Krishna Mukunda Murari: కృష్ణ ఏమైంది ఏం చెప్పాలనుకుంటున్నావ్ త్వరగా చెప్పు అని మురారి అడుగుతాడు. అదేంటంటే ఏసీబీ సార్ అని కృష్ణ చెప్పకుండా కంగారు పడుతూ ఉంటుంది. చెప్పు కృష్ణ అసలు ఏమైంది అంటే ఇందాక పూలుకోవడానికి మేడ మీదకు వెళ్లాను. అక్కడ పూలు కోస్తుండగా ఒకటి తెగి కిందపడిపోయింది సరే కదా అని దాన్ని తీసుకుందామని చెప్పి వంగితే.. అక్కడ నీటిలో చవితి చంద్రుని చూసేశాను అని అంటుంది. ఓరిని చూసి చంద్రుడుని చూసినందుకా అని మురారి అనుకొన్నాడు. ఎక్కడ ముకుందా తనకు నిజం చెప్పేసిందేమోనని కంగారుపడుతూ ఉంటే ఈ విషయం తెలిసి ఊపిరి పీల్చుకుంటాడు.

కృష్ణ తో చవితి చంద్రుని చూస్తే ఏం కాదు అని మురారి అంటాడు. లేదు లేదు ఎన్ని నీలాప నిందలు పడాల్సి వస్తుందో అని కృష్ణ కంగారుపడుతూ ఉంటుంది. నువ్వు తింగరి దానివి అని మురారి కృష్ణకు దగ్గరగా వస్తాడు. నేనేమీ తింగరి గానీ కాదు మీరే ఏబిసిడిలో అబ్బాయి అని కృష్ణ ఇంకాస్త క్లోజ్ గా మురారి దగ్గరకు వెళ్తుంది. కృష్ణ మురారిలు ఇద్దరు క్లోజ్ గా ఉండడం చూసినా మురారి కావాలని వాళ్ళ గది దగ్గరకు వస్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ క్లోజ్ అవ్వడం చూసి మురారి అని పెద్దగా పిలుస్తుంది ముకుంద. భార్యభర్తలు ఉన్న గదిలోకి వచ్చే ముందు గది తలుపు కొట్టాలన్న మినిమం కామెంట్ సెన్స్ లేదా అని కృష్ణ అంటుంది. అయినా ఇంట్లో పూజ జరుగుతుంటే మీరు ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని ముకుందా అడుగుతుంది. మేమిద్దరం భార్యాభర్తలం మా గురించి మీకెందుకు ఏమైనా చేస్తామని కృష్ణ అంటుంది. మురారి నిన్ను చిన్న పిలుస్తున్నారు. నువ్వు త్వరగా రా అని ముకుందా అంటుంది. నువ్వు వెళ్ళు మేమిద్దరం వస్తామని కృష్ణ విసురుగ్గా సమాధానం చెబుతుంది.

ముకుంద నీకోసం అంతా ఎదురు చూస్తున్నారు కిందకి రా అని మురారి ముకుంద ను పిలుస్తాడు. వాళ్లతో నాకెందుకు మురారి. ఇంట్లో ఇన్ని అవమానాలు పడుతున్న ఎవరి కోసం ఉంటున్నానో తెలుసా మురారి సిగ్గు విడిచి చెబుతున్నాను. నీకోసం మురారి అని ముకుందా చెపుతుంది. ఆ మాటలను అటుగా వెళుతున్న ప్రభాకర్ వింటాడు. ఇక్కడ నా స్థానం కోసం మురారి అని మురారి గుండెల పైన చేయి వేసి చెబుతుంది ముకుంద. మురారి ఆ చేతిని తీసేసాడు. మురారి ఆ కృష్ణ నన్ను అన్ని మాటలు అంటుంటే నిన్ను ఆరాధించే ప్రేమించే నన్ను ఒక్క మాట కూడా అనొద్దు అని చెప్పలేకపోయావు అని ముకుంద అడుగుతుంది. నేను నీకు అంత కాని దానిని అయిపోయానా అని ముకుందా అనగానే.. అవును ముకుందా దానివే అయిపోయావు అని మురారి అంటాడు. కానీ మా కుటుంబానికి కావలసిన దానివి. అది మాత్రం గుర్తుపెట్టుకో భార్యాభర్తల మధ్యలోకి రావడం ఎంతవరకు కరెక్టో ఆలోచించావా అని మురారి ముకుందని ప్రశ్నిస్తాడు. నేనుండగా నీ భార్య స్థానంలో ఎవ్వరు ఉండకూడదు అని అంటే.. నీ భార్యగా ఆదర్శ్ గుండెల్లో స్థానం ఉంది అని మురారి అనగానే స్టాపిట్ మురారి అని ముకుందా పెద్దగా అరుస్తుంది.

నేను ప్రేమ గురించి మాట్లాడితే నువ్వు ట్రాష్ అంతా మాట్లాడతావ్ ఏంటి ముకుందా మురారితో అంటుంది. నేను ఆదర్శ్ గురించి మాట్లాడుతుంటే చెత్త మాట్లాడుతున్నాను అని అంటావేంటి అని మురారి ముకుందని అడుగుతాడు. ముకుంద అనవసరమైన రచ్చ చేయకుండా కిందకు రా అని మురారి అంటాడు. సరే నువ్వు చెప్పావు కాబట్టి వస్తున్నాను అని ముకుంద అంటుంది.

మురారి మెట్లు మీద నుంచి దిగుతూ ఉండగా ముకుందా ఎక్కడ అని అడుగుతే తన గదిలో ఉంది వస్తూ ఉంటుంది అని అంటాడు. సరిగ్గా అప్పుడే మురారి పక్కన వచ్చి ముకుందా నిలబడుతుంది. అల్లుడు మీ మామ ఎక్కడ అని శకుంతల అడగగానే ఇందాకే కింద ఉన్నాడు కదా అత్తయ్య అంటే.. మీ వెనకమాలే వచ్చాడు కదా అని ఆమె చెప్పగానే.. మామయ్య ముకుందతో నేను మాట్లాడడం చూసాడా అవన్నీ వినే చేసాడా అని అనుకుంటాడు. అప్పుడే అల్లుడు అని ప్రభాకర్ ఎంట్రీ ఇస్తాడు కోపంగా.. మావయ్య మూడ్ చూస్తుంటే మా ఇద్దరినీ చూసేసి ఉంటాడు. ఏం చేయాలి, ఎలా కన్విన్స్ చేయాలి అనుకుంటూ ఉండగా.. అల్లుడు తో ఓ ముచ్చట ఉంది అని మురారి నీ ప్రభాకర్ పక్కకు తీసుకు వెళ్తాడు. ఇక ఈ విషయాన్ని ఎలా టర్న్ తిప్పుతాడు అనేది తరువాయి భాగంలో చూద్దాం.

ఇక రేపటి ఎపిసోడ్ లో మురారి ప్రభాకర్ లాగా డ్రెస్ చేసుకుని వస్తాడు. మాస్ లుక్ లో మురారి అదిరిపోయాడు. డీజె టిల్లు అంటూ కృష్ణతో కలిసి స్టెప్పులు వేస్తాడు. ఇప్పుడు లడ్డు వేలం పాట పాడదామని అనగానే కృష్ణ లడ్డు వేలం పాటని స్టార్ట్ చేస్తుంది ముందుగా నా పాట 50 వేలు అని కృష్ణ మొదలు పెడుతుంది. అయితే నా పాట లక్ష అని ముకుందా అంటుంది. అలా పెంచుకుంటూ కృష్ణ ముకుందా ఇద్దరూ మూడు నుంచి 3:50 లక్షలు, మూడున్నర నుంచి ఆరు లక్షలు చెబుతుంది ముకుందా ఒకేసారి అరు లక్షలు అనేసరికి ఒక్కసారిగా అందరూ బిత్తరపోయి ముకుంద వైపు చూస్తారు. ఇక ఈ లడ్డు వేలం పాటలో లడ్డుని ముకుందా దక్కించుకుందా, లేదంటే కృష్ణ సొంతం చేసుకుందా అనేది తర్వాయి భాగంలో చూద్దాం.