Krishna Mukunda Murari: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో కృష్ణ ముకుందా మురారి కూడా ఒకటి.. సరికొత్త కథనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ఈ సీరియల్ నిన్నటితో ఈ సీరియల్ 308 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఈ సీరియల్ టీ ఆర్పీ రేటింగ్ లో టాప్ త్రీ ప్లేస్ లో నిలిచింది. నిన్నటి ఎపిసోడ్ హైలైట్స్ పై ఓ లుక్ వేయండి.

ముకుందా మురారి ఎక్కడ అని రేవతిని అడుగుతుంది. ఎందుకు మరి అంతగా మురారిని పట్టుకొని తిరుగుతున్నావు అని అడగగా మురారి బాధ్యతను నాకు భవాని అత్తయ్య చెప్పింది కదా అందుకే అని ముకుందా కవర్ చేసుకుంటుంది. నువ్వు చేసే పని ఏమాత్రం కరెక్ట్ కాదని మధు ముకుందతో సెటైరికల్ గా ఉంటాడు .మురారి నార్మల్ అయ్యే వరకు కృష్ణ ఈ ఇంటికి వచ్చేవరకు నా రియాక్షన్ నీతో ఇలాగే ఉంటుంది అని స్ట్రాంగ్ గా చెప్తాడు. అప్పుడే మురారి కృష్ణని తీసుకొని ఇంట్లోకి రావడం మధు గమనిస్తాడు. సంతోషంతో తబ్బిబ్బిలై పోయి పెద్దమ్మ అటువైపు చూడు అని ఇంటి గుమ్మం వైపు చూపిస్తాడు. ఇక మురారి కృష్ణని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంటి గుమ్మం ముందు వచ్చాక కృష్ణ కి భవాని చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. దాంతో ఒక్క నిమిషం ఇంట్లోకి రావాలంటే కృష్ణ ఆలోచిస్తుంది. అప్పుడు మురారి కృష్ణ చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకు వస్తాడు. అదంతా చూసి ఇంట్లో వాళ్ళు అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. ముకుంద మాత్రం షాక్ అవుతుంది. ఇంట్లో భవాని లేకపోవడంతో ముకుంద ఆటలు సాగనివ్వకుండా రేవతి మధు ఇద్దరూ చూసుకుంటారు.

మురారి కృష్ణ కోసం ప్రత్యేకంగా కాఫీ పెట్టి తీసుకువస్తాడు. మాకు కాఫీ ఏది అని వాళ్ళమ్మ అడుగదా మీరు పెట్టుకుంటారు అన్నారుగా పెట్టుకోండి అని అంటారు. ఇంకా కృష్ణకి తన గది చూపించడానికి మురారి గతంలో కృష్ణ మురారి కలిసి ఉన్న గదికి తీసుకువెళ్లిపోతాడు. సారీ ఇది ముకుంద గది అలవాటులో పొరపాటుగా ఈ గదికి తీసుకువచ్చేసాను. ఈ గది చూస్తే నాకు గతం గుర్తుకు వస్తున్నట్టుగా అనిపిస్తుంది అని అంటాడు. అయితే ఈ రూమ్ కి షిఫ్ట్ అయిపోమని కృష్ణ మురారి కి సలహా ఇస్తుంది. అంతలో ముకుందా అక్కడికి వస్తుంది. మురారి పదా మనం షాపింగ్ కి వెళ్ళాలి అని ముకుందా బలవంతం చేస్తుంది. అప్పుడే మురారి కృష్ణను కూడా షాపింగ్ కి రమ్మని పిలుస్తాడు. కృష్ణ ఆలోచిస్తూ ఉండిపోగా వెళ్ళమ్మా అని రేవతి అక్కడికి వచ్చి చెబుతుంది. సరే అని కృష్ణ వెళ్తూ వెళ్తూ రేవతి, మధు కి థాంక్యూ చెప్పి వెళ్తుంది.

కృష్ణ దేవుడి గది ముందు నిలబడి స్వామి నువ్వు ఇంత త్వరగా నా మొర ఆలకిస్తావని అనుకోలేదు. ఏసిపి సార్ నాకు ఇంత త్వరగా దగ్గర అవుతాడని అనుకోలేదు అంటుంది. ఇక రేవతి అక్కడికి రాగానే అత్తయ్య అని సంతోషంగా నవ్వుతూ నా ఏసిపి సార్ కి గతం గుర్తుకు వచ్చింది. భార్యగా చెప్పడం లేదు డాక్టర్ గా చెబుతున్నాను అని అంటుంది. ఏసిపి సార్ కి తెలియకుండా నన్ను డైరెక్ట్ గా మా గదికి తీసుకు వెళ్ళారు అంటే ఎంటి అర్థం అని కృష్ణ సంతోషంగా చెబుతుంది. ఏసిపి సార్ మనసులో కొట్టుమిట్టాడుతున్న నేను ఏసిపి సార్ కి దగ్గర అయితే చాలు అని కృష్ణ అంటుండగా ముకుంద అక్కడికి వచ్చి అది జరగదు అని అంటుంది.

అయితే ఎలాగూ ఆదర్శ్ వస్తాడని ప్రచారం జరుగుతుంది. బహుశా ఈ రోజు ఎపిసోడ్ లో ఆదర్శ్ ను రీ ఎంట్రీ ప్లాన్ చేసరేమో.. అందుకే ఈ ఎపిసోడ్ సస్పెన్స్ ఇవ్వడానికి రాత్రి ప్రసారం చేయనున్నారు అని వినికిడి. ఆదర్శ్ వస్తె ఈ సీరియల్ మరో మలుపు తిరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఇక ఈ సీరియల్ ఈరోజు ఎలాంటి ట్విస్ట్ ఉంటుందా అని బుల్లితెర ప్రేక్షకులకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అదేంటో తెలియాలంటే సాయంత్రం వరకు ఎదురు చూడక తప్పదు.