NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari May 31 Episode 484:మురారి మిస్సింగ్ కృష్ణ కి తెలియనుందా? ముకుంద, కృష్ణల సవాల్.. రేవతి ని ఓదార్చిన కృష్ణ.. రేపటి సూపర్ ట్విస్ట్..?

Krishna Mukunda Murari Today Episode May 31 2024 Episode 484 highlights

Krishna Mukunda Murari Today Episode May 31 2024 Episode 484 highlightsభవానీ దేవి రేవతి తో నీ కొడుకు తప్పు చేశాడని నువ్వు అనుకుంటున్నావా అని అడుగుతుంది. నాకు అదే అర్థం కావట్లేదు అక్క ఈ ముకుంద బయటికి వెళ్ళింది మురారి కనిపించట్లేదు ఏమిటో నాకేం అర్థం కావట్లేదు అంటే నాకు కూడా అలానే ఉంది. అసలు మురారి కనిపిస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఇప్పుడు నా భయం ముకుంద బయటకు వెళ్లి ఏం గొడవలు తీసుకొస్తుందో అని ఏం కంప్లైంట్ ఇచ్చి పోలీసుల్ని తీసుకొస్తుందో అని భయంగా ఉంది అని అంటుంది భవాని రేవతితో భవానీ దేవి జాతరలో జరిగిన విషయాన్ని కూడా చెబుతుంది. అసలు నా కంగారు అంతా అమ్మవారి జాతరలో నేను కృష్ణ ఇద్దరం అమ్మవారి విగ్రహాన్ని పల్లకిలో మోయమని ప్రభాకర్ చెప్పాడని, పల్లకి మోసేటప్పుడు అమ్మవారు విగ్రహం పక్కకి ఒరిగిందని 50 సంవత్సరాలు ఎప్పుడు ఇలా జరగలేదని పంతులుగారు చెప్పారని భవాని దేవి రేవతితో చెబుతుంది ఆ మాటకు రేవతి కంగారుపడుతుంది. ఏం ఉపద్రవం వస్తుందో అక్క మన ఇంటి మీదకి అని భయపడుతూ ఉంటుంది ఇప్పుడు కృష్ణకి నిజం తెలిస్తే ఏం చెప్పాలి అక్క అని రేవతి అడుగుతుంది. కృష్ణ గురించి నాకు కంగారు ఏం లేదు జరిగింది చెప్తే అర్థం చేసుకుంటుంది ఇవాళ కాకపోతే రేపైనా మనవైపు ఆలోచిస్తుంది కానీ నా భయం అంతా ముకుంద గురించే అని అంటుంది భవాని. తను బయటికి వెళ్లింది ఇప్పుడు తను ప్రెగ్నెంట్ బయటికి వెళ్లి మనందరి మీద లేనిపోనివి చెప్పి నేను తలనొప్పులు ఇంటి మీదకు తెస్తుందో అని భయంగా ఉంది అనిఅంటుంది భవాని. మన ఇంట్లోనే ఉండి ఇన్ని నాటకాలు ఆడిన ముకుందా బయటికి వెళ్లి ఈ టీవీ ఛానల్స్ లో మన పరువు తీయొచ్చు, నన్ను చంపాలని చూస్తున్నారని పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, ఏ క్షణం ఏం జరుగుతుందో అని నాకు భయంగా ఉంది అని రేవతితో తన భయాన్ని చెప్తుంది భవాని.

Krishna Mukunda Murari Today Episode May 31 2024 Episode 484 highlights
Krishna Mukunda Murari Today Episode May 31 2024 Episode 484 highlights

ఇక మరోవైపు ముకుందా కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్లి కృష్ణ నెయ్యి తీసుకొని అత్తగారింటికి బయలుదేరుతుంది. కృష్ణ కోపంగా నేను నీకేమన్యాయం చేశాను ముకుందా అని అడుగుతుంది. నన్ను ఎందుకు ఇలా పట్టుకుని పీడిస్తున్నావు అని అడుగుతుంది. ముఖం మార్చుకొని నన్ను వెంబడించే అంత పగ ఏముంది అని అడుగుతుంది. నీ మీద నాకు పగ ఏం లేదు నా మురారి కి నాకు మధ్యలో నువ్వు అడ్డుగా ఉన్నావ్ అడ్డు తొలగించుకోవాలి అని అనుకుంటున్నాను అని అంటుంది ముకుందా. జీవితంలో నువ్వు చేసిన పెద్ద తప్పు ఏంటో తెలుసా నా మురారి నువ్వు పెళ్లి చేసుకోవడం. అంతకన్నా ఇంకో పెద్ద తప్పేంటో తెలుసా మురారిని వదిలేయకుండా ఇంటి పెట్టుకుని తిరగడం. అయినా నా మురారి నువ్వేమైనా ప్రేమించావా ఏదో కాంటాక్ట్ అగ్రిమెంట్ చేసుకున్నావు. కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోవాలి కదా అట్లాంటిది మురారితో కలిసి బతకాలని ఎందుకు ఆశ పెంచుకున్నవ్, అని ముకుందా కారులో వస్తూ వస్తూ కృష్ణుని అడుగుతుంది ఆ మాటలకు కృష్ణ మనం ఆశపడినంత మాత్రాన ఏదీ జరగదు ముకుందా రాసిపెట్టి ఉన్నది జరుగుతుంది. నాకు మురారి కి రాసి పెట్టింది అని అంటుంది ఏంటి రాసిపెట్టి ఉండేది అని అంటుంది ముకుంద. దేవుడు ముకుంద లాంటి ముఖాన్ని నాకు రాసిచ్చాడు కానీ నేనిప్పుడు మార్చుకొని మీరు అలా మీ ముందుకు రాలేదు అని అంటుంది ముకుంద. మనం ఏది పట్టుకుందామా? ఏది వదిలేసామా అన్న దాన్నిబట్టి మన తలరాతలు మారిపోతూ ఉంటాయి కృష్ణ మనకి నచ్చింది చేసేసి, అదే తలరాత అంటే కుదరదు కదా అని అంటుంది ముకుంద. మరి నువ్వు చేస్తుంది ఏంటి అని అడుగుతుంది కృష్ణ. నేనేం చేశాను కృష్ణ. నేను ముఖం మార్చుకోవడానికి ఎంత కష్టపడ్డానో నీకు తెలుసా, యాక్సిడెంట్నా అంతటి నేనే చేయించుకొని నా ముఖాన్ని నేను మార్చుకొని మురారిని కేసులో నుంచి క్లారిటీగా బయటికి తీసుకువచ్చాను నేను అన్ని క్లారిటీ గానే చేస్తున్నాను కృష్ణ ఒకవేళ ఆక్సిడెంట్ లో నా ప్రాణం పోయి ఉంటే ఏమయ్యేది ప్రాణం పోయేంత పగ ఉంటేనే కదా బతికి బయటికి వచ్చి ఇలా సాధించేది అని అంటుంది ముకుంద.

Krishna Mukunda Murari Today Episode May 31 2024 Episode 484 highlights
Krishna Mukunda Murari Today Episode May 31 2024 Episode 484 highlights

ఇక ముకుందా నేను ఇంత చేసి మీ పెద్దత్తయిని నమ్మించి సమ్మేరియాలో ఉంటున్నానని ఆమె బోల్తా కొట్టించి, మీ ఇంట్లో అడుగుపెట్టి, నీ కడుపులో బిడ్డని తీసేసి నా కడుపులో బిడ్డను వేసుకోవడానికి మురారితో మాటలు కలిపి నేను ఎంత చేస్తున్నానో నీకు అర్థం అవుతుందా కృష్ణ నాకున్న తెగింపు నీకు ఉన్నదా అని అంటుంది ముకుందా దీని తెగింపు అనరు బరితెగింపు అంటారు అని అంటుంది కృష్ణ. అసలు నీ ప్లేస్ లో నేను ఉన్నట్లయితే వదిలేసి నా రాత ఇంతే అని వెళ్ళిపోయే దాన్ని అని అంటుంది కృష్ణ. నీలాగా ఇలా తప్పులు మీద తప్పులు చేయను అని అంటుంది కృష్ణ. అయితే ఇప్పుడు వదిలేసి వెళ్ళు అని అంటుంది ముకుందా ఆ మాటకు కృష్ణ షాక్ అవుతుంది. ఇప్పటికైనా మించి పోయింది లేదు ఇప్పుడే ఇటు నుంచి ఇటే నీ పుట్టింటికి వెళ్ళిపో మురారిని నేను చూసుకుంటాను అని అంటుంది ముకుంద. వెళ్లిపోవాల్సిందే నేను కాదు నువ్వు అని అంటుంది కృష్ణ. మేము చాలా దూరం మురారితో ప్రయాణం చేశాను. అలాంటప్పుడు నేనెందుకు వెనక్కి తిరిగి వెళ్లాలి వెనక్కి తిరిగి వెళ్లాల్సింది నువ్వు ఇప్పుడు ప్రయాణం మొదలు పెట్టాలన్న ఆశతో నువ్వు ఇదంతా చేశావు అని అంటుంది కృష్ణ. నీ అరాటాన్ని ఎప్పటికీ నెగ్గనివ్వను అని అంటుంది కృష్ణ. తప్పు చేస్తున్నావ్ కృష్ణ మిగిలిన జీవితం ప్రశాంతంగా బతకాలంటే వెనక్కి వెళ్ళు, ఇంటికి వచ్చి నువ్వు నీ జీవితాన్ని నరకప్రాయం చేసుకోవద్దు అని కృష్ణుని హెచ్చరిస్తుంది. నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావ్ ముకుందా, నాకు ఆ దేవుడి మీద నమ్మకం ఉంది నేను ఇంటికి వస్తాను ఏదైతే అది అవుతుంది అని అంటుంది కృష్ణ. చూద్దాం అయితే నువ్వు నీ జీవితాన్ని నరకం చేసుకుంటానంటే నాకేమైంది అని అంటుంది ముకుంద, కృష్ణ కూడా చూద్దాం అని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode May 31 2024 Episode 484 highlights
Krishna Mukunda Murari Today Episode May 31 2024 Episode 484 highlights

ఇక మరోవైపు భవాని దేవి ఇంట్లో మధు ఫోన్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము మురారి కనిపించట్లేదని మీరు ఏదైనా హెల్ప్ చేస్తారా అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. మురారి తన ఫ్రెండ్స్ ఎవరికి ఫోన్ చేసినా, మురారి లేడు అని చెప్తున్నారు అని అంటాడు మధు వెంటనే రజిని తప్పిపోయిన వాడిని పట్టుకోవచ్చు కానీ తప్పించుకొని పారిపోయిన వారిని ఎలా పట్టుకుంటాము అని అంటుంది పైగా మీరా కూడా కనిపించకుండా పారిపోయింది ఇప్పుడు ఇద్దరు అనుకుని ఎక్కడికైనా పారిపోయారేమో అని అంటుంది రజిని. భవానీ దేవి తప్పుగా మాట్లాడొద్దు రజిని అని అంటుంది.నేనేం తప్పు మాట్లాడాను వదినా అని అంటుంది కన్నతల్లి రేవతికే వాళ్ళబ్బాయి మీద అనుమానం వచ్చినప్పుడు నాకెందుకు రాదు అని అంటుంది ఇప్పుడు మురారి కనిపించట్లేదు ముకుంద కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అలాంటప్పుడు అనుమానం రాదా ఏంటి అని అంటుంది రజిని. ఆదర్శ్ బెదిరించాడని మీరా వెళ్లిపోయింది నువ్వు అనుకుంటున్నది కాదు అని అంటుంది భవాని. ఏదైతే అది అయింది వదిన వాళ్ళిద్దరు దొరికేవరకు ఎవరికి తోచింది వారు అనుకుంటారు కదా అని అంటుంది రజిని. ఇక పోలీసులు భవానీ దేవి ఇంటికి వస్తారు మా మురారి గురించి ఏమైనా ఆచూకీ దొరికిందా అని అడుగుతుంది భవాని. ఎంత వెతికినా కనిపించట్లేదు, మురారి గారు మా డిపార్ట్మెంట్ మీరేం భయపడకండి, ఎక్కడ ఉన్నా కానీ వెతుకుతాను అని అంటాడు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పండి అని అంటాడు అప్పుడే కృష్ణ ముకుందా ఇద్దరు భవాని దేవి ఇంటికి వస్తారు. ముకుంద లోపలికి వస్తు, మురారి వచ్చాడో లేదో అయినా ఇప్పుడు నాకేం భయం లేదు కృష్ణుని తీసుకొచ్చాను కదా తన బిడ్డ కోసమైనా ఇంట్లో వాళ్ళని ఎదిరించి నాకు సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటుంది. మరోవైపు పోలీసులతో మాకు ఎవరి మీద అనుమానం లేదు అని భవాని చెబుతుంది. ఒకప్పుడు ముకుందా వాళ్ళ నాన్న మురారిని ఏదో చేయాలని చూసాడు కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇప్పుడు మాకు ఎవరి మీద అనుమానం లేదు అని చెప్తుంది అప్పుడే కృష్ణ లోపలికి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతుంది. ముకుంద కృష్ణ ఇద్దరు వస్తారు. వెంటనే ముకుందని చూసి రజిని వచ్చావా నీకోసమే అందరూ ఎదురు చూస్తున్నము ఉన్నటువంటి కనిపించకుండా పోతే మురారితో కలిసి ఎక్కడికైనా చెక్కెసావ్ అనుకున్నాము కృష్ణ ని తీసుకొచ్చావేంటి అని అంటుంది. ఆ మాటకి కృష్ణ మురారి ముకుందతో కలిసి వెళ్లడం ఏంటి అని అంటుంది. భవానీ దేవి ఓహో ముకుందా కృష్ణకు నిజం చెప్పలేదన్నమాట అని ఆ కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే భవాని దేవి కృష్ణతో నువ్వెందుకు వెంటనే వచ్చేసావు నాలుగు రోజులు అక్కడే ఉండమన్నాను కదా అని అంటుంది. ఎందుకు అత్తయ్య ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియకుండా ఉండడానికా అని అంటుంది కృష్ణ. మిమ్మల్ని చూసినప్పుడే అనుకున్నాను మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని అని అంటుంది కృష్ణ. ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతుంది. ఇన్స్పెక్టర్ మీరెవరు అని అడుగుతాడు నేను ఏసీబీ సార్ భార్య కృష్ణవేణి అని చెప్తుంది. అవునా సార్ ఎక్కడికి వెళ్లారో మీకేమైనా తెలుసా అని అడుగుతాడు ఇన్స్పెక్టర్,నాతో చెప్పడం ఏంటి నేను మా పుట్టింటికి వెళ్లాను అక్కడి నుంచి ఇప్పుడే వస్తున్నాను జెసిపి సార్ ఇక్కడే ఉండాలి కదా అని అంటుంది గత మూడు రోజుల నుంచి ఆయన కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళింది ఎవరికి తెలియదు అని ఇన్స్పెక్టర్ నిజాన్ని కృష్ణతో చెప్పేస్తాడు. కృష్ణ షాక్ అవుతుంది. భవాని దేవి వైపు చూస్తుంది. ఏసీబీ సార్ ఎక్కడికో వెళ్లిపోవడమేంటి పెద్దత్తయ్య ఈయన ఎం మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. ప్రాజెక్ట్ వర్క్ మీద ఎక్కడికో వెళ్లారన్నారు కదా ఈనేంటి కనిపించట్లేదు అంటున్నారు అని అంటుంది. రేవతి దగ్గరికి వెళ్లి అత్తయ్య ఏంటి నేను చెప్పేది నిజమా పెద్దత్తయి చెప్పింది నిజమా అని అడుగుతుంది. మీ అబ్బాయి గురించి మీకు తెలియదా అని అడుగుతుంది. ఇంట్లో అందరూ కృష్ణకి నిజం తెలియదని ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఆదర్శ వస్తాడు. ఇంట్లో అందరినీ అడుగుతుంది ఎవరు ఏమీ సమాధానం చెప్పరు. అత్తయ్య మీరు చెప్తేనే ఇంట్లో వాళ్ళు నిజం చెప్తారు ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతుంది.ఎవ్వరిని అడిగినా కానీ ఎవరు చెప్పరు ఏసీబీ సార్ కి ఏమైంది అని గట్టిగా అడుగుతుంది ఇక అప్పుడే ఆదర్శం ఎవరు సమాధానం చెప్పారు నేను చెప్తాను అని అంటాడు. ఆ మాటలు ఇంట్లో అందరూ షాక్ అవుతారు ఆదర్శ ఏం చెప్తాడు అని అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు.

Krishna Mukunda Murari Today Episode May 31 2024 Episode 484 highlights
Krishna Mukunda Murari Today Episode May 31 2024 Episode 484 highlights

ఇక ఆదర్శ కృష్ణ దగ్గరికి వచ్చి నేను నిజం చెప్తాను అని అంటాడు. మురారి కనిపించకుండా పోలేదు ఈ ముకుందని గర్భవతిని చేసి ఇంట్లో నుంచి పారిపోయాడు అని చెప్తాడు ఆ మాటకు కృష్ణ ఒక్కసారిగా షాక్ అవుతుంది. నేను చెప్తున్నది నిజమే అని అంటాడు ఇక వెంటనే కృష్ణ ముకుంద వైపు చూస్తుంది ఎంతకి తెగించావు అని అనుకుంటుంది మనసులో, భవానీ నీ పక్కకి రమ్మని ఇన్స్పెక్టర్ పిలుస్తాడు. భవాని ఇన్స్పెక్టర్ ఇద్దరు బయటికి వెళ్తారు. రజిని కృష్ణతో మీ ఆయన మీద అంత అబాండం వేస్తే ఏమీ మాట్లాడకుండా ఉన్నావేంటి అని అడుగుతుంది. కృష్ణ మనసులో ఈ ముకుంద ఇంతకు తెగిస్తుందని అనుకోలేదు నాబిడ్డని చూపించి మురారి ఏతను ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణమని ఇంట్లో అందరినీ నమ్మించినట్లు ఉంది ఇప్పుడుమురారి కనిపించకుండా వెళ్లిపోయాడు ఇప్పుడు నేనేం చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇదంతా ముకుంద ప్లాన్ ని కృష్ణకి అర్థం అవుతుంది. రజిని కృష్ణతో మీ ఆయన తప్పు చేశాడని నువ్వు నమ్ముతున్నావా అని అంటుంది. కృష్ణ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది ఇక భవాని దేవితో ఇన్స్పెక్టర్ ఇంట్లో ఆవిడనో గర్భవతి చేసి మీ అబ్బాయి పారిపోయాడు అని అంటున్నారు నిజంగా మురారి అలానే చేస్తే మీ అందరి నుంచి ఈ ప్రాబ్లంని ఫేస్ చేయలేక ఆయన ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఉంటాడు అని అంటాడు ఆ మాటలన్నీ ముకుంద కూడా వింటూ ఉంటుంది. మీకు బాధ కలిగించిన ఇదే నిజమో మేడం ఒకసారి ఆలోచించండి అని అంటాడు. ఇలాంటి సిచువేషన్ లో తన భార్యని మిమ్మల్ని ఫేస్ చేయలేక ఇంట్లో నుంచి పారిపోయి ఉంటాడు అని ఇన్స్పెక్టర్ భవానీతో అంటాడు భవానీ మాకైతే ఇంకా నమ్మాలని అనిపించట్లేదు అని అంటుంది. మీరు చెప్పారు కదా ఒకవేళ ఈ కోణంలో కూడా ఆలోచిస్తాను థాంక్యూ అని చెప్పి భవాని వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari Today Episode May 31 2024 Episode 484 highlights
Krishna Mukunda Murari Today Episode May 31 2024 Episode 484 highlights

ఇక మరోవైపు రేవతి బాధపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి కృష్ణ వచ్చి, పాప మా అత్తయ్య బాధపడుతుంది.మురారి ఇకనుంచి వెళ్లిపోవడానికి కారణం, సరోగసి ద్వారా ముకుంద కడుపులో మా బిడ్డ పెరుగుతుందని నిజం చెప్పాలి అలా చెప్పాలంటే నేను ప్రెగ్నెంట్ కాదు అన్న విషయం చెప్పాలి ఆ విషయం నాకు తెలియకుండా ఇంట్లో బయట పెడితే ఎట్లా అని మురారి ఇక్కడి నుంచి పారిపోయి ఉంటాడు. ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలియక బాధపడుతున్నారు అని కృష్ణ రేవతి దగ్గరికి వెళ్తుంది. మీ అబ్బాయి తప్పు చేశాడంటే మీరు నమ్ముతున్నారా అత్తయ్య అని అంటుంది ఇంకా నమ్మడం నమ్మకపోవడం వింటే కళ్ళకు కట్టినట్టు నిజం కనబడుతుంటే అని అంటుంది రేవతి. ఏ నిజం ఏం కనపడుతుంది మీకు అని అడుగుతుంది కృష్ణ. కంటికి కనిపించేవన్నీ చెవులతో వినేవి అన్ని నిజాలు అయిపోవు అని అంటుంది. మీ అబ్బాయి మీద మీకు నమ్మకం లేదేమో కానీ నా భర్త మీద నాకు నమ్మకం ఉంది ఆయన ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు అని అంటుంది కృష్ణ. నువ్వు మరీ పిచ్చి దానివి అయిపోతున్నావు నా కొడుకు వల్ల ని కాపురం ఏమైపోతుందో అని, నేను బాధపడుతుంటే నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని అంటుంది. రేవతి అన్న మాటలకు అసలు నేను గోల చేస్తుంటే మీరు నన్ను ఓదార్చల్సింది పోయి మీరు బాధపడుతుంటే నేను ఓదారుస్తున్నాను అని అంటుంది. మీ అబ్బాయి ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు అని అంటుంది కృష్ణ. మురారి అక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు ఇంట్లో పరిస్థితులు అన్ని మురారి తప్పు చేసినట్లు కనిపిస్తున్నాయి ఎప్పుడు లేనిది మీరా గర్భవతి అని తెలియగానే చేప పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎవరికైనా అనుమానం వస్తుంది కదా అప్పటికే మురారి ఇలాంటి పని చేయడు అని ముకుందని నిలదీస్తే డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి అని బెదిరించింది. దాంతో మురారి తప్పు చేశాడని నమ్మక తప్పట్లేదు అని అంటుంది రేవతి. డిఎన్ఏ చేసుకోమని ఏంటి ఏదైనా చేసుకోమంటుంది ఎందుకంటే ఆ బిడ్డ మా బిడ్డ కాబట్టి, ఈ విషయం మీకు ఎలా చెప్పాలో అర్థం కాక మీ అబ్బాయి ఇకనుంచి వెళ్లిపోయినట్టున్నాడు అని మనసులో అనుకుంటుంది కృష్ణ. ఇప్పుడు చెప్పు కృష్ణ డిఎన్ఏ టెస్ట్ చేయించుకోమని ముకుందా అన్నది అంటే తను ఎంత భరోసాగా ఉంటే ఆ మాట అంటుంది అని అంటుంది రేవతి.అత్తయ్య అవన్నీ అబద్ధాలు అయి ఉంటాయి నిజం ఏంటో నిలకడగా బయటపడుతుంది అని అంటుంది కృష్ణ.మన నమ్మకం ముందు ఏ టెస్టు నిలబడదు అత్తయ్య అని అంటుంది. మీ అందరికీ సమాధానం త్వరలోనే దొరుకుతుంది నా మీద నమ్మకం ఉంటే మీ అబ్బాయి ఏ తప్పు చేయలేదని నమ్మకంగా ఉండండి అని అంటుంది కృష్ణ. నిజాలు నిగ్గుగా నేను తేలుస్తాను అన్ని కుట్రలు బయట పెడతాను. మీరు ధైర్యంగా ఉండండి అని రేవతికి భరోసా ఇస్తుంది కృష్ణ.

ఇక మరోవైపు భవానీ దేవి మురారి నిజంగానే తప్పు చేసి ఉంటాడేమో అని భయపడుతూ ఉంటుంది. మురారి గదిలోకి వచ్చి మురారి గదిని పరీక్షిస్తూ ఉంటుంది. మురారి గదిలో మొత్తం అన్ని వెతుకుతూ ఉంటుంది. నిజంగా మురారి ముకుందా ఎలా అలాంటి రిలేషన్షిప్ లో ఉంటే ఏదో ఒక ఆధారం దొరుకుతుంది కదా అని వెతుకుతూ ఉంటుంది. మురారి ఇలాంటి పని చేశాడు అంటే నమ్మలేకపోతున్నాను ఇన్స్పెక్టర్ చెప్పినట్టు, అలాంటిదే ఏదైనా ఉండి ఉంటే నేను ఈ జన్మలో మురారిని క్షమించను అని అంటుంది. అయినా మురారి వెళ్లిపోవడానికి ఇది కారణం అయ్యి ఉండదు ఇంట్లో బంగారం లాంటి భార్య ఉంటే ఇలాగా ఎందుకు పారిపోతాడు అని అనుకుంటుంది. అప్పుడే టేబుల్ మీద రిపోర్ట్స్ చూస్తుంది భవాని. ఈ ఫైల్ ఏంటి రిపోర్ట్స్ ఏంటి అని అనుకుంటుంది. ఆ ఫైల్ ఓపెన్ చేసి భవాని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మురారి కృష్ణ గదిలో భవానికి ఒక ఫైల్ దొరుకుతుంది.అసలు ఆ ఫైల్లో భవాని ఏం చూసిందో చూపించరు. కానీ ఆవేశంగా భవాని కిందకి వెళ్తుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్లో భవానీ దేవి ఆవేశంగా కిందకి వచ్చి ఫైల్ తీసుకొని కృష్ణ అని పిలుస్తుంది. ఇంట్లో అందరూ వచ్చి ఎదురుగా నిలబడతారు. ఎంత మోసం చేశావు నన్ను అని కృష్ణని చెంప దెబ్బ కొడుతుంది. వెంటనే భవాని దేవి చేతిలో ఉన్న ఫైల్ ని తీసుకొని ఆదర్శ మీరంతా అనుకుంటున్నాను ఈ కృష్ణ గర్భవతి కాదు ఇంతకాలం ఏమి ప్రెగ్నెంట్ అవుతుందని నెత్తిన పెట్టుకొని చూసారు కదా అదేం లేదు అదంతా ఉత్తిదేవిని కూడా నిన్ను మోసం చేసింది అని రేవతి తో చెప్తాడు. ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక ముకుంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడే కాదు ఈ జన్మకి కృష్ణ కి బిడ్డలు పుట్టే ఛాన్స్ లేదు అని అందరి ముందు ఆదర్శ చెప్తాడు. ఆ మాటలకు రేవతి షాక్ అవుతుంది. కృష్ణ గొడ్రాలు అన్న విషయం భవానీ తో సహా ఇంట్లో అందరికీ తెలిసిపోయింది ఇక ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella