NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

Krishna Mukunda Murari Today Episode May 18 2024 Episode 473 highlights

Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన పద్ధతి చూసి, భవానీ దేవికి ముకుంద మీద అనుమానం కలుగుతుంది. ముకుంద ప్రెగ్నెంట్ అయి ఉంటుంది అందుకే ఆదర్శ ఏవైనా ప్రాబ్లం ఉంటే పర్సనల్గా నాతో చెప్పు అని అనుకుంటున్నాడు ఇది ఇట్లానే వదలకుండా తన నిజంగా ప్రెగ్నెంట్వు కాదో తెలుసుకోవాలి అని అనుకుంటుంది. అందుకు ఇంట్లోనే ఉన్నా కృష్ణ చెక్ అప్ చేయించాలి అని అనుకుంటుంది. మరోవైపు కృష్ణ మురారి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. మురారి కృష్ణతో నేను ముకుంద వాంతులు చేసుకుంటుంటే తనకి హెల్ప్ చేశానని నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని అడుగుతాడు.. నేనెందుకు అనుమానిస్తాను తను ఇప్పుడు మన బిడ్డని మోస్తున్న సరోగసి మదర్ గానే చూస్తున్నాను అని అంటుంది. నిజం చెప్పు కృష్ణ నువ్వేనా ఇలా అనేది అని అంటే అవును ఏసిపి సార్ ఇప్పుడు నాకు ముకుంద మీద ఎలాంటి కోపము లేదు నాకు నా బిడ్డే ముఖ్యం ఇప్పుడు తనని నేను కాపాడుకోవడం అంతకన్నా ముఖ్యం. మీరు ఎలా అయితే ముకుందని కేరింగ్ గా చూసుకుంటున్నారు. నేను కూడా ముకుందని అలానే చూసుకోవాలి అని డిసైడ్ అయ్యాను అని అంటుంది. కానీ పెద్దతయ్య గురించి ఆలోచిస్తుంటేనే భయంగా ఉంది అని కృష్ణ అంటూ ఉంటే మురారి నువ్వు కనుక ఈ మాత్రం ప్రశాంతంగా ఉంటే నేను కచ్చితంగా ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని పరిష్కరిస్తాను అని అంటాడు అప్పుడే భవానీ దేవి కృష్ణ కి ఫోన్ చేస్తుంది.

Krishna Mukunda Murari Today Episode May 18 2024 Episode 473 highlights
Krishna Mukunda Murari Today Episode May 18 2024 Episode 473 highlights

ఇక భవానీ దేవి కృష్ణ కి ఫోన్ చేసి ఒకసారి కిందకి రా నీతో మాట్లాడాలి అని ఉంటుంది. ఏంటో ఒకప్పుడు అత్తయ్య పిలిస్తే చాలా సంతోషంగా ఉండేది తనతో మాట్లాడాలంటే చాలా బాగుండేది కానీ ఇప్పుడు అత్తయ్య పిలుస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది అని అంటుంది మురారి ఏం పర్లేదు నువ్వు కంగారు పడకుండా కిందకు వెళ్లి అసలు ఎందుకు పిలుస్తుందో కనుక్కొని రా అని అంటాడు. భవాని దేవి దగ్గరికి కృష్ణ వెళుతుంది ఏంటి అత్తయ్య పిలిచారు అని అడుగుతుంది. నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను మీకు ఇది అర్థం కాకపోవచ్చు కానీ నాకు మాత్రం పూర్తిగా అర్థమైంది నువ్వు కంగారు పడొద్దు షాక్ అవ్వద్దు అని అంటుంది వామ్మో ఏం చెప్తుందో ఏంటో అని అనుకుంటుంది కృష్ణ. పర్వాలేదు చెప్పండి అత్తయ్య అని అంటుంది. మనం మీరా ఉంది కదా అదే మనం ముకుంద, తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని అంటుంది. ఒక్కసారిగా కృష్ణ షాక్ అయ్యే అలానే ఉండిపోతుంది. వీడికి ఎలా తెలిసింది ఇప్పుడు తను సరోగసి మదర్ విషయం కూడా తెలిసిపోయిందా ఏంటి, అని కంగారుగా భయంగా ఉంటుంది అప్పుడే ఏంటి కృష్ణ నేను చెప్తుంది నువ్వు నమ్మట్లేదా అని అంటుంది భవాని. లేదా అత్తయ్య తనకి ఇంకా పెళ్లి కాలేదు కదా తను ప్రెగ్నెంట్ అని మీరు ఎలా చెప్తున్నారు అని అంటుంది. ఇదిగో చెప్పాను కదా మీకు అర్థం కాదని కానీ నాకు బాగా అర్థమైంది తను వాంతులు చేసుకున్న తర్వాత ఆదర్శం వచ్చి తనతో మాట్లాడిన పద్ధతి చూస్తుంటే నాకు చాలా డౌట్ వచ్చింది. అప్పుడే అనుకున్నాను. తన కచ్చితంగా ప్రెగ్నెంట్ అది ఆదర్శవల్లే, లేదంటే అంత క్లోజ్ గా ఎలా ఉంటారు ఒకరికొకరు ఎంత ఇష్టపడుతున్నారో చూస్తున్నావు కదా ముకుంద కూడా ఆదర్శ్ వెనకాల తిరుగుతుంది ఆదర్శనం కూడా ముకుందని వదలట్లేదు. దీన్ని బట్టి చూస్తే నీకు అర్థం కావట్లేదు వాళ్ళిద్దరూ ఎంత దెగ్గర అయ్యారు అని, అది కాదు అత్తయ్య అని అంటే నీకు అంత అనుమానంగా ఉంటే తనకి టెస్ట్ చేసి నిజం ఏంటో బయట పెట్టు కానీ టెస్ట్ చేస్తే ఖచ్చితంగా పాజిటివ్ వస్తుందని నాకు అనిపిస్తుంది అని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode May 18 2024 Episode 473 highlights
Krishna Mukunda Murari Today Episode May 18 2024 Episode 473 highlights

ఇక భవానీ దేవి అలా అనడంతో కృష్ణ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. తింగరి ఈ విషయం ఎవరికీ తెలియకుండా ముకుందకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చెయ్యి అందులో పాజిటివ్ కచ్చితంగా వస్తుంది ఆ తర్వాత నేను స్లేమ్ చేయాలన్నది ఆలోచిస్తాను నాకు మాత్రం తను ప్రెగ్నెంట్ అయితే అది మన ఆదర్శ్ వాళ్ళ అయితే ఇంక అంతకన్నా కావాల్సిందేముంది. నీకు మురారిటీ బిడ్డ పుడుతున్నందుకు ఎంత సంతోషంగా ఉన్నానో అలానే ముకుంద కూడా ప్రెగ్నెంట్ అని తెలిస్తే అంతే ఆనందంతో తనని జాగ్రత్తగా చూసుకుందామని అంతకుమించి వేరే ఉద్దేశం ఏమీ లేదు అందుకే తనకి నువ్వు టెస్ట్ చేసి నిజం ఏంటో బయట పెట్టు కానీ ఈ విషయం తనకి కూడా తెలియకూడదు అని అంటుంది. అంటే ఏం మాట్లాడకుండా కృష్ణ అలాగే అత్తయ్య అని అక్కడి నుంచి పైకి వెళుతుంది. భవాని దేవి మాత్రం మనసులో కచ్చితంగా ముకుంద ప్రెగ్నెంట్ ఆ విషయం నాకు అర్థమవుతుంది రేపు ఆ విషయం అందరికీ తెలిసిపోతుంది అని అనుకుంటుంది. ఇక కృష్ణ పైకి వెళ్లి మురారితో ఈ విషయం చెప్పాలనుకుంటుంది. కృష్ణ భవాని ఇద్దరు మాట్లాడుకోవడం ముకుంద వింటుంది ఇప్పుడు ఇస్తాను చూడు కృష్ణ నీకు అసలైన ట్విస్ట్ అని అనుకుంటుంది. నిన్ను ఎలా కంగారు పెడతాను చూస్తావు కదా అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode May 18 2024 Episode 473 highlights
Krishna Mukunda Murari Today Episode May 18 2024 Episode 473 highlights

ఇక మరోవైపు ఆదర్శ ఉదయం తెల్లవారి సరికి ముకుంద కనిపించట్లేదని ఇల్లంతా వెతుకుతూ భవానీ దేవి దగ్గరికి వచ్చి అడుగుతాడు అక్కడే రేవతి కూడా ఉంటుంది. ముకుంద ఏమన్నా చిన్న పిల్ల ఎక్కడికి వెళ్తుంది జాగింగ్ కి వెళ్లి ఉంటుంది అని ఉంటుంది భవాని. తను జాగింగ్ కి వెళ్ళలేదమ్మా నేను ఆల్రెడీ తన రూమ్ లోకి వెళ్లి చూశాను జాగింగ్ బట్టలు అక్కడే ఉన్నాయి అని అంటాడు ఆదర్శ. వీడు ఆ అమ్మాయి గదిలోకి వెళ్లి బట్టలు రాకుండా ఓపెన్ చేసి చూస్తున్నాడంటే కచ్చితంగా నా అనుమానం నిజమే వీళ్ళు ఎంత చనువుగా ఉంటే అలా బట్టలు కూడా చూసే అంత దగ్గరయ్యారు. అని భవాని మనసులో అనుకుంటుంది రేవతి తను బయటికి వెళ్లిందేమో ఫ్రెండ్స్ ని కలవడానికి ఒకసారి ఫోన్ చేయకపోయావా అని అంటుంది. ఫోన్ చేశాను పిన్ని స్విచ్ ఆఫ్ అని వస్తుంది తను రాత్రి కూడా ఇంట్లో లేనట్టుంది రాత్రి నుండి కనిపించట్లేదు మీరు కూడా రాత్రి కదా తనని చూసింది ఉదయం నుంచి చూడలేదు కదా అని అంటే అవును రాత్రి చూసాము అని అంటారు ఇక ఆదర్శ కంగారుగా అయితే ముకుంద ఎక్కడికి వెళ్ళింది ఏమైనా జరిగిందా ఏంటి అని భయపడుతూ ఉంటాడు నువ్వేం టెన్షన్ పడకు తను ఎక్కడికి వెళ్ళినా వస్తుందిలే అని అంటుంది రేవతి. ఆదర్శ్ వెంటనే ముకుంద గురించి ఏమన్నా మురారి కి తెలుసు ఏమో వెళ్లి అడిగి వస్తాను అని పైకి వెళ్తాడు. రేవతి చూసావా అక్క కాబోయే పెళ్ళాం మీద ఎంత కేరింగ్ గా ఉంటున్నాడో అని అంటే ఇది ఒకందుకు మంచిదే అని అంటుంది భవాని.

Krishna Mukunda Murari Today Episode May 18 2024 Episode 473 highlights
Krishna Mukunda Murari Today Episode May 18 2024 Episode 473 highlights

ఇది మరోవైపు మురారి నిద్రలేచేసరికి కృష్ణ కంగారుగా ఉంటుంది ఏంటి కృష్ణ రాతి నుంచి నిద్ర పోలేదా ఏంటి అని అంటాడు. నిద్ర ఎలా పడుతుంది ఏసీపి సార్ అసలు అత్త ఏం చెప్పిందో మీకు తెలుసా, ఆ ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయమని చెప్పింది ఇప్పుడు ఆ టెస్ట్ చేస్తే నిజం బయటపడిపోతుంది తను సరోగసి ద్వారా మనకి పిల్లల్ని కనబోతుంది అన్న విషయం బయట పెడితే అసలు అత్తయ్య ఏమవుతుందో ఏంటో నాకు ఎలా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంత టెన్షన్ పడే కన్నా అత్తయ్య దగ్గరికి వెళ్లి నిజం చెప్పేస్తే పోతుందనిపిస్తుంది అని అంటుంది వెంటనే మురారి నువ్వు అలాంటి పని ఎప్పుడూ చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు మనం ఆదర్శ గురించి కూడా ఆలోచించాలి వాడికి ముకుందతో పెళ్లి జరగాలనిచాలా ఆశగా ఉన్నాడు ఇప్పుడు మనం ఇలా చేస్తే వాడేమైపోతాడు అసలే ఒకసారి దెబ్బతిని ఉన్నాడు కదా అని అంటాడు. మరి ఇప్పుడు ఏం చేయమంటారు ఇప్పుడు ముకుంద కి టెస్ట్ చేయమని అత్తయ్య నాతోనే చెప్పింది. ఎప్పటిలాగా టెస్ట్ చేసి తన ప్రెగ్నెంట్ కాదని చెప్పేసి అని అంటాడు. అలా చేస్తే ఎలా కుదురుతుంది ఇంట్లో అందరికీ రేపు మూడో నెల వచ్చిన తర్వాత అయినా తెలుస్తుంది కదా అని అంటుంది. కృష్ణ అప్పుడు చూసుకుందాము ఇప్పటికైతే తప్పించుకుంటాం కదా అని అంటాడు మురారి. అప్పుడే ఆదర్శ్ లోపలికి వస్తాడు. ఏమైంది అని అడుగుతాడు మురారి ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అని అంటుంది కృష్ణ. వెంటనే ఆదర్శ భయంగా ముకుంద కనిపించట్లేదు అని అంటాడు ఏంటి ముకుంద కనిపించట్లేదా అని అంటుంది. అవును రాత్రి నుండి తను ఎక్కడికో వెళ్లిపోయింది కనిపించట్లేదు అని అంటే ఫోన్ చెయ్ కృష్ణ అని అంటాడు మరి ఫోన్ చేశాను రా తన ఫోన్ స్విచాఫ్ చేసి వస్తుంది అని అంటాడు ఆదర్శ్తను ఎక్కడికి వెళ్లదులే వెతుకుదాం పద అని అంటాడు మురారి సరే అని అందరూ కిందకు వెళ్తారు.

Krishna Mukunda Murari Today Episode May 18 2024 Episode 473 highlights
Krishna Mukunda Murari Today Episode May 18 2024 Episode 473 highlights

ఇక భవానీ దేవి కృష్ణుని చూసుకోవడానికి నందు వాళ్లని రమ్మని చెప్తుంది నందు, మధు అమ్మానాన్న ఇద్దరు వస్తారు. వాళ్ళని చూసి భవాని దేవి చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది అని ఉంటుంది ఇక నందు ఎలా ఉన్నావు అని అడిగితే నేను చాలా బాగున్నాను అని అంటుంది అప్పుడే కృష్ణ వాళ్ళు కిందకి వస్తారు. కృష్ణుని చూసి వెంటనే నందు నువ్వు ప్రెగ్నెంట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని గట్టిగా ఎత్తుకొని తిప్పేస్తుంది వెంటనే భవాని దేవి అరుస్తుంది తను అసలే వట్టి మనిషి కూడా కాదు ఏంటి నువ్వు నిన్ను ఎందుకు పిలిపించారు తనని జాగ్రత్తగా చూసుకుంటా అని పిలిపించాను ఇలా చేస్తావా అని అంటుంది లేదమ్మా నేను ఏదో కృష్ణ ప్రెగ్నెంట్ అయింది అన్న ఆనందంలో అలా చేశాను ఇక నుంచి చూస్తావు కదా జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటుంది. కృష్ణ మనసులో ఆదర్శ్ పెళ్లి అని తెలిసి వీళ్ళందర్నీ పిలిపించినట్టు ఉంది అత్తయ్య అని అనుకుంటుంది. ఆదర్శ కంగారుగా ఉండటం చూసి నందు ఏమైంది అంత కంగారుగా ఉన్నావు అని అంటే రేవతి తన కాబోయే భార్య కనిపించట్లేదు అందుకే అంత కంగారుగా అన్నాడు అని నవ్వుతుంది. తన ఏమన్నా చిన్న పిల్ల ఏంటి ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వస్తుంది కదా అని అంటుంది నందు. అప్పుడే కృష్ణకి ఫోన్ వస్తుంది. కృష్ణ పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడదామని అనుకుంటుంది. ఫోన్ చేసింది ముకుందే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పక్కకు వెళ్లి ఏంటి ముకుందా ఇంట్లో ఎంత కంగారు పడుతున్నారో తెలుసా నీకోసం అలాంటిది నువ్వు నాకు ఫోన్ చేసావ్ ఏంటి అని అంటే మీతో మాట్లాడాలి కృష్ణ పర్సనల్గా నువ్వు మురారి మాత్రమే మనం కలిసే రెస్టారెంట్ కి రండి అని అంటుంది ఇప్పుడు ఏంటి అని అంటుంది కృష్ణ అర్జెంటుగా రండి అని ముకుందా ఫోన్ పెట్టేస్తుంది. కృష్ణా మురారి దగ్గరికి వచ్చి పక్కకు తీసుకువెళ్తుంది ఏంటి కృష్ణ అందరూ అక్కడ మాట్లాడుతూ ఉంటే ఇలా పక్కన తీసుకొచ్చావు అని అంటాడు. ముకుంద ఫోన్ చేసింది మనం ఎప్పుడు కలిసి రెస్టారెంట్ కి రమ్మని చెప్పింది అని అంటాడు అదేంటి ఇంట్లో ఆమె కోసం అందరి ఎదురు చూస్తుంటే అక్కడికి మనల్ని రమ్మంది అని అంటాడు. సరే వెళ్దాం పద అసలేంటో విషయం చెప్తుంది కదా అని అంటాడు. అప్పుడే భవానీ దేవి కృష్ణ మురారి ఇద్దరిని చూసి ఏంట్రా ఇంట్లో అందరూ ఉంటే మీరిద్దరూ బయట ఏం చేస్తున్నారు అని అంటుంది ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో ముకుంద ట్విస్ట్ ఇస్తుంది. రెస్టారెంట్ కి వెళ్ళిన కృష్ణమురారికి ఒక లెటర్ తీసి చూపిస్తుంది. ఆ లెటర్ చూసి వెంటనే కృష్ణ కోపంతో ముకుంద చెంప పగలగొడుతుంది. ఆ లెటర్ తీసుకొని మురారి చూసి ముకుంద మీద కోప్పడతాడు.వెంటనే కృష్ణ నీకు అసలు బుద్ధుందా నువ్వు నా బిడ్డ నీ జాగ్రత్తగా మోస్తాను అని చెప్పి ఇప్పుడు అబార్షన్ చేయించుకుని వస్తావా అని గట్టిగా అడుగుతుంది. నిజంగానే ముకుందా అబార్షన్ చేయించుకుందా లేదంటే, పెళ్లి ఆపడానికి ఇదొక డ్రామా అని తెలియాలంటే రేపటి వరకు ఆగాలిసిందే..

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella