Krishna Mukunda Murari: భవానీ దేవి కృష్ణతో ఇప్పుడు మీరిద్దరూ కలిసి బయటికి వెళ్లడం కుదరదు మురారి కి పనుంది అని అంటుంది. ఈ ముకుంద ఏమన్నా మధ్యలో దూరి అత్తయ్య చేత ఇలా చెప్పిస్తుందా అని అనుమాన పడుతుంది కృష్ణ. ముందు అసలు పని ఏంటో చూద్దాము అని అనుకుంటుంది ఏంటి అత్తయ్య అని అడుగుతుంది. భవానీ దేవి మురారితో ఆదర్శ్ గురించి సైనిక్ పురి లో ఉన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నారు. నువ్వు అక్కడికి వెళ్ళు అని అంటుంది. నన్ను కూడా రమ్మన్నారు కానీ ఇంట్లో గెస్ట్లు ఉన్నారు కదా నేను వస్తే బాగోదు నువ్వు వెళ్లి ఆ డీటెయిల్స్ తీసుకొని రా అని అంటుంది. కృష్ణ వెళ్దామని అనుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్ తింగరి పిల్ల ఇంట్లో మీ వాళ్ళని పెట్టుకొని నువ్వు ఇక్కడే ఉండు తను వెళ్లొస్తాడు అని ఆపుతుంది.

మురారి వాళ్ళ పెద్దమ్మ చెప్పినట్టు ఆదర్శ్ ఆచూకీ కనుక్కోవడం కోసం వాళ్ల పెద్దమ్మ చెప్పిన సైనిక్పురి బయలుదేరుతాడు. మనసులో మాత్రం కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కృష్ణ నాతో పాటు బయటకు వద్దామని అనుకుంది కానీ, ఇలా మధ్యలో ఆగిపోవాల్సి వస్తుందని అనుకోలేదు. కృష్ణ చాలా బాధపడుతూ ఉంటుంది. ఎలాగూ వాళ్ళ చిన్నాన్న వాళ్ళు వచ్చారుగా వాళ్లతో కాలం గడుపుతుంది అని అనుకుంటూ బైక్ డ్రైవ్ చేస్తూ ఉండగా.. సడన్గా ముకుంద వచ్చి తన బైక్ కి అడ్డుగా నిలబడుతుంది. మురారి ఆదర్శ ఆచూకీ తెలిసింది కదా, నన్ను కూడా అక్కడికి తీసుకోవాలని ముకుందా అడుగుతుంది. లేదు అదంతా కుదరదు అని మురారి వెళ్ళిపోబోతుండగా.. కావాలని తన బైక్ కీస్ తీసుకొని వెంటనే భవానీకి కాల్ చేస్తుంది. అత్తయ్య ఆదర్శ్ తిరిగి వస్తాడని తెలిసి చాలా సంతోషంగా గుడికి వెళ్లి వస్తుండగా మురారి కనిపించాడు. తను సైనిక్పురి వెళ్తున్నాడు కదా , తనతో పాటు కూడా నేను వస్తానంటే తీసుకు వెళ్ళటం లేదు మీరైనా చెప్పండి అని అంటుంది . సరే మురారి కి ఫోన్ ఇవ్వు అని భవాని మురారితో తనని కూడా తీసుకువెళ్ళు, రాడనుకుంటున్నా ఆదర్శ్ తిరిగి వస్తున్నాడు అంటే చాలా సంతోషపడుతుంది. తనని కూడా నీతో పాటు సైనిక్పురి తీసుకు వెళ్ళమని చెబుతుంది. తప్పని పరిస్థితుల్లో ముకుందని తీసుకొని మురారి మేజర్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు.

