Krishna Mukunda Murari: మురారి కృష్ణ దగ్గరకు ఆ చీర తీసుకుని వెళ్తాడు. మళ్ళీ షాపింగ్ చేశారా అని కృష్ణ అడుగుతుంది. మీరు ఇచ్చిన చీర నిజంగానే నా దగ్గర లేదు అది ఎక్కడ పెట్టానో కూడా గుర్తు రావటం లేదు. అక్కడే మర్చిపోయాను అని అంటే.. ముకుందా నీకోసం నీ చీర తీసుకువచ్చింది అని మురారి అంటాడు. ఓకే ఇందాక అందరూ ముందు అర్పించి ఇప్పుడు మురారి దగ్గర మార్కులు కొట్టడానికి చేరి ఇచ్చింది అని కృష్ణ అర్థం చేసుకుంటుంది. ముకుంద చాలా మంచిది అని మురారి అంటే తనే మంచిదైతే మనిద్దరికీ ఎన్ని కష్టాలు ఎందుకు అని కృష్ణ మనసులో అనుకుంటుంది. అవును ఇందాక ఎందుకు తప్పు నీ మీద ఎందుకు వేసుకున్నావు అని అంటాడు మురారి. మీ మీద మాట పడటం నాకు ఇష్టం లేదు అని కృష్ణ అంటుంది.

ఆ మాట వినగానే మురారి సంతోషిస్తాడు. మనసులో మాత్రం కృష్ణవేణి గారితో నాకు గతంలో ఏదో పరిచయం ఉండే ఉంటుంది అదేంటో అడిగి తెలుసుకోవాలి అని అనుకుంటాడు. మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను మీరు నాకు నిజమే చెప్పాలి అని మురారి కృష్ణ ని అడుగుతాడు. నేను మీకు గతంలో ఫ్రెండ్ నా లేకపోతే మీ స్టడీ కి స్పాన్సర్ నా అని మురారి అడుగుతారు అప్పుడు కృష్ణ మీరు నాకు విద్యాదాత అని చెబుతుంది మీరు అబద్ధం చెప్పినా మీ కళ్ళు అది అబద్ధమని స్పష్టంగా చెబుతున్నాయి. ఈ చీరని సాయంత్రం మీరు కట్టుకొని రండి. మీరు ఎవరికీ భయపడకండి అని చెప్పి మురారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

మధు మధు అంటూ రేవతి మధు దగ్గరకు బాధ పడుతూ వస్తుంది. భవాని అక్క తన అమెరికా ఫ్రెండ్ వరలక్ష్మి తో ముకుంద మురారి గురించి ఏదో చెబుతుంది అది ఏంటో నాకు అర్ధం కావట్లేదు అని రేవతి బాధపడుతూ చెబుతుంది. కృష్ణ చాలా మంచిది మనం ఎంతగా అవమానిస్తున్నా కూడా తను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ముకుందా కృష్ణ చేతికి ఉన్న రింగ్ తనది అని చెప్పింది కానీ, అది కృష్ణదే ఈ విషయం నాకు ఎలా తెలుసు అనుకుంటున్నావా.. ఇందాక ముకుందే పెద్దమ్మతో చెప్పింది. ఇవన్నీ తెలిసినా కూడా మనం మౌనంగానే ఉంటున్నాము. నీ కొడుకు కోడలు జీవితం గురించి నువ్వు పెద్ద పెద్దమ్మతో మాట్లాడలేకపోతున్నావు. నువ్వు ఎప్పుడూ భయపడుతూ అడుగుతావు కదా.. ఈసారి కూడా అలాగే అడగమని చెప్పగా, పండగ అయిపోయిన తర్వాత కచ్చితంగా అడుగుతాను అని రేవతి అంటుంది.

అందరూ దీపావళి చేసుకుంటూ ఉంటారు. కృష్ణ మురారి ఇచ్చిన చీర కట్టుకొని వస్తుంది. అది చూసి సంతోషిస్తాడు మురారి. ముందుగా భవాని 1000 వాలా కాలుస్తుంది. ఆ తర్వాత మురారి చిచ్చుబుడ్డి వెలిగిస్తాడు. మధు భూ చక్రం కాలుస్తాడు. కృష్ణవేణి గారు మీరు కూడా రండి అని మురారి పిలుస్తాడు. కృష్ణ మురారి కలిసి క్రాకర్స్ వెలిగిస్తూ ఉంటారు. అది చూసి భవానీ దేవి కోపంగా ఉంటుంది. అనుకోకుండా కృష్ణచీర కి నిప్పు అంటుకుంటుంది. మురారి వెంటనే కృష్ణ అని గట్టిగా అరిచి నిప్పు ఆర్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మధు నీళ్లు తీసుకురాగానే మురారి ఆర్పేస్తాడు. కృష్ణ కళ్ళు తిరిగిపోయి మురారి మీద పడిపోతుంది మురారి తీసుకువెళ్తారు. మిగతా వాళ్ళందరూ కృష్ణుని చూడడానికి వెళ్తారు భవాని నందిని ముకుందా ఇంట్లోనే ఉండిపోతారు. రేవతి రాగానే తనకు ఎలా ఉంది అని అడగగా ఇప్పుడు బానే ఉంది అని అంటుంది. మురారి ఎక్కడ ఇంకా రాలేదు అక్కడే ఉన్నాడు అని చెబుతుంది. కృష్ణకి ఇంత త్వరగా తగ్గిపోయింది అంటే అది ఖచ్చితంగా యాక్టింగ్ అయి ఉంటుంది అని ముకుందా అంటుంది ఏం మాట్లాడుతున్నావ్ ముకుందా మేము రీల్స్ చేయడం లేదు అది రియల్ అని మధు అంటాడు. అదంతా యాక్టింగ్ అని నాకు అనిపిస్తుంది అని భవాని అంటుంది.

రేపటి ఎపిసోడ్ లో మీకు ప్రమాదం జరిగినప్పుడు మిమ్మల్ని వేణి అని కాకుండా కృష్ణ అని ఎందుకు పిలిచాను అని మురారి కృష్ణుని అడుగుతాడు. అయినా గతంలో మీరెవరు.. నేను ఆ వేణి గారిని ఒక్కదానినే చదివించానా అని మురారి భవానిని అడుగుతాడు. లేదు నాన్న చాలామందిని చదివించావు అని భవాని అంటుంది. మరి వాళ్లంతా నాకెందుకు గుర్తుకు రావడం లేదు. ఈ కృష్ణవేణినే ఎందుకు గుర్తుకు వస్తుంది అని మురారి భవానిని సూటిగా ప్రశ్నిస్తాడు. దేనితోని ఎందుకు మాట్లాడాలనిపిస్తుంది. పదే పదే కలవాలనిపిస్తుంది అని వాళ్ళ పెద్దమని నిలదీసి అడుగుతాడు. కృష్ణ నీ తనికి దూరం చేయడం ఇష్టంలేని మురారి భవానిని నిలదీసి అడుగుతాడు. ఇక భవాని ఏం సమాధానం చెబుతుందో తరువాయి భాగంలో చూద్దాం. మధు చెప్పినట్టుగా రేవతి కూడా ముకుందా మురారి లను ఎందుకు అమెరికా పంపిస్తున్నారు కూడా అడిగి తెలుసుకుంటుందో లేదో చూడాలి.