Krishna Mukunda Murari: మురారి ఎందుకు కృష్ణకు కనెక్ట్ అవుతున్నాడు అని భవాని మనసులో అనుకుంటుంది. అందరూ కూర్చోండి అంటూ మాటల మధ్యలో మురారి నీ ఏసిపి సార్ అని కృష్ణ పిలుస్తుంది. అప్పుడు ఏమని పిలిచారు అంటే.. మీకు మా ఇంట్లో ఏసీ లేదు కదా అని కృష్ణ అంటుంది. అవన్నీ మా ఇంట్లో ఉన్నాయిగా తీసుకోమని రేవతి అంటుంది. అప్పుడు మీరు నాకు సొంత వాళ్ళు అవుతారు. అలా అనుకుంటే ఏమైనా నష్టమా అని మురారి అంటాడు. నేనేమైనా నీకు హెల్ప్ చేయనా కృష్ణని రేవతి అడగగానే.. అప్పుడు మీరు నాకు సొంతవాళ్లు అవుతారు అని అంటారా అని మురారి అంటాడు.

ఆ తర్వాత కృష్ణ అందరూ చేత ఒక ఆట ఆడిస్తుంది. అక్కడ ప్లేట్లో ఉన్న వస్తువులన్నింటినీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వేస్తే అది ఏంటో తను ఐడెంటిఫై చేసి చెబుతాను అని చెబుతోంది. ఒక్కొక్కరు వేసినవి అన్నీ కూడా కృష్ణ కరెక్ట్ గా చెబుతుంది. కృష్ణ అది ఎలా చేశారు అని అడగగా తర్వాత చెబుతాను అని కృష్ణ అంటుంది. ఇక బిర్యానీ రెడీ అయిపోయి అందరూ కూర్చొని బిర్యానీ తింటూ ఉంటారు. అప్పుడు మురారి మీరు ఎలా చేశారు అని అడగగా.. వెనక్కి చూడండి అక్కడ అద్దం ఉంది అందులో నుంచి చూసి చెప్పాను అని కృష్ణ అంటే మీది చాలా చిన్న పిల్లల మనస్తత్వం అని మురారి అంటాడు. వేణి బిర్యానీ చాలా బాగుంది అనే భవాని అంటుంది. మురారి ఇంకో నెల వరకు నువ్వు ఇలాంటి బిర్యాని తినలేవు. ఎందుకు పెద్దమ్మ అని మురారి అడగగా.. నిన్ను బెటర్ ట్రీట్మెంట్ కోసం ముకుందతో కలిసి అమెరికాకు పంపిస్తున్నాను అని భవాని అంటుంది. ఇక కృష్ణ సైలెంట్ అవుతుంది.

కృష్ణ రాత్రి తెల్లవార్లు భవాని చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా మురారిని అమెరికా తీసుకెళ్లకుండా ఆపాల అని కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ ఆలోచనలో ఉండి నిద్రపోకుండా ఉంటుంది. కృష్ణ నిద్ర లేచిందా లేదా తనకు ఏం టిఫిన్ తేవాలా అని అడుగుదామని మధు కృష్ణ ఇంటికి వెళ్తాడు. అప్పటికే కృష్ణ కి జ్వరం వచ్చిందని అర్థం చేసుకుంటాడు ఇక ఈ విషయాన్ని ఎలాగైనా మురారి కి తెలిసేలాగా చేయాలి అని అనుకుంటాడు. పెద్దమ్మ పెద్దమ్మ అంటూ మధు పిలుస్తాడు. భవాని కోపంగా చూడగానే మధు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడే వస్తాను అని మురారి మధు దగ్గరకు వెళ్తాడు. ఏం లేదు అని చెప్తాడు. ఎవరో చెప్పడం దేనికి నేనే తెలుసుకుంటాను అని కృష్ణ దగ్గరకు వెళ్తాడు.

అప్పటికే కృష్ణ కి హై ఫీవర్ అని మురారికే అర్థమవుతుంది. ఇంత ఫీవర్ ఉంటే నాకు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు పదండి హాస్పటల్ కి వెళ్దామని మురారి అంటాడు. వద్దు అని కృష్ణ అంటుంది. నేను కార్ తీసుకొస్తాను అని మురారి ఇంటికి వెళ్తాడు అప్పుడే భవాని మధు ని అడుగుతుంది. ఏమైంది ఇందాక ఏదో చెప్పబోయే ఆగిపోయావు ఏంటి అని అడగగా కృష్ణకి ఫీవర్ అని చెబుతాడు. ఆ విషయం మురారితో చెప్పవా అని అడిగితే లేదు పెద్దమ్మ చెప్పలేదు అని అంటాడు. అంతలో మురారి గబగబా ఇంట్లోకి వస్తుండగా ఏమైంది మురారి అని అడగగా కృష్ణ కి ఫీవర్ వచ్చింది అని చెబుతాడు.

అయితే మధు చేత ఏవో ఒకటి తెప్పిస్తాను అని భవాని అంటే పెద్దమ్మ నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి. వేణి డాక్టర్ కి ఎవరూ లేరు కదా తనని ఇంట్లో ఉంచుకున్న ఎందుకు అక్కడ ఉంచారు అని మురారి అడుగుతాడు. సారీ పెద్దమ్మ నేను వేరే డాక్టర్ని హాస్పిటల్కి తీసుకు వెళ్తున్నాను అని మురారి కరాకండిగా చెబుతాడు. అయ్యో అదేం లేదు మురారి నువ్వు లేని డాక్టర్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళు ముకుందా మురారి కి తోడుగా వెళ్ళు అని భవాని చెబుతుంది.

కృష్ణ సొమ్మసిల్లి పడిపోయి ఉంటుంది. మురారి కృష్ణను హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. కృష్ణ మురారిని ఎత్తుకుపోతుండగా ముకుందా వద్దులే డాక్టర్స్ తీసుకెళ్తారు అని అంటే.. ఈ వేణి డాక్టర్ కి నాకు గతంలో చాలా దగ్గర పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది అని అనుకుంటాడు. ఇక మురారినే కృష్ణను ఎత్తుకొని హాస్పటల్లోకి తీసుకువెళ్తాడు.