Krishna Mukunda Murari: అత్తయ్య నేను చెప్పేది నిజం. నిజంగానే మురారి బ్రతికే ఉన్నాడు. ఆ కృష్ణ మురారి ఫేస్ కి ప్లాస్టిక్ సర్జరీ చేయించింది అని అనగానే.. కృష్ణ ఎప్పటికీ అలా చెయ్యదు అని మధు అంటాడు. అవును అని ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. ఇప్పటికీ నేను ఎందుకు కృష్ణ పై ఇలాంటివి చెబుతాను. కావాలంటే హాస్పిటల్ కి రండి నిజం మీకే తెలుస్తుంది అని ముకుంద వాళ్ళను హాస్పిటల్ కి తీసుకు వస్తుంది.

కృష్ణ మా నా అల్లుడు మనకు దగ్గర ఇక అల్లుడ్ని తీసుకుని మన ఇంటికి వెళ్దాం పదాన్ని ప్రభాకర్ హడావుడి చేస్తాడు శకుంతల నువ్వు బిడ్డ అల్లుడు ముగ్గురు రండి నేను ఈ లోపు వెళ్లి బండి తీసుకొని వస్తాను అని చెబుతాడు సరిగ్గా అదే సమయానికి మురారి వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడికి వస్తారు. రేవతి మురారి అంటూ ఆప్యాయంగా పలకరించారు. ఇక ఆ పిలుపుకి మురారి కి కూడా వాళ్ళ అమ్మను గుర్తిస్తాడు. అమ్మ అని పిలుస్తాడు. ఆ తర్వాత పెద్దమ్మ అని భవాని నీ చూపిస్తారు. మురారి అంటూ ఆప్యాయంగా పిలుస్తుంది ఆ తర్వాత మురారిని తీసుకొని నువ్వు వెళ్లి కారులో కూర్చొ అని భవాని చెబుతుంది. మురారి వెళ్తూ వెళ్తూ కృష్ణ వైపు చూడగా వెళ్ళు అన్నట్టుగా సైగ చేస్తుంది. ఇక ఇప్పుడు అసలైన సీన్ మొదలవుతుంది.

పెద్ద అత్తయ్య అని కృష్ణ భవానీన్ని పిలవగానే కృష్ణ చంప పగలగొడుతుంది మురారి కి ఇదంతా జరగడానికి కారణం నువ్వే. నువ్వు మా మురారిని మాకు దూరం చేయడానికి ఇదంతా చేశావు. మీ తక్కువ జాతి వాళ్ళు అంతా ఇంతే అని అంటుంది. మీరంతా ఎంతో కుట్ర చేశారు. మురారి చనిపోయాడని నీకు మీ చిన్నాన్న చెప్పాడు కదా అయినా ఎందుకు మీరు మురారి బతికే ఉన్నాడని మాకు ఒక్క ఫోన్ కూడా చేసి చెప్పలేదు. ఇప్పుడు మురారిని మేం చూడకుండా ఉండాలని మీరు తీసుకువెళ్లిపోవాలని అనుకుంటున్నారు అని భవాని కృష్ణ ని అరుస్తుంది. అది కాదు పెద్ద అత్తయ్య నాకు తెలిసింది కూడా ఇప్పుడే అని అంటుండగా.. లేదు మీరు ఇదంతా కావాలనే చేశారు అని భవాని కృష్ణని అరుస్తుంది.

ఆపు ముకుందా ఇదంతా నీ వల్లే జరిగింది మురారిని ప్రేమకు దూరంగా పారిపోవటం వల్లే ఇదంతా జరిగింది అని కృష్ణ అంటుంది చాల్లే ఆపు చేయాల్సిందంతా నువ్వు మీ చిన్నాన్న చేసి ఇప్పుడు నా మీద తోస్తున్నారా.. మురారి కి యాక్సిడెంట్ జరిగింది కదా నీ ఫేసులో ఎంత కూడా బాధ కనిపించడం లేదు. ఏంటి నిన్న మొన్న మీరందరూ క్యాంటీన్లో కూర్చుని బాగా తిన్నారు కదా ఆ బిల్స్ చూపించమంటారా అని ముకుందా అంటుంది. ఇప్పుడు దాకా లేచిన నోరు ఇప్పుడు లెగవటం లేదేంటి అని భవాని కృష్ణను ప్రశ్నిస్తుంది. ప్రసాద్ పోలీసులకు కాల్ చేసావా అని భవాని అడుగుతుంది వస్తున్నారు వదిన అని అంటాడు. రాణి వాళ్లని వీళ్ళు చేసిన వంచనకి దగ్గరకి తగిన శిక్ష అనుభవించాల్సిందే అని అంటుంది.

మేము కానీ, మా బిడ్డ, మా పెనిమిటి కానీ, ఎలాంటి తప్పు చేయలేదు అని శకుంతల భవాని అంటుంది. మేము ఏమి చెయ్యలేదు వదిన అని అంటుంది. ఆపు ఇంకొక్క మాట మాట్లాడిన బాగోదు అని శకుంతల ను చూసి భవాని పెద్దగా అంటుంది. మేము ఎలాంటి తప్పు చేయలేదు వదిన అంటున్న భావని వినదు.

ఇక పోలీసులు కూడా అక్కడికి వస్తారు. రండి ఇన్స్పెక్టర్ గారు కృష్ణుని అరెస్టు చేసి జైల్లో వేయండి అని అంటుంది భవాని. మేడం మాకు సహకరించండి అని కృష్ణ చేతులకి సంకెళ్లు వేస్తుండగా.. ప్రభాకర్ అక్కడికి వచ్చి ఆగండి అని అంటాడు. ఇన్స్పెక్టర్ గారు భవాని అక్క చెప్పిందంతా నిజమే అని ప్రభాకర్ అనడంతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

ఇక రేపటి ఎపిసోడ్ లో కృష్ణ మురారి వాళ్ళ ఇంటికి వస్తుంది ఏంటి నువ్వు వేసిన ప్లాన్ వర్క్ అవుట్ కాలేదని ఇంక మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చేసావా అని భవాని అడుగుతుంది. మా అబ్బాయి నార్మల్ అయిన తర్వాత ఆ పెళ్లిని రద్దు చేస్తాను అని భవాని అంటుంది. ఇక నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు.