NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

Krishna Mukunda Murari Today Episode April 26 2024 Episode 454 highlights

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: కృష్ణ కి పిల్లలు పుట్టకుండా చేయాలన్న ముకుంద ప్లాన్ సక్సెస్ అయింది. ఇంట్లో ఎవరికీ తెలియకుండా కృష్ణకి పానకంలో టాబ్లెట్ కలిపి ఇచ్చి గర్భసంచికి ప్రాబ్లం వచ్చేలా చేస్తుంది ముకుంద దాంతో కృష్ణకి కడుపులో నొప్పి రావడంతో హాస్పిటల్ కి తీసుకువెళ్తారు అక్కడ డాక్టర్ చెక్ చేసి కృష్ణకి పొత్తికడుపులో ప్రాబ్లం వచ్చిందని పూర్తిగా గర్భసంచి తీసివేయాలని ఇక జీవితంలో పిల్లలు కనే అవకాశం కృష్ణకి ఉండదని తెలిసి చెప్తారు ఆ విషయాన్ని కృష్ణకు చెప్పకుండా మురారితో చెప్పి తనకి రెండు రోజుల్లో నచ్చే చెప్పి హాస్పిటల్ కి తీసుకొని రావాలని చెప్తారు. దాంతో కృష్ణకు నిజం చెప్పలేక మురారి సతమతమవుతూ ఉంటాడు.

Krishna Mukunda Murari Today Episode April 26 2024 Episode 454 highlights
Krishna Mukunda Murari Today Episode April 26 2024 Episode 454 highlights

ఇక మరోవైపు ముకుందా మురారి బాధపడడం చూసి తట్టుకోలేక పోతుంది కానీ ఇదంతా కొన్నాళ్లే తర్వాత నేను నీ జీవితంలోకి వచ్చి నీకు ఆనందాన్ని ఇస్తాను మురారి అని మనసులో అనుకుంటుంది. మురారి కృష్ణ గురించి బాధపడుతూ ఉంటే, ముకుంద కావాలని మురారి మనసులో లేనిపోని ఆలోచనలు పుట్టించి మురారి మనసు మార్చాలని చూస్తుంది. ఎవరికైనా బాధ కలిగితే ఆ విషయం వాళ్లతో చెప్పకుండా దాచిపెట్టి వాళ్ళ నుండి దూరంగా జరగాలి కానీ, వాళ్లతోనే ఉంటే ఏదో ఒక రోజు నిజం చెప్పేస్తాము అని మురారి అని కృష్ణకు దూరంగా ఉండమని ఇన్ డైరెక్ట్ గా చెప్తుంది ముకుందా ఆ మాటలు మురారి కి అర్థమవుతాయి. దానితో ముకుంద చెప్పినట్టుగా కృష్ణకు దూరంగా ఉంటూ ఉంటాడు మురారి కృష్ణ కనిపెట్టి మీరు ఎందుకు నాతో దూరంగా ఉంటున్నారని అడుగుతుంది. ఏంటి ఏ సి పి సార్ నేను ఇంతలా మాట్లాడుతుంటే మీరు సైలెంట్ గా ఉన్నారు. మీరు తాగొచ్చారా ఏంటి అని అడుగుతుంది. కృష్ణ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మురారి కోపంగా అవును నేను తాగొచ్చాను మనసులో బాధ వేరే వాళ్ళకి చెప్పలేక తాగాను అని అంటాడు. అంత చెప్పుకోలేని బాధ ఏముంది అని కృష్ణ మురారిని నిలదీస్తుంది కానీ మురారి కృష్ణకి తన మనసులో మాట చెప్పకుండా కృష్ణకు నిజం చెప్పాలంటే ముందు నాకు ధైర్యం రావాలి కదా అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari Today Episode April 26 2024 Episode 454 highlights
Krishna Mukunda Murari Today Episode April 26 2024 Episode 454 highlights

ఇక ఆదర్శ్ ముకుందతో నేను నా మనసులో వున్నా మాటను నీకు చెప్పాలనుకుంటున్నాను అని అంటాడు. చెప్పండి అని అంటుంది ముకుంద ఆ తర్వాత నువ్వు ఎలా ఫీలవుతావా అని భయంగా ఉంది అని అంటాడు. నాకు మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు మీ ఇంట్లో నేను ఉంటున్నాను అలాంటప్పుడు నేనేం అనుకోను చెప్పండి అని అంటుంది ముకుంద. మీరేం చెప్పినా వినడం తప్ప, ఏమనుకోను అని అంటుంది. చెప్పడానికి ఆలోచిస్తున్నాను అని అంటాడు ఆదర్శ. చూడు ముకుందా నేను నీకు చెప్పాల్సింది చెప్పాక, నేను ఇంట్లో ఉన్నాను అని అలుసుగా తీసుకొని ఇలా మాట్లాడుతున్నారు అని నువ్వు అనకూడదు అని అంటాడు. మీరు అంత అలుసుగా మాట్లాడే వారే అయితే ఇంతలా ఆలోచించరు అని అంటుంది. ఆలోచిస్తున్నారంటే కచ్చితంగా నా ఆత్మ అభిమానం కి విలువ ఇచ్చినవారు మీరేం చెప్పాలనుకుంటున్నా నిర్భయంగా చెప్పొచ్చు అని అంటుంది ముకుంద. కృష్ణ మురారి ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు.ఇక ఆదర్శ్ గులాబీలు తీసుకొని ముకుంద కి ప్రపోజ్ చేస్తాడు. ఒకసారిగా ముకుంద షాక్ అవుతుంది. కృష్ణ మురారి కూడా షాక్ అవుతారు. ఐ లవ్ యు ముకుంద అని అంటాడు. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నాలో ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. నన్ను వదిలి వెళ్ళిన ముకుంద నాకోసం వచ్చినట్టు అనిపించింది. ముకుంద పోయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాతే నాలో తెలియని ఆశలు మొదలయ్యాయి. హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్న వాడిని నిన్ను చూసి ఆగిపోయాను. ఒక్క మాటలో చెప్పాలి అంటే నువ్వు వచ్చాక, నేను తిరిగి మామూలు మనిషిని అయ్యాను. అందుకే నాకు ఇష్టమైన ముకుంద పేరు పెట్టాను. నువ్వు లేకపోతే, మళ్లీ ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది. నా మీద నాకే విరక్తి పుడుతుంది ఆదర్శ అలా మాట్లాడుతూ ఉంటే ముకుంద ఏం చెప్పాలో తెలీక ఆశ్చర్యంతో నిలబడి చూస్తూ ఉంటుంది దూరం నుంచి కృష్ణ మురారి కూడా చూస్తూ ఉంటారు. అప్పటికే కృష్ణకు చాలా కోపం వస్తుంది. ఆదర్శ్ నువ్వు నా దానివి కావాలి ముకుందా, నువ్వు సరే అంటే మనిద్దరం పెళ్లి చేసుకుందామా అని అంటాడు. ఐ లవ్ యు ఐ లవ్ యు సో మచ్ ముకుందా అని అంటాడు.

Krishna Mukunda Murari Today Episode April 26 2024 Episode 454 highlights
Krishna Mukunda Murari Today Episode April 26 2024 Episode 454 highlights

ఇక ఆదర్శ ఎలా ప్రపోజ్ చేసేటప్పటికి కృష్ణకు చాలా కోపం వస్తుంది ముకుంద ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే కృష్ణ కోపంగా వెళ్లి ఆదర్శ్ చేతిలో ఉన్న గులాబీలు తీసి నేలకేసి కొడుతుంది. ఆదర్శ కి బాగా కోపం వస్తుంది అసలే కృష్ణ అంటే ఆదర్శకు పడదు ఇప్పుడు కృష్ణ ఇలా చేసేసరికి ఆదర్శ కోపంతో రగిలిపోతాడు. కృష్ణా అసలు ఏం చేసావో అర్ధం అవుతుందా అని అంటాడు. నువ్వేం చేసావో నీకు అర్థం అవుతుందా ఆదర్శాన్ని అంటుంది కృష్ణ. ముఖం అంటే నాకు ఇష్టం నా మనసులో మాటని దానికి చెప్తున్నాను అయితే నీకు ఏంటి అని అంటాడు. నాకు కాదు మీ కుటుంబానికి చాలా నష్టం అని అంటుంది. అసలు మీరాకి ముకుందా అని పేరు పెట్టడమే నువ్వు చేసిన పెద్ద తప్పు ఆదర్శ అని అంటుంది కృష్ణ. అది నా ఇష్టం నాకు నచ్చిన మనిషికి నాకు నచ్చిన పేరు పెట్టుకుంటాను మధ్యలో నీకేంటి అని అడుగుతాడు ఆదర్శ. అంత నీ ఇష్టం అని అనుకోవడానికి నువ్వు ఇప్పుడు హిమాలయాల్లో లేవు కుటుంబంలో ఉన్నావ్ అది గమనించు అని అంటుంది కృష్ణ. నువ్వు తీసుకునే ఏ నిర్ణయం అయినా కుటుంబానికి కీడు చేసేలా ఉండకూడదు అని అంటుంది కృష్ణ. ముకుంద నేను పెళ్లి చేసుకుంటే ఇంటికి కీడు చేసినట్టు అవుతుందా అని అడుగుతాడు ఆదర్శ. కృష్ణ ఏం చెప్పిందో ఒకసారి విను మురారి ఏంటి తను అలా మాట్లాడుతుంది అని అంటాడు ఆదర్శ్. తను చెప్పింది నిజమే కదా అని అంటాడు మురారి నువ్వు కూడా ఏంట్రా అని అంటాడు ఆదర్శ. నేను ముకుందని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు ఆదర్శ్ వీల్లేదు అని అంటుంది కృష్ణ. అసలు నువ్వు ముకుందని అదే మీరాని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు చేసుకోవాలి దానికి నీకు మీరా గురించి ఏం తెలుసు, ఒకవేళ నువ్వు చేసుకోవాలి అని అనుకుంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళని అడగాలి. వాళ్లకి ఇష్టం లేకపోతే వదిలేయాలి. అంతేకానీ నీ ఇష్టం అంటే కుదరదు అర్థమవుతుందా అని కృష్ణ గట్టిగా ఉంటుంది దాంతో ఒక్కసారిగా ఆదర్శ్ నిధుల్లో నుంచి మెలకువ వస్తుంది ఇదంతా కల అని అప్పుడే మనకు అర్థం అవుతుంది. ఆదర్శ్ ముకుంద కి ప్రపోజ్ చేస్తే కృష్ణ గొడవ చేస్తుందని కలగంటాడు. ఆదర్శ్ నిద్రలో నుంచి లేచి అయినా కృష్ణ ఎందుకు ఇలా అడ్డుకుంటుంది నేను సంతోషంగా ఉండడం తనకి ఎప్పుడు ఇష్టం ఉండదు కదా అని అనుకుంటాడు. మురారి కూడా కృష్ణ చెప్పింది వినుమంటున్నాడు. వాళ్ళు ఎలా అనుకుంటే నాకేంటి, ముకుందా ఏమనుకుంటుందో అదే నాకు ముఖ్యం ఇప్పుడే ముకుంద దగ్గరికి వెళ్తాను అని అనుకుంటాడు.

Krishna Mukunda Murari Today Episode April 26 2024 Episode 454 highlights
Krishna Mukunda Murari Today Episode April 26 2024 Episode 454 highlights

ఇక హాస్పిటల్ కి వెళ్లిన కృష్ణ, నాకు కడుపులో నొప్పి వచ్చి తగ్గిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు ఈ టెస్ట్ లని ఎందుకు చేస్తున్నారు అని అడుగుతుంది దానికి అక్కడ ప్రమీల డాక్టర్ ఉండదు వేరే డాక్టర్ ఉండడంతో కృష్ణకి నిజం చెప్పేస్తుంది మీకు ఇప్పుడు ఈ స్కానింగ్ చేస్తుంది నీ గర్భసంచి ప్రాబ్లం ఉంది కాబట్టి అని అంటుంది ఇప్పుడు గర్భసంచిని పూర్తిగా తొలగించడానికి ఆపరేషన్ కి సిద్ధం చేస్తున్నాము అని చెప్తుంది. దాంతో కృష్ణ షాక్ అవుతుంది అదేంటి మీరు చెప్పింది నిజమా అని అడుగుతుంది మీకు ఇంత వాడికి నిజం తెలియదా ఏంటి? మీ రిపోర్ట్స్ చూస్తే మీకే అర్థమవుతాయి అని కృష్ణకి స్కానింగ్ రిపోర్ట్స్ అన్ని డాక్టర్ చూపిస్తుంది ఆ రిపోర్ట్లను చూసి కృష్ణ ఏడుస్తూ ఉంటుంది. కృష్ణ తో పాటు ముకుంద కూడా హాస్పిటల్ కి వస్తుంది కృష్ణకు తెలియకుండా ముకుందా హాస్పిటల్ లో కృష్ణ రూమ్ బయట నిలబడి లోపల ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటుంది కృష్ణ ఏడవడం చూసి ముకుంద సంతోషిస్తుంది కృష్ణ ఇక నాకు పిల్లలు పుట్టరా అని బాధపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి మురారి వస్తాడు. మురారి రావడం కూడా ముకుంద చూస్తుంది ఇక దూరం నుంచి అంతా గమనిస్తూ ఉంటుంది. నేను వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యింది. ఇక కృష్ణా నువ్వు జీవితాంతం బాధపడడం ఇదే నీకు మొదటి అడుగు ఇకనుంచి నువ్వు వేసే ప్రతి అడుగు నీ పతనానికి కారణమవుతాయి అని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 26 2024 Episode 454 highlights
Krishna Mukunda Murari Today Episode April 26 2024 Episode 454 highlights

ఇక మరోవైపు హాస్పిటల్లో కృష్ణ బాధపడుతూ ఉంటే మురారి వచ్చి ఏం జరిగింది కృష్ణ ఎలా ఉన్నావు అని అడుగుతాడు. మీకు తెలుసుకోవడం నాకు నిజం చెప్పలేదా ఏసీపీ సార్ అని అంటుంది ఏ నిజం గురించి మాట్లాడుతున్నావ్ అని అడుగుతాడు మురారి. అప్పటికే డాక్టర్ గారు కృష్ణతో నిజం చెప్పి ఉంటుంది ఆ స్కానింగ్ రిపోర్ట్ లను కృష్ణ చేతిలో చూసి మురారి కృష్ణకు నిజం తెలిసిపోయిందని భయపడుతూ ఉంటాడు నీకే నిజం తెలిసింది చెప్పు కృష్ణ అని అడుగుతాడు. దానికి కృష్ణ ఏడుస్తూ నాకు గర్భసంచి ప్రాబ్లం వచ్చింది ఇక నా గర్భసంచి తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది ఇక నాకు జీవితంలో పిల్లలు పుట్టరు వేసి పిసారని బాధపడుతూ ఉంటుంది పెద్ద ఎత్తున మాట నేను నిలబెట్టుకోలేకపోతున్నాను. ఇక నేను అత్తయ్య ముఖం ఎలా చూడను ఇంట్లో వాళ్ళందరినీ నేను ఎలా ఫేస్ చెయ్యాలి ఎలా వాళ్ళ ముఖాలు చూడాలి వాళ్ళందరికీ నేను మాట ఇచ్చాను. అలాంటిది ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదు అని తెలిస్తే పెద్ద టైం ఏమైపోతుంది రేవతత్త ఏమైపోతుంది అసలు ఇంట్లో వాళ్ళందరికీ నేనేం చెప్పాలి అని బాధపడుతూ ఉంటుంది నేను మాట నిలుపుకోలేకపోయాను ఏసీపీ సార్ దీనికన్నా చావడమే బెటర్ అని అంటుంది దాంతో మురారి సెటప్ కృష్ణ అని అరుస్తాడు. ఇప్పుడు ఏం జరిగిపోయింది అని బాధపడుతున్నావు అని కృష్ణుని ఓదారుస్తాడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నీ కంటే బాధ నాకు ఉంటుంది కదా అయినా మనం ఈ టైంలో బాధపడి ఏం ప్రయోజనం జరగాల్సింది జరిగిపోయింది కదా అని కృష్ణుని ఓదారుస్తాడు ఇంట్లో వాళ్ళందరికీ నేను చెప్తాను అని అంటాడు. ఇక కృష్ణ బాధపడుతుంటే మురారి ఓదార్చడం కూడా ముకుంద చూస్తుంది ఇక ఈరోజుతో మీ మధ్య ఈ మాత్రం సంబంధం కూడా లేకుండా చేస్తాను ఇక మురారి కి కృష్ణుని పూర్తిగా దూరం చేసే పనిలో పడతాను మురారి జీవితంలో కృష్ణ వల్ల పిల్లలు పుట్టరు కాబట్టి ఇంట్లో అందరూ కూడా కృష్ణుని దూరం పెడతారు ఇక మురారి కి నేను దగ్గర అవుతాను మురారి కి జీవితాంతం సరిపడే సంతోషాన్ని ఇస్తాను ఇక ఆ ఇంట్లో వారు రెండు కలిపితే అది నాకు మురారి కి మాత్రమే అని మనసులో అనుకుంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella