Krishna Mukunda Murari: కృష్ణ మురారి వాళ్ళ ఇంటికి వస్తుంది. ఏంటి నువ్వు వేసిన ప్లాన్ వర్క్ అవుట్ కాలేదని ఇంక మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చేసావా అని భవాని అడుగుతుంది. నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కృష్ణ అంటుంది. డాక్టర్ చెప్పారు గతం తాలూకు జ్ఞాపకాలు ఏవైనా సరే గుర్తు చేస్తే తన ప్రాణానికే ప్రమాదం అని రేవతి అంటుంది. నేను మిమ్మల్ని మేడం అని పిలుస్తాను ప్లీజ్ నన్ను ఇంట్లో ఉండనివ్వండి అని కృష్ణ అంటుంది. మా అబ్బాయిని పెళ్లి చేసుకున్నట్టు ఎన్ని రోజులు ఇంట్లో ఉండి మమ్మల్ని మోసం చేశావు జస్ట్ గో అని భవాని పెద్దగా అరుస్తుంది. ఒక్క నిమిషం మా అబ్బాయి నార్మల్ అయిన తర్వాత ఆ పెళ్లిని రద్దు చేస్తాను అని భవాని అంటుంది. అర్థమైందా.. ఇక నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. ఇక వెళ్లచ్చు అని అంటుంది. ఇక కృష్ణ కూడా మౌనంగా వెళ్లిపోతుంది. కృష్ణ ఆ ఇంటి బయట దూరంగా నిలబడి ఉంటుంది.

ముకుంద మురారి దగ్గరకు వచ్చి ఎలా ఉన్నావు మురారి అని అడుగుతుంది. ఐ యాం ఓకే అని మురారి అంటాడు. మనసుకి దగ్గరైన వాళ్ళు మన పక్కన ఉంటే చాలా ప్లేసెంట్ గా ఉంటుంది అని ముకుందా అంటుంది. అదేంటి ముకుందా ఇప్పుడు అలా అన్నావు అని మురారి అంటాడు అదేం లేదు జస్ట్ క్యాజువల్ గా మాట్లాడాను అని ముకుందా అంటుంది నువ్వేమైనా ప్రేమలో ఓడిపోయావా అంటే లేదు ఇప్పుడే ఆ ప్రేమకు దగ్గరవుతున్నాను అని ముకుందా అంటుంది. అయితే కచ్చితంగా నీ ప్రేమ సక్సెస్ అవుతుంది అని మురారి అంటాడు. థాంక్యూ మురారి అని ముకుందా అంటుంది.

ఇక ముకుందా అక్కడ నుంచి వెళ్ళిపోగానే మురారి తను కూడా గతంలో ఎవరినైనా ప్రేమించానని గుర్తు చేసుకుంటాడు. తన బ్రెయిన్ లో ఏవో విజువల్స్ కనిపిస్తాయి. కానీ ఎవరిని ప్రేమించాడో గుర్తుకురాదు. ఇక ఆ విషయం గురించే మురారి ఆలోచిస్తూ ఉంటాడు. ముకుందా అప్పుడు మురారికే టాబ్లెట్స్ తీసుకువచ్చి ఇస్తుండగా మురారి వేసుకోను అని వాటిని విసిరేసి మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని గొడవ గొడవ చేస్తూ ఉంటాడు. మురారి పెద్దగా అరవడం వినిపించిన కృష్ణ ఇంట్లోకి వస్తుంది. మురారి ఇంట్లో ఎవ్వరి మాటలు వినకుండా నా దగ్గర నుంచి వెళ్లిపోండి అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు.

మేడం ప్లీజ్ ఇంజక్షన్ చేస్తాను త్వరగా తగ్గిపోతుంది. మీ అబ్బాయికి నేను మంచే చేస్తాను. మంచి చేయాలనుకున్నప్పుడు ముఖం కనిపించవసరం లేదు అని భవాని అంటుంది. మరోవైపు మురారి టాబ్లెట్ వేసుకొని ముకుంద ఇస్తుండగా ప్లీజ్ వెళ్ళిపోండి, నా దగ్గరకు రాకండి అని మురారి పెద్దగా అరుస్తాడు. క్షమించండి మేడం ప్లీజ్ ఇలాంటిది ఏదో జరుగుతుందని పొద్దుటి నుంచి వాకిట్లోనే ఎదురు చూస్తూ ఉన్నాను అని కృష్ణ అనగానే మురారి తన వైపు చూస్తాడు. కృష్ణ ను చూడగానే మురారి లేచి నిలబడతాడు. కృష్ణ కూడా ఎవ్వరినీ పట్టించుకోకుండా మురారి దగ్గరకు వెళ్లి ఇంజక్షన్ చేస్తుంది. మీకు నిద్ర లేదు. మీకు నిద్ర అవసరం. మీకు మీ మనసుకి విశ్రాంతి చాలా అవసరం మనసుకి స్ట్రైన్ ఇవ్వకండి సార్ అని కృష్ణ అంటుంది. మనిషిని కాకుండా ప్రకృతిని ఎక్కువగా చూడండి. ప్రకృతితో ఎక్కువగా మాట్లాడండి అని కృష్ణ మురారితో చెప్పగానే థాంక్యూ డాక్టర్ అని అంటాడు. మురారి నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో అని భవాని అంటుంది.

ఏయ్ నువ్వు ఎందుకు లోపలికి వచ్చావ్ అని భవాని అంటుంది. పెద్ద అత్తయ్య అని కృష్ణ అనగానే తన నోరు ఆపేస్తుంది. మేడం నేను ఇంట్లో ఉండాల్సిన అవసరం మీ అబ్బాయికి చాలా అవసరం ఉంది. ఇప్పుడు మీరు చూశారు కదా మేడం అని కృష్ణ అంటుంది. నేను ఏసీబీ సార్ అని కృష్ణ అంటుండగా భవాని పెద్దగా కళ్ళు చేసి చూస్తుంది నేను మురారి సార్ కి తగ్గిన తర్వాతే ఇక్కడ నుంచి వెళ్తాను అని కృష్ణ అంటుంది. ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి. ఏసిపి సార్ అదే మురారి సార్ కోసమైనా ఉంచండి. ముకుంద తనని మన గెస్ట్ హౌస్ లో ఉంచు. రేవతి ఇది కూడా ఎక్కువే. నువ్వు ఇక్కడ ఉంటుంది నా కొడుకుకి డాక్టర్ గా మాత్రమే. నువ్వు నా కొడుకుకి ట్రీట్మెంట్ ఇచ్చిన అన్ని రోజులు నీకు బెస్ట్ ఫీజ్ ఇస్తాను అని అంటుంది భవాని. కృష్ణ పదా వెళ్దాం అని ముకుంద అంటుంది.

ఏంటి ఏంటి కృష్ణ భయపడుతున్నావా అని ముకుంద అంటుంది. నాకు కాదు నీ భయమే నీతో ఇలా మాట్లాడిస్తుంది అని కృష్ణ అంటుంది. భవాని అత్తయ్య అండ్ నాకుంది. మురారి కి నువ్వెవరో గుర్తులేదు. నేను మురారిని ప్రేమిస్తున్నానని డైరెక్ట్ గా భవాని అత్తయ్యతో ఎప్పుడో చెప్పేసాను. ఆదర్శ్ రాకుడదని కమాండర్ డ్రామాలో ఎప్పుడో చెప్పేసాను అయినా ఎందుకు నిన్ను బయటికి పంపించేసింది. నన్ను లోపల ఉంచింది అని ముకుందా కృష్ణను ప్రశ్నిస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో కృష్ణ గెస్ట్ హౌస్ లో తన రూమ్ అంతా బాగు చేసుకుంటూ ఉంటుంది. అక్కడికి వచ్చి నీ శేష జీవితం అంతా ఇలా పనిచేసుకుంటూ గడిపేయాలని అనుకుంటున్నాను అని కృష్ణతో ముకుందా అంటుంది నేను ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ ఇంట్లోకి వచ్చి తీరుతాను అని అంటుంది కృష్ణ. మీ అమ్మగారు లేరా అని మురారి అడగగానే కృష్ణ తన ఫేస్ మురారికే చూపిస్తుంది. అప్పుడే అక్కడి నుంచి కృష్ణ పడిపోతుండగా మురారి వెళ్లి పట్టుకుంటాడు. ఇక దగ్గరైన మురారి కృష్ణ లని ముకుంద షాక్ అవుతుంది. మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం.