Krishna Mukunda Murari: మురారి కృష్ణ కి ఒక చీర ఇస్తాడు. ఇది ఎయిర్పోర్ట్ కి వెళ్లేటప్పుడు కట్టుకొని రమ్మని చెబుతాడు. యూఎస్ఏ లేక నేను నిన్ను మిస్ అవుతాను అప్పుడు నీకు వీడియో కాల్ చేయొచ్చు కదా అని మురారి కృష్ణ పర్మిషన్ తీసుకుంటాడు. కృష్ణ కాల్ చేయమని చెబుతుంది. సరే అని మురారి వెళ్తాడు. మురారి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ ఎవరిని చూసినా నా వాళ్ళు అన్న ఫీలింగ్ రావడం లేదు కానీ నిన్ను చూస్తే నా మనిషి అన్న ఫీలింగ్ వస్తుంది మురారి అన్న మాట తలచుకొని కృష్ణ బాధపడుతూ ఉంటుంది.

రేవతి మధు ఇద్దరూ మురారి అమెరికా వెళుతున్నందుకు బాధపడుతూ ఉంటారు. మళ్ళీ మురారి తిరిగి వస్తాడా రాడా ఏం జరుగుతుందో అన్న భయంతో ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ముకుంద అక్కడికి రాదా రేవతి పిలుస్తుంది. నువ్వు మురారి ఇద్దరు అమెరికా వెళుతున్నారు కదా అని అనగానే.. అత్తయ్య మీ నోట్లో నుంచి ఇలాంటి మాట వినగానే నాకు చాలా సంతోషంగా ఉంది అని వెంటనే వెళ్లి కాఫీ తెచ్చుకొని తాగుతుంది. అప్పుడు రేవతి నువ్వు మురారి అమెరికా వెళ్తున్నారు కదా ఇంకా అక్కడి నుంచి తిరిగి రారా అని రేవతి అనగానే.. అవును అత్తయ్య తిరిగి రాము అని ముకుందా అంటుంది. నాకు తిరిగి ఈ నరకంలో రావడానికి ఇష్టం లేదు అని అంటుంది ముకుంద. ఆ మాటకు కోపం వచ్చిన రేవతి తనని కొట్టాబోతుంది. ఇక కోపం వచ్చినా మధు ఈ విషయాన్ని భవాని పెద్దమ్మకు చెబుతాను అని అంటాడు. ఒక విషయం చెప్పనా మధు మిమ్మల్ని భవాని అత్తయ్య ఎప్పుడైతే నమ్మడం మానేసిందో.. అప్పుడు నా మాటలు నమ్మడం మొదలుపెట్టింది.

అలాంటిది ఇక కృష్ణ ఇంట్లోకి రావడానికి సాహసం కూడా చెయ్యదు. కృష్ణ ఎలాగో భవాని అత్తయ్యకు నచ్చడం లేదు. ఇక కృష్ణ ఎప్పటికీ ఈ ఇంట్లోకి రాదు కలవదు అని ముకుందా అంటున్న మాటలను ఇంట్లోకి వస్తున్న మురారి ఎవరు ఆ కృష్ణ మన కృష్ణవేణి గారి నేనా నువ్వు అంటుంది అని మురారి అడగగా అవును అని మధు అంటాడు. తననే అంటున్నాను అని ముకుందా అంటుంది. తను భవాని అతనికి ఇష్టం లేదు కదా అలాంటప్పుడు మన ఇంట్లోకి ఎలా వస్తుంది. ఎలా మన అందరితో కలిసి ఉంటుంది. పైగా తను ఆత్మాభిమానం కలిగిన మనిషి తను మన అందరితో కలవదు అని నేనే అంటున్నాను అని ముకుందా మురారి ముందు ఒప్పుకుంటుంది. అవునా కాదా మురారి అని కన్వీనియన్స్ గా మాట్లాడుతుంది. నేను ఇప్పుడే కృష్ణవేణి వాళ్ళింట్లో నుంచి వస్తున్నాను తనకి గ్యాస్ సిలిండర్ అయిపోతే పెట్టించాను. అంతేకాకుండా తనకి ఒక చీర కూడా గిఫ్ట్ గా ఇచ్చాను అని మురారి అనగానే ముకుందా షాక్ అవుతుంది. రేవతి మాత్రం నీకు తను ట్రీట్మెంట్ చేస్తుంది కదా ఇలాంటి గిఫ్ట్ లు కొనివ్వమని ఇవ్వమని సలహా ఇస్తుంది.

కృష్ణ మురారి ఇచ్చిన చీర కట్టుకుంటుంది. అద్దంలో చూసి మురిసిపోతూ ఉండగా మురారి అక్కడికి వస్తాడు. కృష్ణవేణి గారు అని పిలుస్తాడు అదేంటి నన్ను కృష్ణ అని పిలుస్తాడు కదా ఎలా పిలుస్తాడు ఏంటి అని కృష్ణ ఆలోచనలో పడుతుంది. నన్ను మామూలుగా పిలవండి అని అంటే లేదు ఈ విషయంలో మాత్రం మీరు అడ్జస్ట్ అవ్వాలి. మిమ్మల్ని కృష్ణవేణి గారు అనే పిలుస్తాను అని మురారి అంటాడు. మనసులో మాత్రం మా పెద్దమ్మ కి ఇప్పటికే మీరు ఇష్టం లేదు. మిమ్మల్ని కృష్ణ అని ఏకవచనంతో పిలిస్తే మళ్లీ తను ఎక్కడ నిన్ను నాకు ఇంకా దూరం చేస్తుందో అని మురారి మనసులో అనుకుంటాడు. మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను. ఈ చీరలో మీరు చాలా బాగున్నారు అని మురారి అంటాడు మీకు కాఫీ తీసుకువస్తాను అని కృష్ణ వెళ్ళబోతుండగా.. నేను కాఫీ కోసం కాదు, మీతో టైం స్పెండ్ చేయాలని ఇక్కడికి వస్తున్నాను అని మురారి అంటాడు.

రేవతి, మధు ఇద్దరూ మురారి ఎలా అమెరికా వెళ్ళకుండా అపాలా అని ఆలోచిస్తూ ఉంటారు. నా కొడుకు కోడలు ఇద్దరు కలిసి ఉండాలి ఏం చేయాలో చెప్పు మధు అని రేవతి అంటుంది. చెప్తే చేస్తావా అని మధు అంటాడు. భవాని పెద్దమ్మ ముకుందతో మురారిని ఇచ్చా అమెరికాకు పంపిస్తుంది వాళ్ళు ఎలాగో తిరిగిరారు అని ముకుంద చెబుతుంది కదా.. అదే మనం కృష్ణను ఇచ్చి మురారితో పంపిస్తే ఎలా ఉంటుంది. అదే కృష్ణ మురారి ఇద్దరూ పెళ్లి చేసుకొని ఈ ఇంటికి వచ్చారు కదా.. ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవడానికి వాళ్ళని లాంగ్ ట్రిప్ పంపిద్దామని మధు అంటాడు. అప్పుడే భవాని బాగుందిరా ఆ పని చెయ్యి అని అంటుంది. భవాని మాట విని రేవతి మధు ఇద్దరూ షాక్ అవుతారు. భవాని లోపలికి వచ్చి మధు చంప చెల్లుమనిపిస్తుంది. అక్కా అని రేవతి అనగానే.. నువ్వుండు రేవతి ఏంట్రా నువ్వు మా చెల్లికి ఏంటి హిత బోధ చేస్తున్నావని మధుని నిలదీస్తుంది భవాని. ఇంటి పరువు మర్యాద అన్నింటిని మంట కలుపుదామని అనుకుంటున్నావు. మా అందరినీ మాయ చేసి వాళ్ళని పంపించాలని అనుకుంటున్నావు.

రేవతి వాళ్లు మనము మురారిని కూడా చంపడానికి వెనకాడ లేదు. అగ్రిమెంట్ మ్యారేజ్ అని తెలిసి కృష్ణ ఇంట్లో నుంచి గెంటేసినందుకు వాళ్ళు ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. ఫేస్ మార్చేసి వాళ్లతో పాటు తీసుకువెళ్లడానికి ట్రై చేశారు అని భవాని అంటుంది. నాకెందుకో వాళ్లే ఇలా చేశారు అంటే నమ్మబుద్ధి కావడం లేదు అక్క. ఎవరో బయట వాళ్లే ఇదంతా చేశారు అని రేవతి అంటుంది. అదేంటంటే మీరు ఇంతలా చెబుతున్నారు రేవతి నమ్మకపోవడం మీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం బాధగా ఉంది అని ముకుంద ఇంకాస్త ఆజ్యం పోసింది. ఇప్పుడు చెప్పే మాట మిమ్మల్ని బాధ పెట్టిన పర్వాలేదు ఇక మురారి కి గతం గుర్తు రాకుండా ఉండడమే మంచిదని నాకు అనిపిస్తుంది అని భవాని అంటుంది. మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం.