NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

Krishna Mukunda Murari Today Episode April 24 2024 Episode 453 highlights

Krishna Mukunda Murari April 24 2024 Episode 453:  కృష్ణ హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తనతో ఎలా నిజం చెప్పాలని మురారి బాధపడుతూ ఉంటాడు అదంతా గమనించిన ఇంట్లో వాళ్ళు తనకు ఏదో జరిగిపోయిందని నువ్వు ఎందుకు అలా అంటున్నావో తనకి నార్మల్ అయిపోయింది కదా కడుపులో నొప్పి క్లియర్ చేసి పంపించారు కదా డాక్టర్స్ అని అంటారు. ఇంట్లో వాళ్లకి నిజం చెప్పలేక ఆ టి కృష్ణకి నిజం చెప్పలేక మురారి బాధపడుతూ ఉంటాడు అదంతా చూసిన ముకుందా ఈ బాధంతా నీకు కొన్ని రోజులే మురారి తర్వాత ఈ ముకుంద నీకు జీవితాంతం సంతోషాన్నిస్తుంది అని అనుకుంటుంది మనసులో, మురారి కృష్ణతో నిజం చెప్పలేక సతమతమవుతూ ఉంటాడు కృష్ణ ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 24 2024 Episode 453 highlights
Krishna Mukunda Murari Today Episode April 24 2024 Episode 453 highlights

రేవతి భవాని దగ్గరికి వచ్చి ఆదర్శ గురించి ఏం ఆలోచించావు అక్క అని అడుగుతుంది. అసలు ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఏంటి నువ్వు అడిగేది ఏంటిది అని అరుస్తుంది భవాని అది కాదక్కా అని రేవతి అంటే ఏది కాదు, అసలు కృష్ణకేం జరిగింది ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది ఈ టైంలో వచ్చిన వాదష్ గురించి అడుగుతున్నావా అసలు మాత్రమే మాట్లాడుతున్నావా అని అంటే వెంటనే రేవతి నేను అడగడం కాదు అక్క వాడే వచ్చి నన్ను అడిగాడు కృష్ణకు బాగలేదని నేను బాధపడుతూ ఉంటే నా దగ్గరికి వచ్చి కృష్ణకు ఎలా ఉందని ఒక్క మాట కూడా అడగకుండా నాకు గురించి మా అమ్మకు చెప్పావా లేదా అని అడిగాడు. నేనేమీ మాట్లాడకపోతే నా గురించి పట్టించుకునే వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరని మళ్ళీ గొడవ చేస్తాడని నేను చెప్పాను అమ్మని అడిగి మళ్ళీ చెప్తాను అని చెప్పానని రేవతి భవానికి బెదిరిస్తుంది దాంతో భవాని ఒక్కసారి ఆశ్చర్య పోతుంది అదేంటి కృష్ణ అంటే తనకి ఎందుకు అంత కోపం ఇప్పుడే కృష్ణకు బాగా లేనప్పుడే తను ఇంత కోపం చూపించడానికి కారణమేంటి అయినా మురారితో మాట్లాడి కృష్ణతో మాట్లాడకపోవడమేంటి అని భవాని అంటుంది దానికి రేవతి ఏం అక్క నాకు అది తెలియదు ఇది ఇద్దరి మీద కోపం ఉండాలి లేదంటే ఇద్దరు మీద కోపం పోవాలి కానీ మురారి మీద కోపం పోయి కృష్ణ మీద బాగా కోపం పెంచుకున్నాడు.

Krishna Mukunda Murari Today Episode April 24 2024 Episode 453 highlights
Krishna Mukunda Murari Today Episode April 24 2024 Episode 453 highlights

ఇక భవాని అయితే ఇప్పుడల్లా ఆగస్టు పెళ్లి గురించి మాట్లాడేది లేదు వంద అసలు కృష్ణ మీద ఎందుకు అంత కోపం పెంచుకున్నాడో తెలుసుకోవాలి కదా అని అంటుంది. కృష్ణ అంటే తనకు ఎందుకు ఇష్టం లేదు ఆలోచించాలి కదా అని అంటుంది. ఒకప్పుడు ఇలానే ప్రేమించానని ముకుందని పెళ్లి చేసుకున్నాడు అసలు ముకుంద మీద కోపం ఉండాలి అలాంటిది ఇప్పుడు కృష్ణ మీద కోపం ఎందుకు, కృష్ణయ్య నేరం చేసిందని అని అంటుంది ఏమో కానీ అంటుంది రేవతి సరే నేను చూసుకుంటాను ముందు వాడి పెళ్లి గురించి కాదు వాడి కృష్ణ మీద ఎందుకు కోపం ఉందో తెలిసిన తర్వాత అప్పుడు పెళ్లి గురించి మాట్లాడుకుందాం వెళ్ళు అని అంటుంది రేవతిని భవాని చెప్పిన మాటలు విని రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు మురారి బాధగా దేవుడి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఎప్పుడు లెండి దేవుడి గదిలోకి మురారి రావడం ముకుంద చూస్తుంది వెనకాలే వచ్చి పాపం మురారి తను ఎంతో బాధపడుతున్నాడు కానీ ఆ బాధని నేనైతే తీర్చలేను కదా అని మనసులో అనుకొని, మురారి వైపు చూస్తుంది మురారి ముకుందని చూసి మీరేంటండి ఇక్కడ అని అడుగుతాడు. మీకు ఎలాగైతే పెద్ద ప్రాబ్లం వచ్చి దండం పెట్టుకోవడానికి వచ్చారు. నేను అలానే ఉంటుంది నాది ప్రతి ప్రాబ్లమ్ అని మీకు ఎలా తెలుసు అంటే నేనైతే అందుకే వచ్చాను మీరు ఎందుకు వచ్చారు నాకు తెలియదు అని అంటుంది. ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు మురారి మురారి అడగకపోయినా ముకుందే కావాలని నాకు పెద్ద ప్రాబ్లం ఉందండి అని ముందే అంటుంది. వెంటనే మురారి మనసులో ఇదేదో నాకు సంబంధించిన దానికి మళ్ళీ ఉంది ఒకసారి కనుక్కుందాం అని అనుకుంటాడు.

Krishna Mukunda Murari Today Episode April 24 2024 Episode 453 highlights
Krishna Mukunda Murari Today Episode April 24 2024 Episode 453 highlights

ఇక ముకుందా నాకొక ఫ్రెండ్ ఉంది తనకి క్యాన్సర్ ఉంది తన కొన్ని రోజుల్లో చనిపోతుంది ఆ విషయం నాకు మాత్రమే తెలుసు, ఇప్పుడు ఆ విషయాన్ని నేను దానితో చెప్పకుండా తనకి దూరంగా ఉంటున్నాను అని అంటుంది. దేవుడికి దండం పెట్టుకొని తను ఎక్కువ రోజులు బతకాలని అనుకుంటున్నాను అని అంటుంది దాంతో మురారి అదేంటి మీ ఫ్రెండ్ కి క్యాన్సర్ అయితే మీ దగ్గర ఉండి చూసుకోవాలి కానీ ఇలా దూరం పెట్టడం ఏంటి అని అడుగుతాడు. వెంటనే ముకుంద వచ్చాడు దారిలోకి అని మనసులో అనుకుంటుంది. అదేంటి మురారి గారు ఇప్పుడు మన ఫ్రెండ్ కి బాగా లేకపోతే తనతో పాటు మనం ఉంటే ఆ నిజం తన దగ్గర చెప్పేస్తాము అదే తనకి దూరంగా ఉంటే ఆ నిజం మనం చెప్పాల్సిన అవసరం ఉండదు కదా అని అంటుంది. నిజం తనకు తెలియదు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ రోజులు తన బతికే ఛాన్స్ ఉంటుంది. అలాగని నిజం చెప్పి తను ఎక్కువ బాధ పెట్టి ముందే చనిపోయేలా చేయలేము కదా అని అంటుంది. మీరేమంటారు ఇప్పుడు మీరే నా పరిస్థితిలో ఉంటే అలానే చేస్తారు కదా అయినా మనం మనకు నచ్చిన వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి కానీ దూరంగా ఉంటే మాత్రం తప్పేముంది అని అంటుంది. ఆ మాటలకు ఒకసారి మురారి ఆలోచనలో పడతాడు. వెంటనే ముందు మనసులో ఆలోచనలో పడ్డాడు అంటే కచ్చితంగా ఆచరించి తీరుతాడు ఇప్పుడు చూడు కృష్ణ నీ నుండి మురారిని ఎలా దూరం చేస్తాను అని మనసులో అనుకుంటుంది. నేను చేస్తుంది కరెక్టే కదా మురారి గారు అని అడుగుతుంది మురారి ఏం సమాధానం చెప్పకుండా ఉంటాడు మిమ్మల్ని అడుగుతుంది నేను మా ఫ్రెండ్ దూరం పెట్టడం కరెక్టే కదా అని అంటుంది ఒక్కొక్కసారి మనకి కావాల్సిన వాళ్ళని దూరం పెట్టిన అందులో తప్పేం లేదు అది వాళ్ళ మంచి కోసమే అయితే అని అంటాడు మురారి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కచ్చితంగా కృష్ణ దూరం పెడుతున్నాడు అన్న విషయం ముకుందకు అర్థమవుతుంది.

Krishna Mukunda Murari Today Episode April 24 2024 Episode 453 highlights
Krishna Mukunda Murari Today Episode April 24 2024 Episode 453 highlights

ఇక మరోవైపు కృష్ణ బాధగా కూర్చుని మురారి ఎందుకు ఏడుస్తున్నాడు, నిన్న నైట్ నేను అడిగిన తర్వాత ఏడవట్లేదు అని ఎందుకు అబద్దం చెప్పాడు అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి రేవతి పాలు తీసుకొని వస్తుంది. ఏంటి కృష్ణ అలా ఉన్నావు అని అడిగితే ఏం లేదు అత్తయ్య నా దగ్గర ఇప్పుడు పెద్ద అత్తయ్య కోరిక నెరవేర్చడం మాత్రమే ఉంది నాకైతే ఒంట్లో బాగానే ఉంది అని ఉంటుంది ఇక నేను ఎట్లాగైనా ఆవిడ కోరిక నెరవేర్చాలి. అని కృష్ణ మాట్లాడుతూ ఉండగా ముకుంద వచ్చి రెండు బొమ్మలు తీసుకొచ్చి ఇస్తుంది. నువ్వు కూడా ఇలాంటి పిల్లల్ని కని మీ అత్తగారికి గిఫ్ట్ గా ఇవ్వాలి అని అంటే దానికి కృష్ణ సిగ్గు పడుతుంది ఇక ముకుంద మనసులో నేను నీకు బొమ్మలు ఇచ్చింది నిన్నేదో సంతోష పెట్టడానికి కాదు కృష్ణ రేపు నీకు శాశ్వతంగా పిల్లలు పుట్టడం తెలిసిన తర్వాత ఇదే బొమ్మలు చూసుకొని జీవితాంతం ఏడవడానికి అని అంటుంది. ముకుంద వెనకాలే ఆదర్శ్ కూడా ఉంటాడు. ఆదర్శ్ ముకుంద మాటలు వింటూ అదేంటి కృష్ణ అంటే అసలు ముకుందకు ఇష్టం ఉండదు కదా అలాంటిది తనకు బాగా లేకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. ఇప్పుడేమో బొమ్మలు తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తుంది ఏదైనా ఇంతేలే తను చెడు చేసిన వాళ్లకు కూడా మంచి చేయాలనుకుంటుంది అదే తన మనస్తత్వం ఆ మనస్తత్వం అని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఈ నిజం ఎలాగైనా తనకి చెప్పేయాలి అని అనుకుంటాడు.

Krishna Mukunda Murari Today Episode April 24 2024 Episode 453 highlights
Krishna Mukunda Murari Today Episode April 24 2024 Episode 453 highlights

ఇక మరోవైపు కృష్ణ కి దూరంగా ఉండాలని మురారి ఫిక్స్ అవుతాడు ఆ విషయాన్ని పరిమళ దగ్గరికి వెళ్లి చెబుతారు. పరిమళ హాస్పిటల్ లో ఉన్నప్పుడు మురారి వెళ్తాడు నీకు ఒక విషయం చెప్పాలి నాకే చనిపోవాలని ఉంది అంటే చనిపో మురారి అని అంటుంది. అదేంటి అలా అన్నావు అంటే మరి అది ఇంకా ఏమనాలి నువ్వు సమస్య వచ్చినప్పుడు పారిపోతాను అంటే చనిపోతాను అంటే నేనేం చేయాలి అని అంటుంది నేను అమెరికా వెళ్తున్నాను మళ్ళీ రెండు వారాలు దాకా రాను ఈ లోపే చనిపో అని అంటుంది. పిల్లలు కనకపోవడం పెద్ద ప్రాబ్లం ఏమి కాదు మురారి చాలామంది పిల్లలుతన లేని తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ చనిపోతున్నారా ఏంటి అయినా ధైర్యంగా కృష్ణకు నిజం చెప్పాలి కానీ ఇదేంటి అని అంటుంది నేను కృష్ణతో మాట్లాడలేకపోతున్నాను తనతో ఉండలేకపోతున్నాను తన దూరం పెడుతున్నాను అని అంటే ఇవాళ కాకపోతే రేపైనా నిజం చెప్పాలి మన శరీరాన్ని గాయమైనప్పుడు అది ట్రీట్మెంట్ చేస్తేనే కదా తగ్గుతుంది అని తెలిసేది అంతేకానీ చెప్పకుండా దాచిపెట్టి ఎంత కాలం నీ ఒక్కడివే బరువు వస్తావు ముందు ఇంట్లో వాళ్లకు చెప్పు లేదంటే కృష్ణకు చెప్పు ఏదో ఒకటి చేసి రెండు రోజుల్లో కృష్ణ ఇక్కడ తీసుకురా అతని కడుపులో గడ్డం ఉందని చెప్పి ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేస్తాను అని పరిమళ చెప్తుంది దానితో మురారి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన మురారి దగ్గరికి కృష్ణ వెళుతుంది ఈ బొమ్మలు చూపించి ఈ బొమ్మలు చూడండి ఎసిపి సార్ నా వైపు తిరగండి అంటుంది కానీ మురారి మతం సైలెంట్ గా ఉంటాడు ఏంటి ఎంత సైలెంట్ గా ఉంటున్నారు పెద్దదైతే కోరిక నెరవేర్చాలని నేను అంటుంటే మీరేం మాట్లాడరు ఏంటి అని అంటుంది. ఈ బొమ్మలు నాకు ఎవరు ఇచ్చారో తెలుసా మీరా ఇచ్చింది తను కూడా నేను పెద్దదైతే కోరిక నెరవేర్చాలి అని అనుకుంటుంది అని అంటుంది. ఇక మురారి ఏమి చెప్పలేక సైలెంట్ గా ఉంటాడు ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్లో ఆదర్శ్ ముకుంద దగ్గరికి వస్తాడు మీతో ఎప్పటి నుంచి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను చెప్పమంటావా అని అంటాడు. దానికి ముందు చాలా సంతోషంగా చెప్పండి ఏదైనా విషయం నా దగ్గర దాచి పెట్టాల్సిన అవసరం లేదు అని అంటుంది. వెంటనే ఆదర్శ్ కొని గులాబీలు తీసుకొని, ముకుందకి ప్రపోజ్ చేస్తాడు ఐ లవ్ యు ముకుందా నీకు ఇష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. అప్పుడే అటువైపుకి వస్తున్న కృష్ణ మురళి ఇద్దరు చూస్తారు వెంటనే కృష్ణ కోపంతో ఆ గులాబీలు ఆదర్శ్ చేతిలో నుంచి లాక్కొని నేలకేసి కొడుతుంది దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella