీరు ఇప్పుడే కనక లేచి వెళ్ళిపోతే మీకు చాలా ప్రమాదమవుతుంది అని ఆమె చెబుతుంది. నాకు ఏమైనా పర్వాలేదు నేను అర్జెంటుగా ఏసీబీ సార్ ని చూడాలి అని కృష్ణ గొడవ చేస్తుంది. ఇక అప్పుడు ప్రభాకర్ మురారి ని తీసుకు వచ్చే బాధ్యత నాది అని కృష్ణ కి చెబుతాడు.

రేవతి నీకు ముందే ఈ విషయం తెలిసి కూడా నువ్వు నాకు చెప్పలేదు. అంటే నువ్వు కూడా కావాలని నన్ను మో
మోసం చేశావు అని భవాని అంటుంది. హాయ్యో అక్క అలాంటిది ఏమి లేదు అక్క కృష్ణ మురారి కి ఒకరంటే ఒకరికి ఇష్టం. అలా అగ్రిమెంట్ మ్యారేజ్ లాగా వాళ్ళిద్దరూ ఎప్పుడు రాలేదు. అలా చెప్పాల్సిన సందర్భం కూడా రాలేదు అని రేవతి అంటుంది. అయినా కానీ మురారి నన్ను మోసం చేసాడు. ఇక ఈ ఇంట్లో కృష్ణ మురారి గురించి ఎవ్వరూ ఆలోచించద్దు. బాధపడవద్దు అని భవాని అంటుంది.

ముకుంద దేవుడు గది లోకి వెళ్లి దేవుడికి దండం పెడుతుంది. నేను చేసేది తప్పని నాకు తెలుసు. కానీ తప్పడం లేదు. ఇప్పుడు మురారి గురించి ఈ షాకింగ్ విషయం తెలిసి ఇంట్లో వాళ్ళందరూ ఏం అవుతారో అని భయంగా ఉంది. ఈ విషయం తెలిసి ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరగరానిది జరిగితే నన్ను క్షమించు దేవుడా.. ఇంట్లో ఎవ్వరికీ ఏమి కాకుండా చూడు అని ముకుంద దేవుడికి దండం పెడుతుంది.

కాసేపటి తర్వాత ఇంటి ముందు అంబులెన్స్ వచ్చి ఆగుతుంది. ఎంటా అంబులెన్స్ అని అంతా అనుకుంటారు. అప్పుడు పోలీసులు మురారి డెడ్ బాడీని ఇంటికి తీసుకువస్తారు. డాక్టర్స్ మురారి బాడీ చూసి చనిపోయాడని సర్టిఫై చేశారని చెబుతారు. ఇక ఆ విషయం తెలిసి ఇంట్లో వాళ్ళందరూ గుండెలు అవిసెలా ఏడుస్తారు. భవాని అయితే మురారి ఒక్కసారి నన్ను చూడు అంటూ భోరున విలపిస్తింది. అందరూ శోక సంద్రంలో మునిగిపోయారు. అయితే మురారి నిజంగా చనిపోయాడా లేదంటే ముకుంద వాళ్ళ అన్నయ్య ఇదంతా కావాలని చేశాడా అనేది చూడాలి ఎందుకంటే డాక్టర్ కి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి చేపిచ్చింది ముకుంద సంతోషంగా ఉండాలని కాబట్టి ముకుందా మురారిని దూరంగా పంపించి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి సంతోషంగా ఉండేలాగా చేయాలని ముకుంద వాళ్ళ అన్నయ్య ప్లాన్ అయి ఉండొచ్చు.

ఇక ప్రభాకర్ ఎంతకు మధు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఇంటికి వస్తాడు. మధు ప్రభాకర్ మాటలను ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ కృష్ణ పై కోపంగా ఉన్నారు అని చెబుతాడు. మరి అల్లుడు ఎక్కడా అని ప్రభాకర్ అడుగగా.. మురారి మనకి ఇంకా లేడు మావయ్య అని మధు బోరున విలపించాడు. ఆ విషయం తెలిసి ప్రభాకర్ షాక్ అవుతాడు.

రేపటి ఎపిసోడ్ లో కృష్ణ స్పృహలోకి వస్తుంది చిన్నన్న మురారి ఇక్కడే ఎక్కడ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అని అంటుంది మరోవైపు ముకుందా వాళ్ళ అన్నయ్య మురారిని అటుగా తీసుకొని ఉంటాడు. ఇక కృష్ణ మురారి నీ గుర్తుపడుతుందా లేదా అనేది చూడాలి.