Krishna Mukunda Murari: ముకుంద ఆదర్శ్ గురించి నేను మురారి మీ దగ్గర ఒక విషయం దాచం పెద్ద అత్తయ్య అని భవానీతో అంటుంది. పండగ రోజు మీ అందరి ముడ్ని స్పాయిల్ చేయొద్దని మురారి అన్నాడు. కానీ మీరు ఆదర్శ్ వస్తాడని ఇంకా నాకు నమ్మకం ఉంది అని అంటున్నారు. కాబట్టి మిమ్మల్ని ఇంకా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను నిజం చెబుతున్నాను అని ముకుందా అంటుంది. ఏంటి ముకుందా నిజం త్వరగా చెప్పు అని భవాని అడుగుతుంది. ఆదర్శ్ ఇక ఎప్పటికీ ఇంటికి రావాలని అనుకోవడంలేదని ఇల్లు అనే ప్రస్తావనే తన దగ్గర తీసుకురావద్దని, ప్రస్తుతానికి ఫోన్ కూడా వాడడానికి ఇష్టపడటం లేదని.. కేవలం వాకి టాకీలు మాత్రమే ఉపయోగిస్తున్నాడని ముకుందా చెబుతుంది. ఆ మాట విన్న భవాని వెంటనే షాప్ కి గురవుతుంది. నేను నా కొడుకుని సరిగ్గా పెంచలేదా అంటూ బాధపడుతుంది. అందరి ముందే వెక్కి వెక్కి ఏడుస్తుంది.

ఇక భవానీ దేవిని అందరూ ఓదారుస్తారు. నేనే ఇలా అయిపోతే పిల్లలు ఏం అయిపోతారు. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేసేయండి. ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా నేను బాగున్నాను అంటే ఇక నాకేం కాదు అని భవాని తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఆ తరువాత కృష్ణ ఆలోచిస్తూ ఉండగా రేవతి అక్కడికి వస్తుంది. ఏంటి కృష్ణ ఆలోచిస్తున్నావు అని అడగగా.. అసలు భవాని అత్తయ్య ఏసిపి సార్ కి కదా మేజర్ ని కలవమని చెప్పింది. ఇంతలో ఆ విషయం ముకుంద కి ఎలా తెలిసింది. ముకుందా ఏసీబీ సార్ ఇద్దరు ఇంటికి కలిసి ఎందుకు వచ్చారు. ఇప్పుడు ముకుందా నిజం చెబుతుంటే ఏసీబీ సార్ ఇంట్లో లేరు అంటే.. కచ్చితంగా ఏదో ఉంది అత్తయ్య అని కృష్ణ అంటుంది. అవును కృష్ణ నువ్వు చెప్పింది నిజమే కానీ ఇది నిజమని నీతో చెప్పలేను. ఎందుకంటే దీని వెనుక ఉన్న అసలు నిజం తెలిస్తే భవాని అక్క కంటే నువ్వు ఎక్కువ బాధపడతావు అని రేవతి మనసులో అనుకుంటుంది.

ముకుందా తన ఫ్రెండ్ గీతికతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ముకుందా ఇంట్లో అందరికీ విషయం చెప్పేసాను. పర్ఫామెన్స్ మాత్రం బాగా అదరగొట్టాను అని అంటుంది. అటుగా వెళుతున్న కృష్ణ ముకుందా మాటలు వింటుంది. నా పర్ఫామెన్స్ చూసిన కృష్ణ ఎప్పుడూ నా మాటలు నమ్మకపోయినా ఈరోజు నమ్మేసింది అని ముకుందా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఈ రోజు నుంచి ఈ ఇంట్లో ఆదర్శ్ అన్న మాటే వింపించదు అనగానే.. కృష్ణ అక్కడికి వస్తుంది. ఆ గీతిక నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని కాల్ కట్ చేస్తుంది ముకుంద.

కృష్ణ మురారి ఎక్కడ అని ముకుందా అడుగుతుంది. నువ్వేగా పొద్దున్న చూసాను అని అన్నావు అని కృష్ణ సమాధానం ఇస్తుంది. అదేంటి మురారిని చూడడమే నేరం అన్నట్టుగా మాట్లాడుతున్నావు. రేపు మాపో మురారితో అని ముకుందా అనగానే.. ఆపు ముకుందా చెప్పడానికి నీకు సంస్కారం లేకపోయినా, వినటానికి నాకు ఉంది అని కృష్ణ అంటుంది. అయితే మంచిది నువ్వు నిన్న వినకపోయినా జరిగేది మాత్రం అదే అని ముకుందా అంటుంది. మనిషి కోసమే నీతి పెట్టారు కానీ నీతి కోసం ఏ మనిషి ఉండడని ఇప్పుడే అర్థం అవుతుంది. నీకు నీతి, నిజాయితీ, ఓ పద్ధతి పాడు అని కృష్ణ అంటుండగా..

ఆపు అని ముకుందా పెద్దగా అరుస్తుంది. నా వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపించుకు.. నాకు నీతి లేదా.. నిజాయితీ ఉంది కాబట్టే నేను కోరుకున్న వ్యక్తికి పెళ్ళైనా కానీ అని ముకుంద అంటుండగా.. ఎహే ఆపు నువ్వు చేసిన పనులకి ఆ పేరు పెట్టడానికి నీకు సిగ్గుగా లేదా అని కృష్ణ అంటుంది. అవును మరి కోపం వస్తుంది. చూడు ఏసిపి సార్ లేకుండా నువ్వు ఇదంతా చెప్పావు అంటే.. నీ మీద నాకు అనుమానంగా ఉంది. ఇదేమైనా శుభ వార్త అందరూ ఉన్నప్పుడు చూసి చెప్పడానికి.. అయినా నాది మురారిది ఒకటే మాట ఒకటే మాట. డు యు అండర్స్టాండ్ అని ముకుందా అంటుంది. ఆ ఒక్కటి ఏంటో నేను తేలుస్తాను అని కృష్ణ అంటుంది. నాకెందుకో నీ మీద నీ బుద్ధి మీద నమ్మకం లేదు. నువ్వు అబద్ధం చెప్పావేమోనని అందుకే ఏసీబీ సార్ లేరేమో, లేని సమయంలోనే కావాలని ఇదంతా చెప్పావని నా డౌట్ అని కృష్ణ ముకుందా తో అంటుంది.

ఇక రేపటి ఎపిసోడ్ లో చీకటి గదిలో ఉన్న భవానీ దేవి దగ్గరకు వెళ్లి లైట్ వేస్తుంది కృష్ణ ముకుంద చెప్పిన మాటలు విని బాధపడుతూ ఉంటుంది ఆదర్శ్ తన జీవితం దేశానికే అంకితం అన్నట్టుగా ఫోన్ కూడా వాడటం లేదని పదే పదే తలుచుకొని బాధపడుతుంది భవానీ దేవి. ఇక ఆదర్శ్ తిరిగిరాడేమోనమ్మా ముకుం..దా మీ నాన్న ఎప్పుడు నిన్ను తీసుకువెళ్లిపోతాను అని అంటాడు కదా , నువ్వు మీ నాన్నతో వెళ్ళిపో అని భవానీ దేవి అంటుంది.