NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Krishna Mukunda Murari June 1st 2024 Episode 485: క్రిష్ణ, మురారీల తప్పులేదని భవానికి నిజం చెప్పిన మధు. ముకుంద కుట్ర బట్టబయలు. రేపటికి సూపర్ ట్విస్ట్

Krishna Mukunda Murari Today Episode June 1st 2024 Episode 485 highlights

Krishna Mukunda Murari June 1st 2024 Episode 485: భవానీ దేవి మురారి నిజంగానే తప్పు చేసి ఉంటాడేమో అని భయపడుతూ ఉంటుంది. మురారి గదిలోకి వచ్చి మురారి గదిని పరీక్షిస్తూ ఉంటుంది. మురారి గదిలో మొత్తం అన్ని వెతుకుతూ ఉంటుంది. నిజంగా మురారి ముకుందా ఎలా అలాంటి రిలేషన్షిప్ లో ఉంటే ఏదో ఒక ఆధారం దొరుకుతుంది కదా అని వెతుకుతూ ఉంటుంది. మురారి ఇలాంటి పని చేశాడు అంటే నమ్మలేకపోతున్నాను. అలా అని ఇన్స్పెక్టర్ చెప్పినట్టు, అలాంటిదే ఏదైనా ఉండి ఉంటే నేను ఈ జన్మలో మురారిని క్షమించను అని మనసులో అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode June 1st 2024 Episode 485 highlights
Krishna Mukunda Murari Today Episode June 1st 2024 Episode 485 highlights

అయినా మురారి వెళ్లిపోవడానికి ఇది కారణం అయ్యి ఉండదు. ఇంట్లో బంగారం లాంటి భార్య ఉంటే ఇలాగా ఎందుకు పారిపోతాడు అని అనుకుంటుంది. అప్పుడే టేబుల్ మీద ఉన్న రిపోర్ట్స్ చూస్తుంది భవాని. ఈ ఫైల్ ఏంటి రిపోర్ట్స్ ఏంటి అని అనుకుంటుంది. ఆ ఫైల్ ఓపెన్ చేసి భవాని ఒక్కసారిగా షాక్ అయ్యి మంచం మీద కూలబడుతుంది. అందులో ఉన్న విషయం తెలిసాక భవాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కృష్ణ తల్లి కాలేదని అసలు జీవితంలో ఎప్పటికీ తల్లి కాలేదని ఆ రిపోర్ట్ లో ఉన్న నిజాన్ని చూసి భవాని షాక్ అవుతుంది అంతేకాకుండా అదే ఆవేశం తగ్గించుకోకుండా అంతే ఆవేశంగా భవాని కిందకి వెళ్తుంది.

Krishna Mukunda Murari Today Episode June 1st 2024 Episode 485 highlights
Krishna Mukunda Murari Today Episode June 1st 2024 Episode 485 highlights

భవానీ దేవి ఆవేశంగా కిందకి వచ్చి ఫైల్ తీసుకొని కృష్ణ కృష్ణ అని అరుస్తుంది. ఇంట్లో అందరూ వచ్చి ఎదురుగా నిలబడతారు. ఎంత మోసం చేశావు నన్ను అని కృష్ణని చెంప పగల గొడుతుంది భవాని. అసలు ఏమైంది అక్క ఎందుకు కృష్ణ అని కొడుతున్నావు అని రేవతి అడుగుతుంది. అసలు నన్ను మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది కృష్ణ అని భవాని కృష్ణని అరుస్తుంది. వెంటనే భవాని దేవి చేతిలో ఉన్న ఫైల్ ని తీసుకొని ఆదర్శ మీరంతా అనుకుంటున్నట్టు ఈ కృష్ణ గర్భవతి కాదు. ఇంతకాలం కృష్ణ ప్రెగ్నెంట్ అని మీరంతా తనని నెత్తిన పెట్టుకొని చూసారు కదా. అదేం లేదు అదంతా డ్రామా, తను ప్రెగ్నెంట్ కాదు తను ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ ప్రెగ్నెంట్ కాలేదు ఇది ఈ ఫైల్ లో ఉన్న పచ్చి నిజం ఈ నిజాన్ని దాచిపెట్టి కృష్ణ ఎన్ని రోజుల నుంచి మీ అందర్నీ నమ్మించి మోసం చేసింది అని ఉన్న నిజాన్ని కుండ బద్దలు కొడతాడు ఆదర్శ. నిన్ను మోసం చేసింది అని రేవతి తో చెప్తాడు. ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక ముకుంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడే కాదు ఈ జన్మకి కృష్ణ కి బిడ్డలు పుట్టే ఛాన్స్ లేదు అని అందరి ముందు ఆదర్శ చెప్తాడు. ఆ మాటలకు రేవతి షాక్ అవుతుంది. కృష్ణ గొడ్రాలు అన్న విషయం భవానీ తో సహా ఇంట్లో అందరికీ తెలిసిపోయింది.

Krishna Mukunda Murari Today Episode June 1st 2024 Episode 485 highlights
Krishna Mukunda Murari Today Episode June 1st 2024 Episode 485 highlights

ఏంటి కృష్ణ నువ్వు ఎలాంటి తప్పు చేయవని నాకు తెలుసు. ఇంత పెద్ద తప్పు ఎలా చేశావు అని కృష్ణని మధు అడుగుతాడు. నీకు నిజం చెబుతాను పదా అని మధు నీ పక్కకు తీసుకువెళ్తుంది కృష్ణ. ఇక మధుతో జరిగింది మొత్తం చెబుతుంది. అనుకోకుండా నాకు గర్భసంచి పోయిందని ఆ తరువాత పెద్ద అత్తయ్య కోరిక తీర్చాలనుకుని మేము సరోగసి మదర్ కోసం వెతుకుతున్నాము. అప్పుడు నాకు తెలియకుండానే ఎసిపి సర్ నీ నమ్మించి ముకుందా సరోగసిగా ఒప్పుకుంటాను అని చెప్పి ఇప్పుడు ఇంట్లో ఈ రాద్ధాంతం అంతా జరగడానికి తనే కారణమని.. గతంలో తనని మురారిని ముకుంద ఏ విధంగా బెదిరించింది ఎలా వాళ్ళిద్దర్నీ ఇబ్బంది పెట్టిందో.. అన్ని విషయాలను వివరంగా పూసగుచ్చి కృష్ణ మధుకి చెబుతుంది. ఇంత దారుణంగా ఆ ముకుందా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే చూస్తూ ఉంటారేంటి కదా ఇప్పుడే ఈ నిజాన్ని పెద్ద పెద్దమ్మతో చెబుదాము అని మధు అంటాడు. అమ్మో మధు ఇప్పుడు చెప్పేసానంటే ఆ బిడ్డకు కూడా ఏదో ఒక అనర్ధం చేస్తుంది అని కృష్ణ అంటుంది. నువ్వు ఇలా భయపడుతూ ఉంటే తను నిన్ను భయపెడుతూనే ఉంటుంది. తనకి నువ్వు భయపడ్డటం ఏంటి కృష్ణ. పద ఇంట్లోకి అంటూ మధు పెద్ద పెద్దమ్మ అంటూ పెద్దగా పిలుస్తాడు. ఇక ఇంట్లో నుంచి అందరూ మళ్లీ హాల్లోకి వచ్చి నిలబడతారు.

Krishna Mukunda Murari Today Episode June 1st 2024 Episode 485 highlights
Krishna Mukunda Murari Today Episode June 1st 2024 Episode 485 highlights

ఏంటి మధు ఏమైంది అని భవాని అడుగుతుంది పెద్ద పెద్దమ్మ కృష్ణ ఎలాంటి తప్పు చేయలేదు. మీరా కడుపులో ఉన్న బిడ్డకి మురారి ఏ తండ్రి కానీ ముకుందా ఆ బిడ్డకి తల్లి కాదు మీరు అని మోసం చేసి మన మురారి ఎలాంటి తప్పు చేయలేదు మన కృష్ణ తల్లి కాలేదని తెలిసి సరోగసి కోసం ఎదురుచూస్తున్నారని ఈ మీరా తెలుసుకొని సరోగసి మదర్ గా తను ఉంటానని మురారిని నమ్మించి ఇప్పుడు మురారినే తనని ఇంతలా మోసం చేశాడని మనందరితో కలబుల్లి కబుర్లు చెబుతుంది అని ఉన్న నిజాన్ని మధు ఇంట్లో వాళ్ళ అందరితో చెబుతాడు. ఇదంతా నిజమేనా అని కృష్ణ నీ రేవతి అడుగుతుంది అవునత్త అదే నిజమని కృష్ణ చెబుతుంది. అప్పుడు వెంటనే మీరా లేదు

Krishna Mukunda Murari Today Episode June 1st 2024 Episode 485 highlights
Krishna Mukunda Murari Today Episode June 1st 2024 Episode 485 highlights

నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి మురారి ఏ కారణం మురారి కి నాకు ఆ బిడ్డకి సంబంధం ఉంది ఈ కృష్ణకి ఎలాంటి సంబంధం లేదు అని కావాలని చెప్పి మీరా ఎదురు తిరుగుతుంది. మధు మీరాని బెదిరిస్తాడు పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడావంటే పళ్ళు రాలుతాయి జాగ్రత్త నువ్వు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మురారి మీద కన్ను వేశావు. ఇక నువ్వు అనుకున్నా అది చేయాలని అవకాశం కోసం ఎదురుచూస్తున్న నువ్వు కృష్ణ ప్రెగ్నెంట్ కాలేదని తెలిసి సరోగసిగా మురారి కి దగ్గర అవ్వాలనుకున్నావు అంటూ అసలు నిజాన్ని కూడా బయటపడతాడు. మధు దాంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella