Krishna Mukunda Murari: కృష్ణ లేచేసరికి మురారి కనిపించడం ఏంటి ఏసీబీసీ అని లేపకుండా ఎక్కడికి వెళ్లరు. అలాంటిది ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు అని వాష్ రూమ్ లో చూస్తుంది. అక్కడ మురారి ఉండడు. గబగబా పక్క దుప్పట్లో మడతేసి కిందకు వచ్చి ఎసిపి సార్ అంటూ ఇల్లంతా వెతుకుతుంది. అప్పుడే మురారి ముకుంద తో కలిసి వాకింగ్కి వెళ్లడం కృష్ణ చూస్తుంది. నేను వస్తాను అని అనబోతు ఆగిపోతుంది తనని పిలవలేదు అన్న ఆలోచనతో..

ఇక మురారి వాకింగ్ చేస్తూ ఉండగా ముకుంద వచ్చి మురారి కి అడ్డుపడుతుంది. నాకు టైం అవుతుంది పక్కకి జరుగు అని మురారి అంటాడు. ఏంటి ఇక్కడ మాట్లాడే వాళ్ళు నీకు అంత పిచ్చి వాళ్ళ లాగా కనిపిస్తున్నారా అని ముఖంగా అంటుంది నువ్వు ఇలాంటి పనులు చేస్తే నీ మీద ఉన్న ఇంకాస్త మంచి ఇన్ఫర్మేషన్ కూడా పోతుంది అని అంటాడు. నువ్వు చూస్తూ ఉండు కృష్ణ ని ఈ ఇంటి నుంచి పంపించేస్తాను అని మురారి ముకుందా అంటుంది. నువ్వు ఎంత ట్రై చేసినా ఈ ఇంటికి గుమ్మం కూడా దాటనివ్వలేవు అని మురారి అంటాడు. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నేను చూస్తాను అని మురారి అంటాడు.

సరే మురారి ఈరోజు నుంచి సరిగ్గా పది రోజుల్లో కృష్ణ ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది నువ్వు కాదు కదా మీ కుటుంబం మొత్తం వచ్చిన ఆఖరికి భవాని దేవి అత్తయ్య వచ్చిన ఆదర్శ్ వచ్చినా కూడా నా దారికి అడ్డుపడలేరు. ఆదర్శ్ వచ్చినదారినే వెళ్ళిపోతాడు. ఇక ఇప్పుడు వరకు నువ్వు నా ప్రేమనే చూసావు ఇప్పటినుంచి నా బరి తెగింపును చూస్తావు అని ముకుందా అంటుంది. ఇంక అయిపోయిందా అని మురారి అంటాడు. నాకు ఇష్టం లేకుండా నువ్వు నాతో ట్రావెల్ చేయలేవు అని మురారి అంటాడు.

మురారి అక్కడి నుంచి వెళ్ళిపోయి బైక్ స్టార్ట్ చేస్తాడు. సరిగ్గా అదే సమయానికి ముకుంద బైక్ ఎక్కపోతుండగా పడిపోతుంది. అది చూసిన మురారి ముకుంద పడిపోవడం చూసి, ఏమైనా దెబ్బలు తగిలాయా అని అంటాడు. నడుము కి బాగా దెబ్బ తగిలింది అని ముకుంద లేగవలేక పోతుందని మురారి చేయి ఇచ్చి మరీ లేపుతాడు. ఇక తనని బైక్ మీద ఎక్కించుకున్నాడు. మురారి నీ షోల్డర్ మీద హ్యాండ్ వేసుకోనా అని ముకుంద అంటుంది. సరే అని మురారి అంటాడు. ఇక ముకుంద బైక్ మీద మురారి తో తనకు నచ్చినట్టు ఊహించుకుంటుంది.

ఇక ఇంటికి వచ్చే సమయానికి కృష్ణ తులసి కోట ముందు పూజ చేస్తూ ఉంటుంది. మురారి ముకుంద ఇక కావాలని హై డ్రామా చేస్తుంది. ముకుంద తనకు పెయిన్ వస్తుందని ఇంట్లోకి తనని తీసుకు వెళ్ళడానికి మురారి హెల్ప్ చేస్తాడు అని ముకుంద ఓవర్ యాక్షన్ చేస్తుంది. మురారి అప్పటికే కృష్ణ కృష్ణ కృష్ణ అని పిలుస్తాడు. అప్పటికే అనుమానం వచ్చిన కృష్ణ మౌనంగా తులసి కోట చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మొత్తానికి మురారి ముకుంద ని తీసుకుని ఇంట్లోకి వస్తాడు. ఇక ఇంట్లోకి తీసుకురాగానే ముకుందా నాకు ఇప్పుడు కొంచెం బానే ఉంది నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోతుంది అప్పుడు మురారి కి ముకుంద పైన అనుమానం వచ్చేది ఉంటుందా కావాలని ఇదంతా చేస్తుందా కృష్ణకు అనుమానం రావాలని ఇదంతా చేస్తుందని ఆలోచిస్తూ ఉండిపోతాడు అప్పుడే కృష్ణ వచ్చి వీరిద్దరూ వాకింగ్ కి వెళ్తే నాకు చెప్పచ్చు కదా ఏసీబీ సార్ నేను వస్తాను అని కృష్ణ అంటుంది అయినా ముకుంద ఎలా పడిపోయింది అని అంటే రన్నింగ్ చేస్తూ పడిపోయింది అని మురారి అంటాడు ఇప్పుడు ఎలా ఉంది తనకి నేను డాక్టర్ని ఉన్నాను కదా అంటూ తన గదిలోకి వెళ్తుంది ముకుందా ఏమైంది రన్నింగ్ చేస్తూ ఎలా పడిపోయావు అని అడగగా మురారి ఏదో చెప్పినట్టు ఉన్నాడు అని ముకుందా అది మార్చి చెప్పాలి అని నేను మురారి బైక్ ఎక్కుతుండగా పడిపోయాను మురారి హెల్ప్ చేసి మళ్లీ నన్ను బయట ఎక్కించి ఇంటికి తీసుకువచ్చాడు అని చెప్పి చెబుతుంది ముకుందా ముకుందా ప్రవర్తన చూసి కృష్ణకు అనుమానం కలుగుతుంది ముఖంలో చెప్పింది నిజమా లేదంటే ఏసీబీ సార్ చెప్పింది నిజమా అయినా ఇందాక బాగోలేదు అని అంది ఇప్పుడు ఇంత కూల్ గా ఎలా ఉంది అని కృష్ణ ఆలోచనలో పడుతుంది.

మరోవైపు అలేఖ్య వచ్చి సంతోషంగా ఉన్న ముకుందను చూసి ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు .మురారితో నువ్వు చెప్పాలనుకున్నది చెప్పేసావా.. తెలుసుకోవాలనుకున్నది తేల్చుకున్నావా అని అడుగుతుంది. అవును ఈరోజు నుంచి ఇకనుంచి నాకు అన్నీ మంచి రోజులే అని ముకుందా అంటుంది. నీకు ఒక విషయం చెప్పాలి ముకుందా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి మీ దగ్గర ఎలాంటి సీక్రెట్స్ నేను దాచను ఆ రోజు నువ్వు ఒకటి చూపించాలి అన్నావు కదా.. అది అంతా చేంజ్ చేసింది ఎవరో అని అలేఖ్య అనగానే.. ఇంకెవరు రేవతి అత్తయ్య అని ముకుందా అంటుంది. కాదు మా మధు అని అలేఖ్య చెబుతుంది. ఆ మాటకు ముకుందా షాక్ అవుతుంది.
ఇక రేపటి ఎపిసోడ్లో కృష్ణ మధు గురించి మాట్లాడుతుంది కానీ ఇక్కడ జరిగేది ఒకటి మీరు మాట్లాడుకున్నది ఇంకోటి అని భవాని అంటుంది. అప్పుడే ముకుందని భవాని మొన్న నాకు ఏదో చూపిస్తాను అన్నావుగా అదేంటో చెప్పు అని నిలదీస్తుంది. ఇక ముకుంద ఏం చెబుతుందో చూడాలి.