Krishna Mukunda Murari: ముకుందా కావాలని అత్తయ్య నేను నిన్న రింగు కొనుక్కున్నాను, అది పోయింది. ఇప్పుడు వేణి గారి ఉన్న రింగు చూస్తే నా రింగు గుర్తుకు వచ్చింది. గేమ్ స్టార్ట్ చేసింది అని అంటాడు మధు మనసులో, ఇప్పుడు ఈ రింగ్ మీద పంచాయతీ పెడుతుందేమో.. ఏసీబీ సారు ఇచ్చాడు అని చెప్తే అందరూ ఆయన తిడతారేమో అని మనసులో అనుకుంటుంది కృష్ణ. అంత అజాగ్రత్త అయితే ఎలాగా అని అంటుంది భవానీ. అత్తయ్య ఇప్పుడు చెప్పొచ్చు చెప్పకూడదు కానీ వేణి గారి చేతికి ఉన్న రింగు నాదే అత్తయ్య అని ముకుందా అంటుంది. వెంటనే మురారి ఏం మాట్లాడుతున్నావ్ ముకుందా అని అంటాడు. కావాలనే కృష్ణని ఇరికిస్తుంది అని,అనుకుంటాడు మురారి. వెంటనే భవానీ దేవి ఆ రెండు నీది కాదా అని కృష్ణ అని అడుగుతుంది. మురారి చెప్పబోతూ ఉండగా, కృష్ణ వెంటనే ఆపి మీరేం మాట్లాడద్దు సార్ అని అంటుంది. వెంటనే భవానీ దేవి ఆ రింగు నీదా కాదా అని అడుగుతుంది కృష్ణుని వెంటనే కృష్ణ నాది కాదు అని చెప్తుంది. నువ్వు డాక్టర్ చదివి వేరే వాళ్ళ రింగ్ ఎలా దొంగతనం చేసావు అని అంటుంది భవాని దేవి. కృష్ణ నేను దొంగతనం చేయలేదు బయట కనిపిస్తే, పెట్టుకున్నాను అని అంటుంది. అయితే నా రింగ్ నాకు ఇచ్చేసేయ్ అని అంటుంది ముకుంద. కృష్ణ మురారి ఇద్దరూ చాలా ఫీల్ అవుతారు కృష్ణ తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఆ రింగ్, రాదు, మురారి నేను తీస్తాను ఇటు ఇవ్వండి అని చెయ్యి పట్టుకోబోతు ఉండగా భవాని దేవి హ్యాపీ వద్దు నాన్న అని పెద్దగా అరిచి దానము చేశాను అనుకుందాం వదిలేసేయ్ అని అంటుంది భవాని. ఆ మాటకు వెంటనే కృష్ణ చాలా బాధపడుతుంది. ఎక్కడ మురారి తన చేతిని పట్టుకుంటే గతం గుర్తుకు వస్తుందో అని భవానీ దేవి భయపడుతుంది. ఇక కృష్ణ వెంటనే పుజలోంచి లేచి బాధ పడుతూ వెళ్ళిపోతుంది. ఇక మురారి కి లేచి వెళ్ళిపోతాడు.

అక్కడితో పూజ ఆగిపోతుంది. భవాని పంతులు గారితో ఈ దోష నివారణ పూజ రెండు రోజుల తర్వాత చేద్దామని చెబుతుంది. ఇంట్లో వాళ్ళందరూ పక్కకు వెళ్లిపోయిన తర్వాత ముకుంద భవానీ దేవితో అత్తయ్య నేను మీ దగ్గర ఒక నిజం దాచాను. కృష్ణ చేతికి ఉన్న రింగ్ నాది కాదు. ఆ రింగ్ మురారి ఏ స్వయంగా కృష్ణ చేతికి తొడగడం నేను చూశాను. ఇప్పుడు ఆ నిజం ఒప్పుకుని ఇదంతా చేశాను. కానీ ఆ కృష్ణ తెలివిగా మురారి దగ్గర మార్కులు కొట్టేయడానికి ఆ నిందను తన మీద వేసుకుంది అనగానే.. తప్పు చేసావు ముకుందా. అనవసరంగా నువ్వు మురారి దృష్టిలో తప్పు చేశావని అనుకుంటాడు. ఇలాంటి తప్పులు నాకు చెప్పకుండా ఇంకెప్పటికీ చేయకు.. ఇదే నిన్ను ఆఖరి సారి క్షమించడం అని భవాని అక్కడి నుంచి చిరాకుగా వెళ్ళిపోతుంది.

శకుంతల కృష్ణుని పూజ ఎలా జరిగింది అని అడుగుతుంది. కృష్ణ బాగా జరిగింది అని చెబుతుంది. కానీ కృష్ణ ముఖం ఏదోలా ఉందని అర్థం చేసుకున్న శకుంతల ఏమైంది, మీ పెద్దత్త ఏమైనా అడిగిందా? ఏమైనా అయిందా అని అడుగుతుండగా ఏం లేదు అని చెబుతుంది. అప్పుడే నందిని కృష్ణ దగ్గరికి వస్తుంది. కృష్ణ ఎంత జరిగినా కూడా వాళ్ళ చిన్నమ్మకి ఏమి చెడుగా చెప్పకపోవడంతో కృష్ణ ఆటిట్యూడ్ చూసి చాలా మంచిది అని అనుకుంటుంది. కృష్ణ మా అమ్మ ఏమో హాస్పిటల్ లో ఏదో జరిగింది అని చెబుతుంది. ఏది నమ్మాలో అర్థం కావడం లేదు అని నందిని అంటే.. కొన్ని కొన్ని సార్లు మనం కళ్ళతో చూసిన కూడా నమ్మకూడదు కదా ఇది కూడా అంతే అని అంటుంది. నేను నీకు కచ్చితంగా హెల్ప్ చేస్తాను అని నందిని కృష్ణ తో చెబుతుంది.

నీకు అర్థం అవుతుందా ముకుంద, కృష్ణ విషయంలో ఎందుకు నువ్వు పెద్దమ్మ ఇదంతా చేస్తున్నారు అని మురారి సూటిగా నిలదీస్తాడు. అప్పుడే ముకుందా అవును కావాలనే చేశాను. మేమిద్దరం తన గురించి అంతగా చెప్తున్నా నువ్వు వినడం లేదు. మా అమ్మ కంటే ఇక్కడ నన్ను ఎవరూ ఎక్కువగా ప్రేమించరు. తనే కృష్ణనీ నమ్ముతుంది. నువ్వు మా అమ్మ కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని మురారి అడగగా.. అవును అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను అని ముకుంద గట్టిగా చెబుతుంది. అప్పుడు ఇదిగో ఈ చీర కృష్ణ కోసమే తీసుకొచ్చాను. నువ్వు బాధపడటం ఇష్టం లేదని పది షాపులు తిరిగి మరీ తీసుకువచ్చాను అని.. తను ముందుగా కొట్టేసిన చిరునవ్వు మురారి కి ఇస్తుంది. ఇంకో విషయం చెప్పనా మురారి నువ్వు కృష్ణ చేతికి రింగు తోడగడం నేను చూశాను. కానీ ఆ విషయం నేను పెద్దత్త ఏదో చెప్పలేదు. అది నీ మీద నాకున్న ప్రేమ. ఇదే విషయం పెద్దత్తయ్యకి తెలిస్తే ఎంత బాధ పడుతుందో తెలుసా అని ముకుందా అంటుంది. కృష్ణకు చీర ఇవ్వమని ముకుందా ఇస్తుంది. మనసులో మాత్రం వారు వన్ సైడ్ చేశాను. ఇక నా మీద మురారి కి ఎలాంటి అనుమానం ఉండదు అని ముకుంద అనుకుంటుంది.

ఇక మురారి సంతోషంగా కృష్ణ దగ్గరకు ఆ చీర తీసుకుని వెళ్తాడు. మళ్ళీ షాపింగ్ చేశారా అని కృష్ణ అడుగుతుంది. మీరు ఇచ్చిన చీర నిజంగానే నా దగ్గర లేదు అది ఎక్కడ పెట్టానో కూడా గుర్తు రావటం లేదు. అక్కడే మర్చిపోయాను అని అంటే ముకుందా నీకోసం నీ చీర తీసుకువచ్చింది అని మురారి అంటాడు. ఓకే ఇందాక అందరూ ముందు అర్పించి ఇప్పుడు మురారి దగ్గర మార్కులు కొట్టడానికి చేరి ఇచ్చింది అని కృష్ణ అర్థం చేసుకుంటుంది. ముకుంద చాలా మంచిది అని మురారి అంటే తనే మంచిదైతే మనిద్దరికీ ఎన్ని కష్టాలు ఎందుకు అని కృష్ణ మనసులో అనుకుంటుంది. నందిని మురారి అమెరికా ప్రయత్నాన్ని విరమించుకోమని భవానీతో చెబుతుంది కానీ భవాని మాత్రం వాళ్ళ ఫ్రెండ్ వరలక్ష్మితో మరో రెండు రోజుల్లో ముకుందాము వాళ్ళు వచ్చాక ఏం చేయాలో ముకుంద చెబుతుందని రేవతి నందిని ముందే చెబుతుంది. ఆ మాటలు విని వాళ్ళిద్దరూ షాక్ అవుతారు.

రేపటి ఎపిసోడ్ లో, అందరూ దీపావళి చేసుకుంటూ ఉంటారు. కృష్ణ మురారి ఇచ్చిన చీర కట్టుకొని వస్తుంది. అది చూసి సంతోషిస్తాడు మురారి. కృష్ణ మురారి కలిసి క్రాకర్స్ వెలిగిస్తూ ఉంటారు అది చూసి భవానీ దేవి కోపంగా ఉంటుంది. అనుకోకుండా కృష్ణచీర కి నిప్పు అంటుకుంటుంది. మురారి వెంటనే కృష్ణ అని గట్టిగా అరిచి నిప్పు ఆర్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.