మురారి భవని చెప్పిన అడ్రెస్స్ కి వెళ్ళగానే అక్కడ ఒక మేజర్ వస్తారు. అతనితో మాట్లాడిన మాటలు ప్రకారం ఆదర్శ్ ఎప్పటికీ ఇంటికి తిరిగి రాలేడని, తను జనాలతో ఎవ్వరితో మాట్లాడటం లేదని, ఎవ్వరితో కలవాలని అనుకోవడం లేదని ఆయన చెప్పారు. తన గురించి ఆలోచించక పోవడం మంచిది అన్నట్టుగా ఆయన చెబుతాడు. ఇక మురారి ఒక్కసారి తనతో మాట్లాడతాను అని చెబుతాడు. కానీ ఆదర్శ్ ఎవ్వరితో మాట్లాడటం, ఇష్టం లేదని తనని కలవాలి అని ఆలోచనలే మానుకోమని చెబుతాడు. మురారి అక్కడ నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత ముకుందా అతనికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతుంది. థాంక్యూ అంకుల్ నాకోసం ఈ హెల్ప్ చేసినందుకు అంజలిని అడిగానని చెప్పండి. నాకు ఇలా హెల్ప్ చేసినందుకు మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను మా ప్రేమను అర్థం చేసుకున్నందుకు థాంక్యూ అని చెబుతుంది. మొత్తానికి ఇదంతా ముకుందా చేసిన డ్రామా అని అర్థమవుతుంది.

ముకుంద హెడేక్ గా ఉందని కాఫీ తాగుదామంటే మురారి అటుగా వెళుతున్న ఓ కాఫీ షాప్ దగ్గర బైక్ ఆపుతాడు. ముకుందా మురారి ఇద్దరూ కాఫీ తాగుతూ ఉండగా అటుగా లారీలో వెళ్తున్న ప్రభాకర్ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. ముకుందా ఎందుకు ఆదర్శ్ గురించి ప్రస్తావన తీసుకొస్తే తన భార్య మీద కోప్పడిందో అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు మురారితో ఎందుకు కలిసి ఉందా అని మరోసారి ఆలోచనలో పడతాడు. మొత్తానికి ముకుంద గురించి ఆలోచించాలని ప్రభాకర్ అనుకుంటాడు. ఇక మురారితో ఒంటరిగా గడిపే క్షణాలు రావడంతో ఈ క్షణాలను ఎలాగైనా సరే తనకు అనుకూలంగా మార్చుకోవాలని ముకుందా అనుకుంటుంది.

మరోవైపు కృష్ణ ముకుంద కనిపించడం లేదని ఆలోచిస్తూ ఉంటుంది. ఇల్లంతా వెతికినా కూడా తను కనపడదు ఒకవేళ సైనిక్ పూరి మురారి వెళ్లడం తను చేసిన కుట్ర అని అనుకుంటుంది. మురారితో పాటు ఒకవేళ ముకుందా వెళ్లిందా లేదంటే అక్కడికి వెళ్లిన తరువాత ఏమైనా చేస్తుందని కృష్ణ ఆలోచనలో పడుతుంది. ఇక భవానిని ముకుందా ఎక్కడకు వెళ్ళింది అని అడగకుండా మిగతా ప్రశ్నలన్ని అడుగుతూ ఉంటుంది.

రేపటి ఎపిసోడ్లో ప్రభాకర్ వినాయకుడిని తీసుకొని బాండలి ముగించుకుంటూ ఇంటికి తీసుకువస్తాడు. ఈరోజు పండగ కదా ధూంధాం చేద్దామనుకుంటున్నాను అంటాడు ప్రభాకర్ భవానీ దేవి సరే అంటుంది ఇక ప్రభాకర్ ముకుందతో అందరూ ఉన్నారు కదా మా పూజకి మీ నాన్న లేరు కదా మీ నాన్నని పిలువు అని అంటాడు. నేను అస్సలు పిలవను అని అంటుంది ముకుంద కోపంగా నీ చాటే పిలిచేలా చేస్తాను అని అందరి ముందు అంటుంది కృష్ణ.