Krishna Mukunda Murari: కృష్ణ ముకుందా చాలా స్పీడ్ తనకి పొగరు ఎక్కువ. ఈగో ఎక్కువ. నాకు ఒకటి చెప్పనా.. నువ్వు మురారి ఇద్దరూ మా అందరి ముందు ఫ్రెండ్లీగా చాలా క్లోజ్ గా ఉంటారు కదా అలా ఉండకండి అని మధు కృష్ణ కి సలహా ఇస్తాడు. ఆ మాటకి కృష్ణ మాడిపోతుంది. ప్లీజ్ కృష్ణ నేను చెప్పేది ఒక్కసారి ఆలోచించు అని మధు అంటాడు ముకుంద కి ఎదురు వెళ్లేకుండా ఉంటే మనకే సేఫ్ అది ఎదురు వెళ్ళామనుకో తను ఆ ఫ్రస్టేషన్లో ఇంకా రెచ్చిపోయి ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది అని అనగానే అవును మధు నువ్వు చెప్పింది కూడా నిజమే ముకుందని డైరెక్టుగా దెబ్బకొట్టకుండా ఇన్ డైరెక్ట్ గా దెబ్బ కొట్టమని చెబుతున్నావు ఈ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుంది. ఇకనుంచి ఇదే ప్లాన్లో ఉంటాను అని కృష్ణ అంటుంది.

కృష్ణ పూలు కట్టుకుంటూ ఏసిపి సార్ తన మనసులో ఉన్న మాట బయటకు అనుకుంటూ ఉండగా.. ముకుంద వచ్చి మీ కాపురం మూడున్నళ్ళ ముచ్చటే అని అంటుంది. కృష్ణ ముకుంద ఇద్దరు వారి వారి మనసులోని మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. కృష్ణ కాన్ఫిడెంట్ గా పతి భక్తి కోసం యముడితో పోరాడిన సతీసావిత్రి గురించి నాకు తెలుసు కానీ పరాయి భర్త కోసం ఇలా వెంపర్లాడుతున్న నిన్ను ఏ పతివ్రతతో పోల్చాలో నాకు అర్థం కావడం లేదు అని.. పరాయి భర్తని ఎలా కోరుకుంటున్నావని ముకుంద కి చివాట్లు పెడుతుంది. ఆదర్శ్ తో నీ లైఫ్ ఊహించుకుంటూ ఉండు బాగుంటుంది అని సలహా ఇస్తుంది. అది ఎప్పటికీ జరగదు అని ముకుందా అంటుంది. అది జరిపించేది నేనే అని అంటుంది కృష్ణ. లాస్ట్ పంచ్ నాది అయితే ఆ కిక్కే వేరు అని కృష్ణ అంటుంది.

కృష్ణ మల్లెపూలు పెట్టుకుని గదిలోకి వెళ్తుంది. మురారి కృష్ణ మల్లెపూలు పెట్టుకోవడం చూసి నవ్వుతాడు. అంతేకాకుండా డాక్టర్లు కూడా ఈ మధ్య మల్లెపూలు పెట్టుకుంటున్నారా అని వెటకారంగా మాట్లాడతాడు. ఆ మాటకి కృష్ణ ఏ ఆడవాళ్లు మల్లెపూలు పెట్టుకోకూడదా డాక్టర్లు అయినంత మాత్రాన డాక్టర్స్ లో ఆడవాళ్లు ఉండరా ఆడవాళ్ళైన డాక్టర్లు మల్లెపూలు పెట్టుకోకూడదా అని మురారితో అంటుంది. ఇక కృష్ణ ఆ మల్లెపూల మాలని ముందుకి వెనక్కి వేసుకుంటూ ఉండగా సరిగ్గా పెట్టుకోవచ్చు కదా అని మురారి అంటే.. కృష్ణ ఆ మల్లెపూల మాలనే వరారికి ఇచ్చి అయితే మీరే పెట్టండి అని వెనక్కి తిరిగి సిగ్గుపడుతూ నిల్చుంటుంది. మురారి ఆ మల్లెపూలను మంచం మీద వేసి నాలుగు మడతలు వేసి కృష్ణ తలలో పెడతాడు. పరవాలేదు బానే మల్లెపూలు పడుతున్నారు. ఇందాక తల తుడిచారు ఇప్పుడు మల్లెపూలు పెడుతున్నారు. బానే ప్రాక్టీస్ అయినట్టున్నారు అంటే దీనికి ప్రాక్టీస్ కూడా అవసరమా అని మురారి అంటాడు.

భవానికి ఒక ఫోన్ కాల్ వస్తుంది అక్క నేను అని ఊర్లో కట్టెలు కొట్టాను. పుల్లలు విరిచాను అని మాటలు వినిపిస్తాయి . ఆ మాటలు కృష్ణతో చెప్పగానే ఆయన తన చిన్నాన్న అని కృష్ణ చెబుతుంది. ఎప్u చిన్నప్పుడు ఇంట్లో నుంచి అలిగి వెళ్లిపోయిన మా చిన్నాన్న ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు అని కృష్ణ చెబుతుంది ఆనందంతో సంబరపడిపోతూ ఉంటుంది.

ఇక రేపటి ఎపిసోడ్ లో ప్రభాకర్ కృష్ణ కి చిన్నాన్న రోలు ఎంట్రీ ఇస్తాడు వాళ్ల చిన్నాన్న చూసి కృష్ణ ఆప్యాయంగా దగ్గరికి వెళ్తుంది కృష్ణ ఇంట్లో వాళ్ళందరినీ వాళ్ళ చిన్నాన్నకి పరిచయం వాళ్ల చిన్నాన్న చూసి కృష్ణ ఆప్యాయంగా దగ్గరికి వెళ్తుంది కృష్ణ ఇంట్లో వాళ్ళందరినీ వాళ్ళ చిన్నాన్నకి పరిచయం చేస్తుంది ఏసీబీ సార్ నా భర్త అని కృష్ణ వాళ్ళ చిన్నాన్నకి పరిచయం చేస్తుంది.

మా అన్న చాలా అదృష్టవంతుడు కొడుకులాంటి వాడిని అల్లుడుగా పొందాడు అని అంటాడు. ఆ తర్వాత ఇంట్లో అందర్నీ జంటలు జంటలుగా చూసిన ఆయన ఈ అమ్మాయి ఏంటి ఒక్కతిగానే ఉంది. ఈ బిడ్డ భర్త ఏది అని అడగగానే షాక్ అవుతుంది. ఇక తన కి మంచి రోజులు ముగిసిపోయి గడ్డుకాలం మొదలైనట్టుగా సీన్ కనిపిస్తుంది ఏం జరుగుతుందో. తరువాయి భాగంలో చూద్దాం.