Krishna Mukunda Murari: మురారి నువ్వు ఏమన్నావు నీ జీవితంలో నాకు తప్ప ఇంకెవరికీ స్థానం ఉండదు అని అన్నావు. నువ్వు ఈ జన్మలో మారవు ముకుంద. నిన్ను మార్చాలి అనుకోవడం కన్నా బుద్ధి తక్కువ పని ఇంకొకటి ఉండదు అని మురారి అంటాడు. ప్లీజ్ ముకుంద నేను నిన్ను ఒకప్పుడు ప్రేమించిన మాట వాస్తవమే. కానీ నా ప్రాణ స్నేహితుడి భార్యను నేను ఎప్పటికీ అలా చూడలేను. నీకు రెండు చేతులు జోడించి దండం పెడుతున్నాను. చావనైనా చేస్తాను కానీ నేను నిన్ను ప్రేమించను. కృష్ణ ఎప్పటికీ నా మనసులో ఉంటుంది అని మురారి చెబుతాడు. ఆ మాటలు విన్న కృష్ణ సంతోషిస్తుంది. ముకుంద మాత్రం కోప్పడుతుంది.

మురారి ఇంకొక కథ చెప్పి ముకుందా మనసు మార్చబోతుండగా.. ప్లీజ్ మురారి నువ్వు ఇలాంటివి పిట్ట కథలు ఎన్ని చెప్పినా సరే నేను మారను కాక మారను అని ముకుంద అంటుంది. ముకుంద మురారి లను చాటుగా గమనిస్తున్న కృష్ణ లోలోపల సంతోషిస్తుంది ఏసిపి సర్ ఒకప్పుడు ముకుందని ప్రేమించారు కానీ ఇప్పుడు ప్రేమించడం లేదు అన్నా క్లారిటీకి వస్తుంది మరి కృష్ణులు ఎందుకు పెళ్లి చేసుకున్నావు మురారి అని ముకుందాడు కదా మా గురువుగారికి ఇచ్చిన మాట కోసం చేసుకున్నాను ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఇప్పటికీ పరితపిస్తూనే ఉంటాను అని మురారి అంటాడు. అప్పుడు కృష్ణ మనసులో ముకుందకి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వాలి ఇక ముకుంద సంగతి నేను చూసుకుంటాను. మీరు బాధపడకండి అని కృష్ణ మనసులో అనుకుంటుంది. మురారి స్ట్రాంగ్ గా ముకుందకు వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

మురారి నిద్రలేచేసరికి కృష్ణ లేచి రెడీ అవుతుంది. క్యూట్ గా నిద్రపోతున్న మురారిని చూసి కృష్ణ ఏబిసిడిల అబ్బాయి చాలా అమాయకుడు అని అనుకుంటుంది. ఇంత క్యూట్ గా ఉండే అబ్బాయిని ఇంకాస్త చంటి పిల్లాడి లాగా రెడీ చేయాలని తన చేతిలో ఉన్న కాజల్ స్టిక్ తో ముఖానికి బుగ్గ మీద కాటుక దిద్దుతుంది. ఇక ఆ తరువాత కృష్ణ కిందకు వచ్చేస్తుంది ఇంట్లో వాళ్ళందరికీ కాఫీ ఇస్తుంది.

ముకుంద ఇంట్లో వాళ్ళందరికీ కాఫీ ఇవ్వాలని అనుకుంటుంది కానీ ఆ పటికే కృష్ణ కాఫీ ఇవ్వడంతో ముకుంద కాస్త సీరియస్ గా అందరూ వైపు చూస్తుంది ఇక ఎవ్వరికి ఇవ్వకుండా తన కాఫీ తన చేతిలోనే ఉండిపోవడంతో కాస్త ఫీల్ అవుతుంది ముకుంద ఇక ముఖంగా బాధపడకుండా ఆ కాఫీ నువ్వే తాగు అని భవాని అంటుంది సరిగ్గా అదే సమయానికి మురారి ఏం చేస్తున్నాడు ఇంకా లెగలేదా అని కృష్ణని అడుగుతుంది అప్పుడు మురారి తన ఎదురు నుంచి కిందకు దిగుతూ కనిపిస్తాడు తన ముఖానికి ఉన్న నల్ల బొట్టు ను చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు మురారికే అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు.

కృష్ణ గబగబా దానికి ఎదురుగా వెళ్లి పదండి ఏసిపి సార్ ఫ్రెష్ అయ్యి వద్దురు అని కవర్ చేస్తుంది. కానీ మురారి అవేమీ పట్టించుకోకుండా కిందకు వచ్చి వాళ్ళ పెద్దమ్మతో క్యాంపుకు వెళ్లాలి అని చెబుతాడు. ఏమైంది పెద్దమ్మ అందరూ ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు మధు మురారిని ఫోన్లో ఫోటో తీసిన ఫోటో చూపిస్తాడు అది చూసి దీనంతటికీ కారణమైన కృష్ణను పట్టుకోబోతుండగా.. తను ఇల్లంతా తిరుగుతూ మురారి కి దొరకకుండా ఉంటుంది. అలా ముకుంద ను అడ్డు పెట్టుకుని మురారి కి చిక్కకుండా తప్పించుకుంటుంది. అలా కృష్ణ మురారి ఇద్దరు ప్రేమ అటపట్టించుకోడం చూసిన ముకుంద కోపంతో రగిలిపోతుంది.

అప్పుడు రేవతి ముకుంద వైపు చూసి కళ్లు ఎగరెస్తుంది. దానికి కోపం వచ్చిన ముకుంద తన చేతిలో ఉన్న కాఫీ కప్పు విసిరి కొడుతుంది. ఏమైంది ముకుంద అని భవాని అడుగగా.. రేవతి కాలినట్టుంది అని అంటుంది. హ.. ఏంటి అంటే.. అదే అక్క చేతిలో కాఫీ కప్పు ఉంది పైగా సాసర్ కూడా లేదు కదా కాలినట్టు ఉంటే ఆ వేడికి కప్పు జారి నట్టు ఉంది అని కవర్ చేస్తుంది. ఇక ఆదర్శ్ ఇంటికి తిరిగి వస్తాడు అని ముకుంద పై అంతా జాలి చూపిస్తారు.

గదిలోకి వెళ్ళిన మురారి లాటి తీసుకుని కృష్ణ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక కృష్ణ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తు ఉంటుంది. మొత్తానికి మురారి కృష్ణ ను గట్టిగా పట్టుకుంటాడు. ప్రేమగా సొంతం చేసుకోవాలి ఇలా కాదు అనగానే కృష్ణ మురారి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్ లో కృష్ణ ఒక పది రోజులు హాస్పిటల్ కి లీవ్ పెట్టీ ఆదర్శ్ వచ్చే లోపు ముకుంద కి ఆదర్శ్ తో ఎలా ఉండాలో ట్రైనింగ్ ఇస్తాను అని అంటుంది. అప్పుడు ముకుంద మనసులో ఆ లోపు నేను నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపిస్తా అని అంటుంది. మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం.