NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari June 03 Episode 486:ముకుంద సరోగసి మదర్ అని నిరూపించాలనుకున్న కృష్ణ..అబద్ధం చెప్పిన వైదేహి అడ్డం తిరిగిన కథ..

Krishna Mukunda Murari Today Episode June 3 2024 Episode 486 highlights

Krishna Mukunda Murari:కృష్ణ ఎప్పటికీ తల్లి కాలేదని తెలుసుకున్న భవాని కృష్ణ మీద కోప్పడుతుంది. ఇంత పెద్ద మోసం ఎందుకు చేసావో నిలదీస్తుంది. నిజం చెప్పడానికి మురారి లేకపోవడంతో కృష్ణ ఏం చెప్పాలో తెలియక సతమతమవుతుంది. అదే టైంకి మధుతో కృష్ణ జరిగిందంతా చెబుతుంది. అసలు సరోగసీన దర్గా ముకుంద ఒప్పుకుందని తన కడుపులో బిడ్డ పోవడానికి కారణం కూడా ముకుందేనని, ఇప్పుడు సరోగసి మదర్ ముకుందని నిరూపిస్తే ఈ విషయాలన్నీ భవానీకి చెప్తే ఈ సమస్య నుండి పరిష్కారం దొరుకుతుందని మధు నిజం చెప్పడానికిసిద్ధపడతాడు. కానీ కృష్ణ మాత్రం మధుతో ఇప్పుడే మన నిజం చెప్పడం కుదరదు అని కొంతకాలం ఆగి మనం నిజం చెబుదాము లేదంటే నా బిడ్డ ముకుంద కడుపులో ఉంది. ఇప్పుడు నేను నిజం చెప్తే ఆ బిడ్డను ఏమైనా చేస్తుందని భయపడుతుంది మధు ఎంత కాలం ఇలా భయపడుతూ ఉంటావు నువ్వు భయపడుతున్నావు అని ఇంకా నిన్ను భయపెడుతోంది ఇప్పుడు మనం నిజాన్ని పెద్ద పెద్దమ్మ ముందు చెప్పేద్దాము నువ్వు చెప్పకపోయినా నేను చెప్పేస్తాను కృష్ణ అని భవానీకి నిజం చెప్పడానికి వెళ్తాడు.

Krishna Mukunda Murari Today Episode June 3 2024 Episode 486 highlights
Krishna Mukunda Murari Today Episode June 3 2024 Episode 486 highlights

ఇక మధు భవాని ముందు తల్లి కాకపోవడానికి కారణం, ఈ ముకుందేనని తర్వాత తనే సర్వగసీమ దగ్గరగా ముందుకు వచ్చి మురారి బిడ్డకు తల్లి అయిందని, మురారి తన సొంతం చేసుకోవడానికి ఇదంతా ప్లాన్ చేసిందని మధు భవానితో చెప్తాడు ఆ మాటలు ముకుంద విని నేనే తప్పు చేయలేదు వీళ్ళు కావాలనే నామీద అబండాలు వేస్తున్నారు అని అంటుంది. లేదు పెద్దమ్మ నేను చెప్పేది నిజం మన ఇంటికి అనాధగా వచ్చిన ఈ మీరా ముందు ఆదర్శ్ కి దగ్గర అవుదాం అనుకుంది ఆ తర్వాత మురారి తనకి నచ్చడంతో మురారి కి వలవేదం అనుకుంది ముందు మురారి బిడ్డకు తల్లి అయితే ఆటోమేటిక్గా మురారి తనకి భర్త అవుతాడని, ఈ మీరా పక్క ప్లాన్ చేసి ఇదంతా చేసింది ఇప్పుడు ఏమీ తెలియనట్టు మురారి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత తన బిడ్డకి మురారి తండ్రి అని వాళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నట్టు ఇక్కడ గొడవ చేయడం స్టార్ట్ చేసింది ఆదర్శ చంపేస్తానని బెదిరించడంతో ఇంట్లో నుంచి పారిపోయే నాటకం ఆడి కృష్ణ ఎక్కడికి తీసుకువచ్చిందని మధు నిజాన్ని భవాని ముందు ఉంచుతాడు. మధు చెప్పిందంతా విని ముకుంద మాత్రం నేనే తప్పు చేయలేదని, మురారి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి అని నేను సరోగని కాదు అని అసలు కృష్ణ సరోగసి మద్దరికీ వెళ్తుంది అన్న విషయం కూడా నాకు తెలియదని ముకుంద నాటకాలు ఆడుతుంది.

Krishna Mukunda Murari Today Episode June 3 2024 Episode 486 highlights
Krishna Mukunda Murari Today Episode June 3 2024 Episode 486 highlights

ఇక కృష్ణ ఎందుకు అబద్ధం చెప్తున్నావు నువ్వు సరోగసి మదర్ కి ముందుకు రాలేదు. మేము హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు నువ్వే మురారితో నేనే సరోగసి మదర్ గా ఉంటానని తనని ఒప్పించావు కదా ఇప్పుడు మళ్ళీ ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతున్నావు అని అంటుంది. లేదు ఇది సరోగసి ద్వారా వచ్చిన బిడ్డ కాదు నా బిడ్డ అసలు కృష్ణ బిడ్డ కాదు అని అంటుంది ఆ మాటల కృష్ణ కోపం వస్తుంది అబద్ధాలు చెప్పకు పళ్ళు రాలిపోతాయి నా బిడ్డని నీ బిడ్డ అన్నావంటే బాగోదు అని అంటుంది. మురారి ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు అని అంటుంది కృష్ణ కానీ ముకుంద మాత్రం లేదు తప్పు చేశాడు కాబట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు నేను డిఎన్ఏ టెస్ట్ కూడా రెడీ అయ్యాను అందుకే కదా అని అంటే వెంటనే మధు డిఎన్ఏ టెస్ట్ కి ఎందుకు రెడీ అయిందంటే ఆ బిడ్డ సరోగసి ద్వారా పుట్టే బిడ్డ కాబట్టి డిఎన్ఏ టెస్ట్ చేస్తే మురారి ఆ బిడ్డ తండ్రి అని తెలిసిపోతుంది అప్పుడు ఇంట్లో అందరినీ ఈజీగా నమ్మించొచ్చు అని అనుకుంది అని అంటాడు మధు లేదు అని అరుస్తుంది మీరా కానీ ఈ కృష్ణ మాత్రం సరోగసి మదర్ గా ఆ బిడ్డకు డిఎన్ఎ టెస్ట్ చేయిస్తే నేనే తల్లి అనే విషయం తెలిసిపోతుంది కదా హాస్పిటల్ కి వెళ్లే టెస్ట్ చేయిద్దాం అని అంటుంది. ఆ మాటలకి భవాని రేవతి ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటారు ఇక మీరు అబద్ధం చెప్తుంది అని నిరూపించడానికి కృష్ణ దగ్గర ఉన్న ఏకైక సాక్ష్యం హాస్పిటల్ కి వెళ్లి తన సరోగసి ద్వారా తల్లి అయిందని నిరూపించడమే, అందుకే సరోగసి చేసినా బయటకి డాక్టర్ దగ్గరికి వెళ్లాలని కృష్ణ నిర్ణయించుకుంటుంది. ఇక ముకుందని ఇంట్లో అందర్నీ కూడా హాస్పిటల్ కి వెళ్లడానికి నేను రెడీ అని చెప్తుంది దాంతో భవాని దేవి అయితే ఇదంతా హాస్పిటల్ లోనే తేల్చుకుందాం అని అందరూ కలిసి హాస్పిటల్ కి బయలుదేరుతారు.

Krishna Mukunda Murari Today Episode June 3 2024 Episode 486 highlights
Krishna Mukunda Murari Today Episode June 3 2024 Episode 486 highlights

ఇక హాస్పిటల్ లోపలికి అందరూ వెళ్తుండగా ముకుందతో కృష్ణ, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను కదా పదాన్ని బండారం బయట పట్టిస్తాను అని అంటుంది దాంతో ముకుందా డాక్టర్ మంచిదైతే నిజమే చెప్తుంది లే కృష్ణ ఈ బిడ్డ నా బిడ్డనని అని అంటుంది ఆ మాటలకి కృష్ణకి కోపం వస్తుంది ఇక లోపలికి వెళ్ళిన తర్వాత వైదేహి ఎదురుగా ఉంటుంది. భవాని దేవి రేవతిని ఇంట్లో అందరినీ చూస్తుంది వైదేహి వైదేహి కి సీన్ మొత్తం అర్థమవుతుంది ముకుందని ఇక్కడికి తీసుకువచ్చి నిజం నిరూపించాలనుకుంటున్నారని అర్థమయ్యే వైదేహి తన డ్రామాని స్టార్ట్ చేస్తుంది ఇక కృష్ణుని చూసి ఆ రా కృష్ణ అని అంటుంది. ఏంటి ఇలా వచ్చావు అని అడిగితే మీరు ఆరోజు నాకు గర్భం పోయిందని నా గర్భసంచి తొలగించారు కదా అప్పుడు మీ దగ్గరికి మేము సరోగసి మదర్ చేయడానికి వచ్చాను కదా ఆ సరోగసి మదర్ గా ఈ అమ్మాయే కదా ఒప్పుకుంది అని కృష్ణ అందరి ముందు వైదేహి డాక్టర్ని అడుగుతుంది. ఈ అమ్మాయి ఎవరు కృష్ణ అని అంటుంది వైదేహి దాంతో ఒక్కసారిగా కృష్ణకి ఫీజు ఎగిరిపోతాయి. అదేంటి అలా మాట్లాడుతున్నారు ఆ రోజు సరోగసి చేయడానికి మీరు ఒప్పుకున్నప్పుడు నేను ఆ అమ్మాయిని చూపించండి అంటే మీరు చూపించలేదు ఆ తర్వాత ఈ అమ్మాయి వచ్చి మురారితో నేనే మీ బిడ్డకి సరోగసిగా చేస్తాను అని ఒప్పుకుంది కదా మీరు సరోగసి మదర్ గా సెలెక్ట్ చేసింది నా బిడ్డ ఈ మీరా కడుపులోనే పెరుగుతుంది కదా అని అంటుంది. వెంటనే ముకుందా అమాయకంగా వైదేహి వైపు చూస్తుంది ఇక నాకు ఈ అమ్మాయి ఎవరో తెలియదు అని అంటుంది వైదేహి అసలు ఈ అమ్మాయి నేను ఇంతకుముందు చూడలేదు అని చెప్తుంది దాంతో మీరు అబద్ధం చెపుతున్నారు డాక్టర్ అని అంటుంది కృష్ణ ఇక వెంటనే మీరా నిజం చెప్తే నువ్వు నమ్మవు కదా కృష్ణ ఆమె చెబుతున్నది నిజమే ఇక్కడికి నేనెప్పుడూ రాలేదు ఈ బిడ్డ నా బిడ్డ నేను సరోగసి మదర్ ని కాదు అని చెప్తుంది. అక్కడే ఉన్న భవానీతో అది కాదు అత్తయ్య అని కృష్ణ అంటూ ఉంటే ఇక భవానికి సీన్ మొత్తం అర్థమవుతుంది మీ కృష్ణ కావాలని డాక్టర్ దగ్గరికి వచ్చి అబద్ధం చెప్పాలనుకుంటుందని అర్థమవుతుంది ఇక అప్పుడే వైదేహి కూడా దృష్ణా మనలను నాకు ఫోన్ చేసి నాకు ఒక ఫీవర్ చేయండి అని అడిగావు అది ఇదేనా ఒక ఆడపిల్లలకి అన్యాయం చేయడమేనా అని అంటుంది వైదేహి. వెంటనే మీరా అవును ఈ కృష్ణ ఎప్పుడు అలానే చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ తన బిడ్డ కాదు అని చెప్తే ఎక్కడ తన భర్తని వదులుకోవాల్సి వస్తుందని తన భర్త తప్పు చేసి పారిపోతే, కృష్ణ ఇంకా తన భర్తని నమ్ముతుందని ఈ బిడ్డ నాకు మీరు అడిగి పుట్టిన బిడ్డ అని ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా అని అంటుంది. ఇక డాక్టర్ గారు చెప్పింది నిజం అని నా మీ భవాని దేవి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇకమీరా, కృష్ణ కూడా అక్కడ నుంచి ఇంటికి బయలుదేరుతారు.

Krishna Mukunda Murari Today Episode June 3 2024 Episode 486 highlights
Krishna Mukunda Murari Today Episode June 3 2024 Episode 486 highlights

ఇక భవాని వాళ్ళ ఇంటికి వచ్చేసరికి రజిని సంగీత ఇద్దరూ బట్టలు సర్దుకుంటూ ఉంటారు సంగీత ఇంకొన్ని రోజులు ఆగుదాం అమ్మ అని అంటే ఎందుకే ఇలాంటి కుటుంబం అని తెలిసి నేను ఇక్కడికి తీసుకు వచ్చాను నేను మంచి కుటుంబం అనుకున్నాను ఇలాంటి మోసం చేసే కుటుంబం ఇలాంటివి ఇంట్లో జరుగుతాయని నేను అనుకోలేదు మనం ఇంట్లో ఒక క్షణం కూడా ఉండాల్సిన అవసరం లేదు నేనేదో మంచి కుటుంబం పేరు నా కుటుంబం అనుకున్నాను కానీ ఒక కొడుకు ఏమో కడుపు చేసి పారిపోతే కోడలు ఏమో కడుపు లేకపోయినా కడుపుని చెప్పింది ఎక్కడో అనాధగా ఉన్న అమ్మాయి కడుపులో ఈ ఇంటి బిడ్డ పెరుగుతుంది అని చెప్తున్నారు అసలు ఇంకో కొడుకు చంపేస్తానని బెదిరిస్తూ కనిపెట్టుకొని తిరుగుతుంటాడు ఇలాంటి కల్చర్ ఉన్న ఈ ఇంట్లో మనం ఉండాల్సిన అవసరం లేదు అని అంటుంది అప్పుడే అక్కడికి భవాని రేవతి ఇద్దరి వస్తారు వాళ్ళని చూసి రజిని మేము ఊరికి వెళ్తున్నాము అని అంటుంది దేనికి అని అడుగుతుంది భవాని. ఊరిలో చిన్న పని ఉంది అని అబద్ధం చెప్తుంది రజిని. నువ్వు సంగీత్ తో మాట్లాడిన మాటలు నేను విన్నాను అని చెప్తుంది భవాని. దాంతో అవును నేను అన్న దాంట్లో తప్పేముంది అని అంటుంది రజిని. మీది మంచి పేరున కుటుంబం అని ఇక్కడికి వచ్చాము ఆ పేరు లేదని ఇప్పుడు అర్థమైంది కదా అని అంటుంది అప్పుడే అక్కడికి కృష్ణ మధు ఇద్దరూ ఎంట్రీ ఇస్తారు. మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు అని అంటుంది కృష్ణ ఇంకా ఏం తెలియాలి అమ్మ అని అంటుంది రజిని అవును మీకు తెలియాల్సింది చాలా ఉంది ఈ ఇంటి గురించి కానీ మీరు ఇంకొక మాట అంటే నేను ఊరుకోను, ఇంటికి ఒక పేరు ప్రతిష్ట ఉన్నాయి అని అంటుంది అవేమీ ఇప్పుడు లేవు కదా అని అంటుంది రజిని మీరు కొన్నాళ్ళు ఇక్కడే ఉండండి నేను అవి నిరూపించి తీరుతాను, ఏంటి పరువు మర్యాద ఎక్కడికి పోలేదని నేను నిరూపిస్తాను అసలు ఇదంతా అబద్ధం అని నిజాలు ఏంటో మీ ముందు ఉంచుతాను అని అంటుంది. ఆ మాటలకి భవాని, చేసిందంతా చేసి ఇప్పుడు నిరూపించాలి అని అనుకుంటున్నావా కృష్ణ అయినా ఈ పరువు పోవడానికి కారణం నువ్వే కదా అని అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari Today Episode June 3 2024 Episode 486 highlights
Krishna Mukunda Murari Today Episode June 3 2024 Episode 486 highlights

ఇక మరోవైపు రేవతి భవానీతో అక్క కృష్ణ అబద్ధం చెప్పదు తన భర్త తప్పు చేస్తే తన భర్త వైపు ఎందుకు నిలబడుతుంది ఒకసారి ఆలోచించు కృష్ణ చెప్పింది అంటే దాని వెనక ఏదో కారణం ఉండి ఉంటుంది అదేంటో మనం ఆలోచించాలి అప్పటివరకు కృష్ణ తప్పు చేయలేదని నాకు అనిపిస్తుంది కృష్ణ మురారిని వెనకేసుకొస్తుంది అంటేనే కృష్ణ చెప్పేది నిజం అని నాకనిపిస్తుంది అని రేవతి భవానితో చెప్తూ ఉంటుంది అప్పుడే ముకుందా సూట్ కేస్ సర్దుకొని కిందకి వచ్చి అవును నీకు ఆమె చెప్పేది నిజమని తెలుస్తుంది సాక్షాత్త సహా నిరూపించాను. హాస్పిటల్ కి తీసుకువెళ్లి సరళ సీమ దాన్ని నేను కాదు అని చెప్పారు నేను ఈ బిడ్డ నా బిడ్డ అని చెప్తున్నాను మురారి తప్పు చేశాడు కాబట్టి ఇంట్లో నుంచి పారిపోయాడు. మీకు ఎన్ని సాక్షాలు ఎదురుగా ఉన్న మీరు మాత్రం నన్ను నమ్మకుండా ఇంకా కృష్ణ నే నమ్ముతున్నారు అని అంటుంది ముకుంద. అందుకే అనాధగా వచ్చింది నాకు ఈ ఇంట్లో న్యాయం జరగదని అర్థమైంది. ఇకనుంచి వెళ్ళిపోతున్నాను నా బిడ్డ చాలు నాకు ఇంక నాకు ఏమీ అవసరం లేదు అని డ్రామా స్టార్ట్ చేస్తుంది ముకుంద. భవాని రేవతి ఇద్దరు ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు ఇక నేను వెళ్లే ముందు ఒక మాట చెప్తున్నాను ఈ ఇంట్లో న్యాయం జరుగుతుందని అనుకున్నాను కానీ ఇంటి పెద్దలు సైలెంట్ గా ఉన్నారు. అంటే నాకు ఇంక న్యాయం జరగదు ఈ బిడ్డ నా బిడ్డ అని మీకు ఇంకా నేను సాక్షాలతో నిరూపించిన నమ్మట్లేదు నేను ఇకనుంచి వెళ్ళిపోతున్నాను అని అంటే అప్పుడే కృష్ణ ఎదురుగా వస్తుంది. ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు ఇలా పారిపోతే ఎలా అని అంటుంది వెంటనే మధు నీ మీద అబండాలు వేయాలనుకుంది ఒక నింద నీ ఇంట్లో అందరి ముందు ఉంచింది. అది నిందని తెలిసి ఎక్కడ నిజం బయటపడుతుందో అని తెలిసి ఇంట్లో నుంచి పారిపోవాలనుకుంటుంది అని అంటాడు ఆ మాటలకు ముకుందా నేనెక్కడికి పారిపోవాలి అనుకోవట్లేదు అని అంటుంది. ఈ బిడ్డ నా బిడ్డ అలాంటప్పుడు నేను పారిపోవాల్సిన అవసరం లేదు మురారి పారిపోయాడు ఈ బిడ్డను తీసుకొని నేను వెళ్తాను అని అంటుంది. వెంటనే కృష్ణ ముకుంద మెడ పట్టుకొని ఇంకొకసారి నా బిడ్డను నీ బిడ్డ అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలియదు ఇంతకాలం నువ్వు మాయలాడివి అని తెలిసి కూడా నేనేం చేయకపోవడానికి కారణం ఆ బిడ్డ, నువ్వు తప్పు చేయలేదని అంటున్నావు కదా, అయితే అలాంటప్పుడు ఇక్కడే ఉండు, మురారి రాగానే నీ రంగు బయటపెట్టి ఇంట్లో నుంచి నేనే గెంటేస్తాను అప్పటివరకు గడప దాటితే, కాళ్లు విరుగుతాయి అని చెప్పి వెళ్ళిపోతుంది. వెంటనే భవాని రేవతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella